క్యాష్ విత్‌డ్రాయల్స్‌పై పరిమితిని తొలగించాలని పరిశ్రమ సమాఖ్య అసోచామ్ తాజాగా కేంద్రానికి విన్నవించింది. రూ.50,000లు మాత్రమే విత్‌డ్రా అనే నిబంధన వల్ల పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. ఈ లిమిట్ చాలా స్వల్పమని, దీన్ని పెంచాల్సిన అవసరం ఎంతైన ఉందని తెలిపింది. ‘కరెంట్ అకౌంట్ నుంచి వారానికి రూ.50,000లు మాత్రమే విత్‌డ్రా పరిమితి వల్ల పరిశ్రమలు చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారుు. సంస్థలకు ఈ మొత్తం చాలా చిన్నది. అందుకే పరిమితిని పెంచాలి. పరిశ్రమలకు ఇలాంటి పరిమితులతో అవసరం లేదు. ఎందుకంటే ఇవి నిర్వహించే లావాదేవీలన్నీ నమోదు అవుతారుు. వీటిని ప్రభుత్వ యంత్రాంగం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది’ అని వివరిస్తూ అసోచామ్.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాసింది.