cash withdrawals
-
పెరుగుతున్న క్యాష్ విత్‌డ్రాలు!
భారత్‌లో యూపీఐ చెల్లింపులు పెరుగుతున్నప్పటికీ గతేడాది ఏటీఎంల నుంచి చేసే నగదు ఉపసంహరణలు 5.51 శాతం పెరిగినట్లు తాజాగా సీఎంఎస్ నివేదిక వెల్లడించింది. దేశ ఆర్థిక వృద్ధి రేటు 9 శాతం పెరుగుతుందని అంచనాలు వెలువడుతున్నా ఆ మేరకు నగదు ఉపసంహరణ మాత్రం పెరగడంలేదని నివేదిక ద్వారా తెలిసింది.2022-23 ఆర్థిక సంవత్సరంలో చేసిన నగదు ఉపసంహరణల కంటే 2023-24లో చేసిన నెలవారీ విత్‌డ్రాలు సగటున 7.23 శాతం ఎక్కువగా ఉన్నాయి. గతేడాదిలో మెట్రోనగరాల్లో విత్‌డ్రా చేసిన సగటు నగదు అంతకుముందు ఏడాదికంటే 10.37 శాతం పెరిగింది. సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో 3.94 శాతం పెరుగుదల కనిపించింది.భారత్‌లో గతేడాది ఏటీఎంల ద్వారా అధికంగా డబ్బు తీసుకున్న ఉత్తరాది ప్రాంతాల్లో దిల్లీ, ఉత్తరప్రదేశ్‌లు ఉన్నాయి. దక్షిణాదిలో తమిళనాడు, కర్ణాటక ప్రజలు అధికంగా డబ్బు విత్‌డ్రా చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి 49 శాతం ఏటీఎంలు మెట్రోపాలిటన్, పట్టణ ప్రాంతాల్లో ఉండగా, 51 శాతం ఏటీఎంలు సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.ఇదీచదవండి: ఓటీటీ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను సగానికి తగ్గించిన ప్రభుత్వ సంస్థప్రైవేట్ రంగ బ్యాంకులకు సంబంధించి 64 శాతం ఏటీఎంలు మెట్రోపాలిటన్, పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. 36 శాతం ఏటీఎంలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లు తెలిసింది. -
యూపీఐ ఏటీఎం: కార్డు లేకుండానే క్యాష్, వీడియో వైరల్
UPI ATM ఒకవైపు ఇండియా డిజిటల్ పేమెంట్స్ దూసుకుపోతోంది. మరోవైపు డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ మోసాలకు చెక్ పెడుతూ యూపీఐ ఏటీఎం సేవలు అందుబాటులోకి రానున్నాయి. హిటాచీ పేమెంట్ సర్వీసెస్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సహకారంతో మోసగాళ్ల ద్వారా కార్డ్ స్కిమ్మింగ్ ప్రమాదాలను నివారించి, సురక్షితమైన లావాదేవీల నిమిత్తం ఈ కొత్త ఆవిష్కరణముందుకు వచ్చింది. కార్డ్ లెస్ , వైట్-లేబుల్ యూపీఐ ఏటీఎం (UPI ATM) ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. కార్డ్‌లెస్ అంటే కార్డ్ లేకుండా డబ్బు విత్‌డ్రా చేసుకునే సదుపాయం. ఈ సౌలభ్యంతో దేశంలోనే తొలి QR-ఆధారిత UPI నగదు ఉపసంహరణల ఏటీఎం ముంబైలో కొలువుదీరింది. (ఇషా అంబానీకి కొత్త బాధ్యతలు: కుమార్తెపై నీతా నమ్మకం అలాంటిది!) జపాన్‌కు చెందిన హిటాచీ లిమిటెడ్‌కు అనుబంధంగా ఉన్న హిటాచీ పేమెంట్ సర్వీసెస్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ)తో కలిసి హిటాచీ మనీ స్పాట్ యూపీఐ ఎటిఎం (డబ్ల్యూఎల్ఎ) పేరుతో వైట్ లేబుల్ ఎటిఎం (డబ్ల్యూఎల్ఎ)గా భారతదేశపు తొలి యుపిఐ-ఏటీఎంను మంగళవారం ప్రారంభించింది.ఫిజికల్ కార్డ్‌ల అవసరాన్ని తొలగిస్తూ, కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణలను ATM ఆఫర్ చేస్తుందని కంపెనీ ప్రకటనలో తెలిపింది. యూపీఐ ఏటీఎం ద్వారా కార్డు మోసాలు, కార్డ్ స్కిమ్మింగ్ లాంటి వాటిన బారిన పడకుండా మనీ విత్ డ్రా చేసుకోవచ్చు. గ్లోబల్ ఫిటెక్ ఫెస్ట్ టెక్ ఈవెంట్ సందర్భంగా ముంబైలో ఈ యూపీఐ ఏటీఎం ద్వారా మనీ విత్ డ్రా చేసినట్టు రవిసుతంజని పేర్కొన్నారు. వినూత్నమైన ఫీచర్, ముంబైలోని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో UPIని ఉపయోగించి నగదు ఉపసంహరణ చేశా అంటూ దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. కోడ్‌ను స్కాన్, చేసి,పిన్ ఎంటర్ చేసి, కావాల్సిన నగదు ఎంపిక చేసుకుంటే చాలు. అంతేకాదు దీనికి ఏటీఎం విత్‌డ్రాయల్ చార్జీలు అమలవుతాయని, ఉచిత వినియోగ పరిమితికి మించి ఛార్జీలు వర్తించవచ్చుని తెలిపారు. ప్రస్తుతం BHIM UPI యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవ త్వరలోనే మరిన్ని యాప్‌లకు దశలవారీగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. త్వరలోనే దేశవ్యాప్తంగా, అన్ని యాప్‌లకు యూపీఐ ఏటీఎంలు రాబోతున్నాయని తెలిపారు. ఈ ట్వీట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రీట్వీట్ చేయడం గమనార్హం. ఏటీఎంల వద్ద కార్డు అవసరం లేకుండానే నగదు ఎలా విత్ డ్రా చేయాలో ఈ వీడియోలో చూడండి. 🚨 ATM Cash Withdrawal using UPI Today I Made a Cash Withdrawal using UPI at Global FinTech Fest in Mumbai What an Innovative Feature for Bharat pic.twitter.com/hRwcD0i5lu — Ravisutanjani (@Ravisutanjani) September 5, 2023 -
బీవోబీ ఏటీఎంలో యూపీఐతో విత్‌డ్రాయల్
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తన కస్టమర్లకు మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటరాపరేబుల్ క్యాష్ విత్‌డ్రాయల్ (ఐసీసీడబ్ల్యూ) సదుపాయం కింద.. యూపీఐ సాయంతో ఏటీఎంల నుంచి నగదును ఉపసంహరించుకోవచ్చని (విత్‌డ్రాయల్) ప్రకటించింది. ఈ సేవలు ప్రారంభించిన మొదటి ప్రభుత్వరంగ బ్యాంక్‌గా బీవోబీ నిలిచిపోనుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లతో పాటు, ఇతర భాగస్వామ్య బ్యాంకుల కస్టమర్లు.. భీమ్ యూపీఐ, బీవోబీ వరల్డ్ యూపీఐ లేదా మరేదైనా యూపీఐ ఆధారంగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం నుంచి డబ్బులు (డెబిట్ కార్డు అవసరం లేకుండా) తీసుకోవచ్చని తెలిపింది. కస్టమర్లు ఏటీఎం యంత్రంలో యూపీఐ క్యాష్ విత్‌డ్రాయల్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. తర్వాత ఎంత మొత్తం తీసుకోవాలో నమోదు చేయాలి. ఆ తర్వాత ఏటీఎం స్క్రీన్‌పై క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. కస్టమర్ తన ఫోన్లోని యూపీఐ యాప్ తెరిచి ఏటీఎం స్క్రీన్‌పై కనిపించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. తర్వాత యూపీఐ పిన్ను మొబైల్ యాప్‌లో నమోదు చేయాలి. దీంతో లావాదేవీ ప్రాసెస్ అయ్యి నగదు బయటకు వస్తుంది. ఒకటికి మించిన బ్యాంకు ఖాతాలకు యూపీఐ ఉంటే, అప్పుడు విడిగా ఏదన్నది ఎంపికకు అవకాశం ఉంటుంది. ఒక్క లావాదేవీలో రూ.5,000 చొప్పున, రోజులో రెండు లావాదేవీలనే ఈ రూపంలో అనుమతిస్తారు. -
గోల్డ్ ఏటీఎంలూ వచ్చేస్తున్నాయ్
సనత్‌నగర్: నగదు విత్‌డ్రాయల్స్, జమకు ఉపయోగపడే ఏటీఎంల తరహాలోనే బంగారం కోసం కూడా ఏటీఎంలు దేశీయంగా అందుబాటులోకి రానున్నాయి. గోల్డ్ సిక్కా సంస్థ నెల, నెలన్నర వ్యవధిలో వీటిని ఏర్పాటు చేయనుంది. తొలుత హైదరాబాద్‌లో (చార్మినార్, సికింద్రాబాద్, అబిడ్స్) మూడు గోల్డ్ ఏటీఎంలను ప్రారంభించనున్నట్లు సంస్థ సీఈవో ఎస్‌వై తరుజ్ గురువారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. వీటి నుంచి ఒకేసారి 0.5 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకూ బంగారాన్ని నాణేల రూపంలో కొనుగోలు చేయవచ్చన్నారు. ఇందుకోసం డెబిట్, క్రెడిట్ కార్డులు లేదా తాము జారీ చేసే ప్రీపెయిడ్ కార్డులనూ ఉపయోగించవచ్చని చెప్పారు. బంగారం స్వచ్ఛతకు సంబంధించిన వివరాలన్నింటితో ప్యూరిటీ సర్టిఫికెట్ కూడా కొనుగోలు సమయంలోనే పొందవచ్చని తరుజ్ వివరించారు. ఒక్కో మిషన్‌లో ఒకేసారి రెండున్నర కోట్ల విలువైన 5 కేజీల పసిడిని లోడ్ చేయవచ్చని తరుజ్ వివరించారు. భారత్‌లో గోల్డ్ మార్కెట్ వేళలకు అనుగుణంగా ఉదయం 9.50 నుంచి రాత్రి 11.30 వరకు ఏటీఎంల ద్వారా గోల్డ్ తీసుకోవచ్చన్నారు. ప్రస్తు తం దుబాయ్, బ్రిటన్లలో మాత్రమే ఏటీఎంల ద్వారా 10 గ్రాములు, 20 గ్రాముల గోల్డ్ కాయిన్స్ ను కొనుగోలు చేసే సదుపాయం ఉందని చెప్పారు. -
ఏటీఎం సెంటర్లలో రూల్స్ మారాయ్..వాటి గురించి మీకు తెలుసా?
కరోనా కారణంగా ఆన్లైన్ మోసాలు బాగా పెరిగిపోతున్నాయి. ఈజీ మనీ కోసం సైబర్ నేరస్తులు బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బుల్ని కాజేసేందుకు కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థ ఎస్బీఐ వినియోగదారుల కోసం జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఏటీఎం సెంటర్లలో జరిగే మోసాల్ని అరికట్టేందుకు వన్ టైమ్ పాస్ వర్డ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానం వల్ల ఏటీఎం సెంటర్లలో జరిగే సైబర్ నేరాల్ని నివారించేలా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. Our OTP based cash withdrawal system for transactions at SBI ATMs is vaccination against fraudsters. Protecting you from frauds will always be our topmost priority.#SBI #StateBankOfIndia #ATM #OTP #SafeWithSBI #TransactSafely #SBIATM #Withdrawal pic.twitter.com/uCbkltrP8T — State Bank of India (@TheOfficialSBI) October 24, 2021 ఎస్బీఐ ఏటీఎం సెంటర్లలో కొత్త రూల్ ►ఏటీఎం సెంటర్లలో రూ.10వేల కంటే ఎక్కువ మొత్తాన్ని డబ్బుల్ని డ్రా చేసే వారికోసం ఎస్బీఐ ఈ కొత్త ఓటీపీ రూల్ ను అమలు చేస్తోంది. మరి ఆ రూల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ►ఎస్బీఐ ఏటీఎం సెంటర్లలో 10వేల కంటే ఎక్కువ మొత్తాన్ని డబ్బుల్ని డ్రా చేయాలంటే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ►ఏటీఏం సెంటర్లో బ్యాంక్ అకౌంట్ హోల్డర్లు ఏటీఎం మెషీన్లో డెబిట్ కార్డ్ ఇన్ సర్ట్ చేసిన తరువాత కార్డ్ పిన్, విత్ డ్రాల్ అమౌంట్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఓటీపీని ఎంటర్ చేయాలని అడుగుతుంది. ►ఆ సమయంలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ►ఇక ఈ ఓటీపీని అనేది ఒక్క విత్ డ్రాల్‌కి మాత్రమే పనిచేస్తుంది. రెండో సారి విత్ డ్రాల్ చేయాలంటే మరో కొత్త ఓటీపీని ఎంటర్ చేయాలని ఎస్బీఐ తెలిపింది. చదవండి: బంపర్ ఆఫర్: పోస్టాఫీస్ ఫ్రాంఛైజ్,పెట్టుబడి తక్కువ..సంపాదన ఎక్కువ -
ఓటీపీతో ఎస్బీఐ ఏటీఎంల నుంచి నగదు
న్యూఢిల్లీ: ఎస్బీఐ ఏటీఎంకు చీకటి పడిన తర్వాత వెళుతున్నారా..? కార్డుతోపాటు, చేతిలో మొబైల్ ఫోన్ కూడా ఉండాలి. ఎందుకంటే ఓటీపీ సాయంతోనే నగదు ఉపసంహరణ జరిగే విధానాన్ని ఎస్బీఐ దేశవ్యాప్తంగా తన ఏటీఎంలలో ప్రవేశపెడుతోంది. రూ.10,000, అంతకుమించి నగదు ఉపసంహరణలకు మాత్రమే ఇది అమలవుతుంది. అది కూడా రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకే. మిగతా వేళల్లో ఇప్పటి మాదిరే ఓటీపీ లేకుండా నగదును తీసుకోవచ్చు. అలాగే, రూ.10వేల లోపు నగదును ఇక ముందూ ఓటీపీ లేకుండా రోజులో ఏ సమయంలో అయినా తీసుకోవచ్చు. జనవరి 1 నుంచే ఈ విధానం అమల్లోకి వస్తోంది. ఓటీపీ విధానం ఇలా.. ► కార్డును ఏటీఎం మెషీన్లో ఉంచి చివర్లో నగదు మొత్తాన్ని టైప్ చేసి ఓకే చేసిన తర్వాత ఖాతాదారుల రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఏటీఎం స్క్రీన్‌పై ఓటీపీ అడుగుతుంది. నంబర్‌ను ప్రవేశపెట్టడం ద్వారానే నగదు ఉపసంహరణకు వీలవుతుంది. ► ఎస్బీఐ ఏటీఎంలలోనే ఈ విధానం. ఎస్బీఐ ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నగదు ఉపసంహరణకు ఓటీపీ విధానం ఉండదు. భవిష్యత్తులో అన్ని బ్యాంకులు ఈ విధానంలోకి మళ్లితే అప్పుడు అన్ని చోట్లా ఓటీపీ అవసరపడుతుంది. ► ఖాతాదారులు తమ కార్డును పోగొట్టుకున్నా లేదా కార్డు వివరాలను మరొకరు తెలుసుకుని అనధికారికంగా, మోసపూరిత లావాదేవీలు చేద్దామనుకుంటే కుదరదు. ఎందుకంటే కచ్చితంగా ఓటీపీ ఉంటేనే పని జరుగుతుంది. దీంతో ఎస్బీఐ ఏటీఎం లావాదేవీలు మరింత సురక్షితంగా మారనున్నాయి. -
కోటి దాటితే కోతే!!
సాక్షి, అమరావతి: వ్యవస్థలో నగదు చలామణీని తగ్గించి డిజిటల్ లావాదేవీలను పెంచే దిశగా కేంద్రం పలు చర్యలను ప్రకటించింది. ఇందులో భాగంగా బ్యాంకుల నుంచి ఒక ఏడాదిలో నగదు రూపంలో కోటి రూపాయలు మించి విత్‌డ్రా చేస్తే అదనంగా కొంత చేతి చమురు వదలనుంది. నగదు రూపంలో కోటి రూపాయలు దాటి తీస్తే రెండు శాతం సుంకం విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టంచేశారు. కోటి రూపాయలు దాటి ఎంత మొత్తం తీస్తే ఆ మొత్తంపై రెండు శాతం సర్ చార్జీ చెల్లించాల్సి వస్తుంది. అంటే ఉదాహరణకు బ్యాంకు నుంచి వివిధ సందర్భాల్లో ఒక ఏడాదిలో కోటిన్నర రూపాయలు నగదు రూపంలో తీస్తే ఆటోమేటిక్‌గా మీ అకౌంట్ నుంచి లక్ష రూపాయలు కోత పడిపోతాయి. నగదు చెలామణిని తగ్గించి డిజిటల్ లావాదేవీలు పెంచడం కోసం ఈ సర్ చార్జిని విధిస్తున్నట్లు సీతారామన్ తెలిపారు. ► అదే విధంగా వార్షిక టర్నోవర్ రూ.50 కోట్ల లోపు ఉన్న వారికి డిజిటల్ లావాదేవీలపై విధించే మర్చంట్ డిస్కౌంట్ రేట్‌ను (ఎండీఆర్) పూర్తిగా ఎత్తివేసినట్లు మంత్రి తెలిపారు. అంటే రూ.50 కోట్ల లోపు టర్నోవర్ లోపు ఉన్న వ్యాపార సంస్థల్లో కార్డు లేదా ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేస్తే ఎటువంటి అదనపు రుసుములు చెల్లించనవసరం లేదు. ఈ ఎండీఆర్ భారాన్ని ఆర్బీఐ, బ్యాంకులు సంయుక్తంగా భరిస్తాయని మంత్రి చెప్పారు. ఇప్పటికే డెబిట్ కార్డు ద్వారా రూ.2,000 లోపు జరిపే లావాదేవీలు, భీమ్ యాప్ ద్వారా చేసే లావాదేవీలపై రుసుములు ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ► ఈ మధ్యనే ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ లావాదేవీలపై కూడా కేంద్రం రుసుములను తొలగించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత నుంచి డిజిటల్ లావాదేవీలు పెంచడంపై కేంద్రం చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం అక్టోబర్ 2016లో 79.67 కోట్లుగా ఉన్న డిజిటల్ లావాదేవీల సంఖ్య మార్చి 2019 నాటికి 332.34 కోట్లకు ఎగబాకింది. అదే విలువ పరంగా చూస్తే డిజిటల్ లావాదేవీలు రూ.108 లక్షల కోట్ల నుంచి రూ.258 లక్షల కోట్లకు చేరాయి. ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయంతో డిజిటల్ లావాదేవీలు మరింత పెరిగే అవకాశముందనేది మార్కెట్ పరిశీలకుల అంచనా. -
నగదు ఉపసంహరణలపై పరిమితుల్లేవు
న్యూడిల్లీ/ముంబై: ఖాతాదారుల నగదు ఉపసంహరణలపై ఎలాంటి పరిమితులు విధించలేదని పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) శుక్రవారం స్పష్టం చేసింది. ప్రతి కస్టమర్‌కు రూ.3,000 పరిమితి విధించినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చింది. అలాగే, 18 వేల మంది సిబ్బందిని ఇటీవల బదిలీ చేసినట్టు వచ్చిన వార్తల్లోనూ నిజం లేదని, 1,415 మందినే బదిలీ చేశామని తెలిపింది. మరోవైపు ఖాతాదారుల డెబిట్, క్రెడిట్ కార్డుల సమాచారం లీక్ అయిం దంటూ వస్తున్న నివేదికలను పీఎన్బీ తోసిపుచ్చింది. డేటా భద్రత కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు చేపడుతుందని వివరించింది. క్రికెటర్ విరాట్ కోహ్లీ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారని స్పష్టం చేసింది. అలాగే, రూ.11,400 కోట్ల స్కామ్‌పై ఫోరెన్సిక్ ఆడిటింగ్‌కు ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్‌ను (పీడబ్ల్యూసీ) నియమించుకోలేదని తెలిపింది. నిఘా వ్యవస్థను సమీక్షించుకోవాలి: అలహాబాద్ బ్యాంక్ సీఈవో బ్యాంకులు తమ నిఘా వ్యవస్థలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని అలాహాబాద్ బ్యాంకు ఎండీ, సీఈవో ఉషా అనంత సుబ్రమణ్యం చెప్పారు. పీఎన్బీకి ఆమె గతంలో చీఫ్‌గా ఉన్నారు. స్విఫ్ట్, సీబీఎస్ అనుసంధానం మరోవైపు బ్యాంకుల మధ్య అంతర్గత సమాచారానికి వీలు కల్పించే స్విఫ్ట్ వ్యవస్థను కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌తో (సీబీఎస్) ఏప్రిల్ 1 నాటికి అనుసంధానించుకోవాలని ఆర్బీఐ గడువు విధించింది. పీఎన్బీలో మోసానికి స్విఫ్ట్ వ్యవస్థను దుర్వినియోగం చేసిన విషయం తెలిసిందే. -
క్యాష్ విత్డ్రాయల్స్పై పరిమితి తొలగించండి
-
క్యాష్ విత్డ్రాయల్స్పై పరిమితి తొలగించండి
• వారానికి రూ.50,000 చాలా చిన్న మొత్తం • దీని వల్ల పరిశ్రమలు సమస్యలను ఎదుర్కొంటున్నారుు • ప్రభుత్వానికి అసోచామ్ విజ్ఞప్తి న్యూఢిల్లీ: క్యాష్ విత్డ్రాయల్స్పై పరిమితిని తొలగించాలని పరిశ్రమ సమాఖ్య అసోచామ్ తాజాగా కేంద్రానికి విన్నవించింది. రూ.50,000లు మాత్రమే విత్‌డ్రా అనే నిబంధన వల్ల పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. ఈ లిమిట్ చాలా స్వల్పమని, దీన్ని పెంచాల్సిన అవసరం ఎంతైన ఉందని తెలిపింది. ‘కరెంట్ అకౌంట్ నుంచి వారానికి రూ.50,000లు మాత్రమే విత్‌డ్రా పరిమితి వల్ల పరిశ్రమలు చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారుు. సంస్థలకు ఈ మొత్తం చాలా చిన్నది. అందుకే పరిమితిని పెంచాలి. పరిశ్రమలకు ఇలాంటి పరిమితులతో అవసరం లేదు. ఎందుకంటే ఇవి నిర్వహించే లావాదేవీలన్నీ నమోదు అవుతారుు. వీటిని ప్రభుత్వ యంత్రాంగం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది’ అని వివరిస్తూ అసోచామ్.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాసింది. రూ.500, రూ.1,000 కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో పలు పరిశ్రమలకు సంబంధించిన బ్యాంక్ రుణాల రీపేమెంట్ షెడ్యూల్‌ను పునర్వ్యవస్థీకరించాలని కోరింది. ఫైనాన్స కోసం బ్యాంకులు/ఆర్థిక సంస్థలపై ఆధారపడ్డ కంపెనీలపై పరిమిత సంఖ్యలో నగదు లభ్యత అనే అంశం తీవ్ర ప్రభావం చూపతుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రుణగ్రహితలు మరీ ప్రత్యేకించి ప్రైవేట్ కంపెనీలు, ఎంఎస్ఎంఈ రంగ సంస్థలు వాటి రుణం/వడ్డీ చెల్లింపులల్లో డిఫాల్ట్ అయ్యే ప్రమాదముందని హెచ్చరించింది. అందుకే పలు పరిశ్రమలకు సంబంధించిన బ్యాంక్ రుణాల రీపేమెంట్ షెడ్యూల్‌ను పునర్వ్యవస్థీకరించాలని సూచించింది. క్యాష్ కార్డులను జారీ చేయండి నగదు లభ్యత తక్కువగా ఉన్న తాజా పరిస్థితుల్లో రిటైల్ కస్టమర్లకు, చిన్న వర్తకులకు క్యాష్ కార్డులను జారీ చేయాలని తెలిపింది. దీని వల్ల బ్యాంక్ ఖాతా లేకున్నా లావాదేవీలను నిర్వహించవచ్చని పేర్కొంది. దేశంలో నగదు పంపిణీ (క్యాష్ డిస్ట్రిబ్యూషన్) వేగంగా చేయాల్సి ఉందని, దీని వల్ల వ్యవస్థలో సరిపడ నగదు ఉందనే విశ్వాసం ప్రజల్లో పెరుగుతుందని తెలిపింది. -
విత్డ్రాయెల్స్పై పరిమితితో పరిశ్రమలకు దెబ్బ
కోయంబత్తూర్: కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో క్యాష్ విత్డ్రాయెల్స్పై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించడం వల్ల రియల్టీ సహా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎస్ఎంఈ) రంగాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆయా పరిశ్రమ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీకి రాసిన ఒక మెమోరాండంలో లోకల్ చాప్టర్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఐసీసీఐ).. విత్డ్రాయెల్స్పై పరిమితి అంశంపై తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసింది. దీని వల్ల పరిశ్రమకు సంబంధించిన దైనందిన కార్యకలాపాలు దెబ్బతింటాయని పేర్కొంది. ఎస్ఎంఈలు వాటి కార్యకలాపాల కోసం నగదు లావాదేవీలపైనే ప్రధానంగా ఆధారపడతాయని ఐసీసీఐ ప్రెసిడెంట్ వనిత మోహన్ గుర్తుచేశారు. తాజా పరిమితుల వల్ల ఇవి సమస్యలను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. దీంతో మొత్తంగా ఉత్పత్తి తగ్గొచ్చని అభిప్రాయపడ్డారు. వి కార్మికులు వేతన చెల్లింపులు ఆలస్యం కావొచ్చని తెలిపారు. ‘కార్మికులందరికీ బ్యాంక్ ఖాతాలు ఉండవు. వారికి తప్పనిసరిగా నగదు రూపంలోనే వారం చివరిలో చెల్లింపులు జరపాలి. ఇప్పుడు వారు ఈ వారంలో పేమెంట్స్‌ను కోల్పోయే పరిస్థితి వచ్చింది’ అని ఆందోళన వ్యక్తంచేశారు. కాగా ఈ మెమోరాండంలో తొమ్మిది టెక్స్టైల్ అసోసియేషన్స, పలువురు మ్యానుఫ్యాక్చరర్స్ సహా రియల్టర్ల సమాఖ్య క్రెడాయ్ సంతకాలు చేశారుు.