మైనారిటీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందించే ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచినట్లు జిల్లా మైనారిటీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు మహమ్మద్ అంజాద్ అలీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఉపకార వేతనాల దరఖాస్తుకు గడువు పెంపు
Published Thu, Nov 3 2016 12:16 AM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM
కర్నూలు(రాజ్‌విహార్): మైనారిటీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందించే ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచినట్లు జిల్లా మైనారిటీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు మహమ్మద్ అంజాద్ అలీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్యార్థులు (ప్రీ మెట్రిక్), కళాశాల విద్యార్థులు (పోస్టు మెట్రిక్) స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబరు 31వ తేదీతో గడువు ముగిసిందన్నారు. అయితే ఈ గడువును ఈనెల 30వ తేదీకి పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సౌకర్యాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 08518 277153, 91601 05162 నంబర్లను సంప్రదించాలని కోరారు.
Advertisement
Advertisement