ఉచిత ఎంసెట్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
Published Sun, Mar 19 2017 12:04 AM | Last Updated on Tue, Sep 5 2017 6:26 AM
– దరఖాస్తుకు 23వ తేదీ వరకు గడువు
కర్నూలు(రాజ్‌విహార్): ఎంసెట్–2017కు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు రీజినల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్, ప్రొఫెసర్ సయ్యద్ ఇందాద్ అలీ ఖాద్రీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, జౌనులు, సిక్కులు అర్హులని.. ఇంటర్మీడియేట్ పూర్తయి, 2వ సంవత్సరం పరీక్షలు రాసే అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎంసెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్‌లైన్ పత్రం జిరాక్స్ కాపీ, 10వ తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు, 2 పాస్‌పోర్టు సైజు ఫొటోలు, కుల ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీలతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 19వ తేదీ వరకు ఉన్న దరఖాస్తు గడువును విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వచ్చిన విన్నపాల మేరకు ఈనెల 23వ తేదీకి పెంచామన్నారు. శిక్షణతో పాటు ఉచితంగా స్టడీ మెటీరియల్ ఇస్తామన్నారు. వివరాలకు స్థానిక ఉస్మానియా కళాశాలలోని రూమ్ నంబర్ 54లో ఉన్న తమ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని, 94945 55961, 94417 61178 ఫోన్ నెంబర్లలోనూ సమాచారం పొందవచ్చన్నారు.
Advertisement
Advertisement