చెన్నై: ఖాతాదారుల సౌకర్యార్థం ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ (ఐవోబీ) సేవింగ్స్ అకౌంట్ పోర్టబిలిటీ సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో కస్టమర్లు తమ ఖాతాను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంలోని శాఖకు ఆన్‌లైన్‌లో బదిలీ చేసుకోవచ్చని బ్యాంక్ ప్రకటించింది. విద్య, ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు మారే వారికి ఇది సౌకర్యంగా ఉంటుందని ప్రకటించింది.
అకౌంట్ బదిలీ కోరుకునే వారు ఒకటికి మించిన పత్రాలను పూరించి, దాఖలు చేయాల్సిన శ్రమ దీంతో తప్పుతుందని, అకౌంట్ బదిలీకి ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన అవస్థ తొలగిపోతుందని పేర్కొంది. మా కస్టమర్ల బ్యాంకింగ్ ప్రయాణాన్ని మరింత సమర్థవంతంగా, సులభంగా మార్చేందుకు సేవింగ్స్ అకౌంట్ పోర్టబిలిటీని ఆన్‌లైన్‌లో తీసుకొచ్చామని ఐవోబీ ఎండీ, సీఈవో అజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు.
టెక్నాలజీ సాయంతో వినూత్నమైన పరిష్కాలను అందించేందుకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. అకౌంట్ బదిలీ కోరుకునే వారు ఐవోబీ అధికారిక పోర్టల్‌లో లాగిన్ అయి, ‘ట్రాన్స్‌ఫర్ ఆఫ్ సేవింగ్స్ అకౌంట్’ సెక్షన్‌కు వెళ్లాలి. అకౌంట్ నంబర్ నమోదు చేసి, రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. ఏ శాఖకు బదిలీ చేయాలన్న వివరాలను కూడా నమోదు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment