యూపీఐ ఏటీఎం: కార్డు లేకుండానే క్యాష్‌, వీడియో వైరల్‌ | ATM Cash Withdrawal using UPI Ravisutanjan shared video viral | Sakshi
Sakshi News home page

యూపీఐ ఏటీఎం: కార్డు లేకుండానే క్యాష్‌, వీడియో వైరల్‌

Published Wed, Sep 6 2023 4:50 PM | Last Updated on Wed, Sep 6 2023 5:59 PM

ATM Cash Withdrawal using UPI Ravisutanjan shared video viral - Sakshi

UPI  ATM ఒకవైపు  ఇండియా డిజిటల్‌ పేమెంట్స్  దూసుకుపోతోంది. మరోవైపు డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ మోసాలకు చెక్‌ పెడుతూ యూపీఐ ఏటీఎం సేవలు అందుబాటులోకి రానున్నాయి. హిటాచీ పేమెంట్ సర్వీసెస్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సహకారంతో మోసగాళ్ల ద్వారా కార్డ్ స్కిమ్మింగ్ ప్రమాదాలను నివారించి, సురక్షితమైన లావాదేవీల నిమిత్తం ఈ కొత్త ఆవిష్కరణముందుకు వచ్చింది.  కార్డ్‌ లెస్‌ , వైట్-లేబుల్ యూపీఐ ఏటీఎం (UPI ATM) ఇంటర్నెట్‌లో వైరల్‌గా  మారింది. కార్డ్‌లెస్ అంటే కార్డ్ లేకుండా డబ్బు విత్‌డ్రా చేసుకునే సదుపాయం.  ఈ సౌలభ్యంతో దేశంలోనే తొలి QR-ఆధారిత UPI నగదు ఉపసంహరణల ఏటీఎం  ముంబైలో కొలువుదీరింది. (ఇషా అంబానీకి కొత్త బాధ్యతలు: కుమార్తెపై నీతా నమ్మకం అలాంటిది!)

జపాన్‌కు చెందిన హిటాచీ లిమిటెడ్‌కు అనుబంధంగా ఉన్న హిటాచీ పేమెంట్ సర్వీసెస్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ)తో కలిసి హిటాచీ మనీ స్పాట్ యూపీఐ ఎటిఎం (డబ్ల్యూఎల్‌ఎ) పేరుతో వైట్ లేబుల్ ఎటిఎం (డబ్ల్యూఎల్‌ఎ)గా భారతదేశపు తొలి యుపిఐ-ఏటీఎంను మంగళవారం ప్రారంభించింది.ఫిజికల్ కార్డ్‌ల అవసరాన్ని తొలగిస్తూ, కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణలను ATM ఆఫర్ చేస్తుందని కంపెనీ ప్రకటనలో తెలిపింది.

యూపీఐ ఏటీఎం ద్వారా కార్డు  మోసాలు,  కార్డ్ స్కిమ్మింగ్ లాంటి వాటిన బారిన పడకుండా మనీ విత్‌ డ్రా చేసుకోవచ్చు.  గ్లోబల్‌ ఫిటెక్‌ ఫెస్ట్‌ టెక్‌ ఈవెంట్‌ సందర్భంగా ముంబైలో ఈ యూపీఐ ఏటీఎం ద్వారా మనీ విత్‌ డ్రా చేసినట్టు  రవిసుతంజని  పేర్కొన్నారు. వినూత్నమైన ఫీచర్, ముంబైలోని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో UPIని ఉపయోగించి నగదు ఉపసంహరణ చేశా అంటూ దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌  చేశారు.  కోడ్‌ను స్కాన్‌, చేసి,పిన్‌ ఎంటర్‌ చేసి, కావాల్సిన నగదు ఎంపిక  చేసుకుంటే చాలు.

అంతేకాదు దీనికి ఏటీఎం విత్‌డ్రాయల్‌ చార్జీలు  అమలవుతాయని,  ఉచిత వినియోగ పరిమితికి మించి ఛార్జీలు వర్తించవచ్చుని తెలిపారు.  ప్రస్తుతం BHIM UPI యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ  సేవ త్వరలోనే మరిన్ని యాప్‌లకు దశలవారీగా  అందుబాటులోకి వస్తాయని తెలిపారు. త్వరలోనే  దేశవ్యాప్తంగా, అన్ని  యాప్‌లకు యూపీఐ ఏటీఎంలు రాబోతున్నాయని తెలిపారు.  ఈ ట్వీట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రీట్వీట్‌ చేయడం గమనార్హం. 

ఏటీఎంల వద్ద  కార్డు అవసరం లేకుండానే  నగదు ఎలా విత్‌ డ్రా చేయాలో ఈ వీడియోలో చూడండి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement