అర్హులందరికి దుల్హన్ పథకం వర్తింపు
Published Wed, May 17 2017 11:12 PM | Last Updated on Tue, Sep 5 2017 11:22 AM
జిల్లామైనార్టీ సంక్షేమ అధికారి మస్తాన్‌వలి
పాములపాడు: జిల్లాలో అర్హులైన లబ్ధిదారులందరికీ దుల్హన్ పథకం వర్తింపజేస్తునట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మస్తాన్‌వలి తెలిపారు. బుధవారం మండలంలోని బానుముక్కల గ్రామ పంచాయతీ భవనంలో విలేకరులతో మాట్లాడుతూ 2016 అక్టోబర్ 10 నాటికి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న 2431 మంది లబ్ధిదారులకు వారి బ్యాంకు ఖాతాల్లో రూ.12కోట్లు జమ చేసినట్లు చెప్పారు. 2017–18 సంవత్సరానికి గాను తొలి విడతలో రూ.4.56కోట్ల నిధులు మంజూరైనట్లు వివరించారు. ఈ పథకం అమలులో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో ఉందని చెప్పారు. ఈ పథకం ద్వారా లబ్ధిపొందాలంటే మైనార్టీ వర్గానికి చెందిన వారు వివాహమైన 56 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. అమ్మాయి వయస్సు 18, అబ్బాయి వయస్సు 21 సంవత్సరాలుండి ఆధార్, బ్యాంకు ఖాతా, పెళ్లి ఫొటో, కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మండల స్థాయిలో విచారణ అనంతరం జిల్లా కేంద్రానికి ఆన్‌లైన్‌లో పంపుతారని చెప్పారు.
Advertisement
Advertisement