కర్నూలులో మైనార్టీ భవన్ నిర్మాణం
–రూ.1.25 కోట్లతో ప్రతిపాదనలు
– కలెక్టర్ వెల్లడి
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలులో మైనార్టీ వర్గాల వారి కోసం సదా్భవన్ మండప్ పేరుతో మైనార్టీ భవన్‌ను నిర్మించనున్నట్లు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. సోమవారం ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్పేర్ అసోసియేషన్( ఆల్‌మేవ)జిల్లా కార్యవర్గ సభ్యులు కలెక్టర్‌ను ఆయన చాంబరులో కలిసి వివిధ సమస్యలపై చర్చించారు. మైనార్టీ ఉద్యోగులు, ప్రజల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి షేక్ మస్తాన్‌వలితో కలిసి కలెక్టర్ వివరించారు. మైనార్టీ భవన్ నిర్మాణానికి రూ.1.25 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని చెప్పారు. మైనార్టీ ఉద్యోగులు వినియోగించుకోవడంతో పాటు, వృత్తి నైపుణ్యాల శిక్షణ కేంద్రంగా వాడుకునేలా భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. ఆదోనిలో రూ.15 కోట్లతో మైనార్టీ బాలికల కోసం జవహర్ నవోదయ విద్యా సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించినట్లు వివరించారు. అరేకల్‌లో రూ.3.99 కోట్లతో మైనార్టీ ఐటీఐ నిర్మిస్తున్నట్లు తెలిపారు. అల్‌మేవ వ్యవస్థాపకుడు సయ్యద్‌హుసేన్ మాట్లాడుతూ నంద్యాలలో ఉర్దూ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం మైనార్టీల అభ్యున్నతికి కలెక్టర్ చేస్తున్న కృషి అభినందనీమని కొనియాడుతూ అల్‌మేవ నేతలు కలెక్టర్‌ను సత్కరించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, ఆల్‌మేవ వ్యవస్థాపకుడు సయ్యద్‌హుసేని, జిల్లా అధ్యక్షుడు సర్దార్ అబ్దుల్ హమీద్, జిల్లా కార్యదర్శి రియాజ్‌బాషా, వర్కింగ్ ప్రెసిడెంటు మహబూబ్‌బాష, ఇతర నాయకులు దాదాపీర్, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.