card less
-
యూపీఐ ఏటీఎం: కార్డు లేకుండానే క్యాష్, వీడియో వైరల్
UPI ATM ఒకవైపు ఇండియా డిజిటల్ పేమెంట్స్ దూసుకుపోతోంది. మరోవైపు డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ మోసాలకు చెక్ పెడుతూ యూపీఐ ఏటీఎం సేవలు అందుబాటులోకి రానున్నాయి. హిటాచీ పేమెంట్ సర్వీసెస్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సహకారంతో మోసగాళ్ల ద్వారా కార్డ్ స్కిమ్మింగ్ ప్రమాదాలను నివారించి, సురక్షితమైన లావాదేవీల నిమిత్తం ఈ కొత్త ఆవిష్కరణముందుకు వచ్చింది. కార్డ్ లెస్ , వైట్-లేబుల్ యూపీఐ ఏటీఎం (UPI ATM) ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. కార్డ్‌లెస్ అంటే కార్డ్ లేకుండా డబ్బు విత్‌డ్రా చేసుకునే సదుపాయం. ఈ సౌలభ్యంతో దేశంలోనే తొలి QR-ఆధారిత UPI నగదు ఉపసంహరణల ఏటీఎం ముంబైలో కొలువుదీరింది. (ఇషా అంబానీకి కొత్త బాధ్యతలు: కుమార్తెపై నీతా నమ్మకం అలాంటిది!) జపాన్‌కు చెందిన హిటాచీ లిమిటెడ్‌కు అనుబంధంగా ఉన్న హిటాచీ పేమెంట్ సర్వీసెస్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ)తో కలిసి హిటాచీ మనీ స్పాట్ యూపీఐ ఎటిఎం (డబ్ల్యూఎల్ఎ) పేరుతో వైట్ లేబుల్ ఎటిఎం (డబ్ల్యూఎల్ఎ)గా భారతదేశపు తొలి యుపిఐ-ఏటీఎంను మంగళవారం ప్రారంభించింది.ఫిజికల్ కార్డ్‌ల అవసరాన్ని తొలగిస్తూ, కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణలను ATM ఆఫర్ చేస్తుందని కంపెనీ ప్రకటనలో తెలిపింది. యూపీఐ ఏటీఎం ద్వారా కార్డు మోసాలు, కార్డ్ స్కిమ్మింగ్ లాంటి వాటిన బారిన పడకుండా మనీ విత్ డ్రా చేసుకోవచ్చు. గ్లోబల్ ఫిటెక్ ఫెస్ట్ టెక్ ఈవెంట్ సందర్భంగా ముంబైలో ఈ యూపీఐ ఏటీఎం ద్వారా మనీ విత్ డ్రా చేసినట్టు రవిసుతంజని పేర్కొన్నారు. వినూత్నమైన ఫీచర్, ముంబైలోని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో UPIని ఉపయోగించి నగదు ఉపసంహరణ చేశా అంటూ దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. కోడ్‌ను స్కాన్, చేసి,పిన్ ఎంటర్ చేసి, కావాల్సిన నగదు ఎంపిక చేసుకుంటే చాలు. అంతేకాదు దీనికి ఏటీఎం విత్‌డ్రాయల్ చార్జీలు అమలవుతాయని, ఉచిత వినియోగ పరిమితికి మించి ఛార్జీలు వర్తించవచ్చుని తెలిపారు. ప్రస్తుతం BHIM UPI యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవ త్వరలోనే మరిన్ని యాప్‌లకు దశలవారీగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. త్వరలోనే దేశవ్యాప్తంగా, అన్ని యాప్‌లకు యూపీఐ ఏటీఎంలు రాబోతున్నాయని తెలిపారు. ఈ ట్వీట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రీట్వీట్ చేయడం గమనార్హం. ఏటీఎంల వద్ద కార్డు అవసరం లేకుండానే నగదు ఎలా విత్ డ్రా చేయాలో ఈ వీడియోలో చూడండి. 🚨 ATM Cash Withdrawal using UPI Today I Made a Cash Withdrawal using UPI at Global FinTech Fest in Mumbai What an Innovative Feature for Bharat pic.twitter.com/hRwcD0i5lu — Ravisutanjani (@Ravisutanjani) September 5, 2023 -
నగదు రహితమంటూ నగుబాటు
ప్రచారం ఘనం.. ఆచరణ స్వల్పం రేష¯ŒS సరుకుల పంపిణీలో విఫలం ఆర్థికమంత్రి ఇలాకాలో 0.19 శాతం మాత్రమే జిల్లాలో కేవలం 7.63 శాతం నమోదు ఆలమూరు (కొత్తపేట) : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు రహిత లావాదేవీలు జరపాలంటూ ప్రచారం సాగించి ఆచరణలో భంగపడుతున్నాయి. తొలుత రేష¯ŒS సరుకులను నగదు రహితంగా పంపిణీ చేస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేమితో అమలు చేయలేకపోయింది. దీంతో జనవరి నెలలో పౌరసరఫరాలశాఖ కేవలం నగదు రహిత లావాదేవీలను 7.63 శాతంగా మాత్రమే నమోదు చేయగలిగింది. జిల్లాలోని అన్ని మండలాల్లో నెల రోజుల పాటు మండల స్థాయి అధికారగణాన్ని గ్రామాల చుట్టూ తిప్పించి చేపట్టిన అవగాహన సదస్సులు నిరుపయోగంగా మారాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పరిధిలోనున్న రేష¯ŒS దుకాణాల్లో కనీసం పది శాతం కూడా జరిపించలేని అధికారులు ప్రయివేటు వ్యాపారుల ద్వారా ఏవిధంగా జరిపించగలరనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో సుమారు 16 లక్షలు రేష¯ŒSకార్డులుండగా అందులో మన్యం, విలీన మండలాలు మినహా మిగతా మండలాల్లో 14.16 లక్షల కార్డులున్నాయి. జనవరిలో అత్యధికంగా రేష¯ŒSకార్డుదారులకు నగదు రహిత చెల్లింపులు జరిపేందుకు నిర్ణయించినా ఫలితం దక్కలేదు. కేవలం 1.08 లక్షల కార్డులదారులు మాత్రమే నగదు రహిత లావాదేవీలు జరిపారు. సమస్యలను పరిష్కరించవలసిన సర్కారీ వ్యవస్థ నిర్లిప్తంగా వ్యవహరించడం వల్ల ఆ ప్రభావం నగదు రహిత లావాదేవీలపై పడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమన్వయం లోపం జిల్లాలోని రేష¯ŒS పంపిణీ వ్యవస్థకు సంబంధించి నగదు రహిత లావాదేవీలు విఫలం కావడానికి ప్రధానంగా బ్యాంకర్లు–అధికారుల మధ్య సమన్వయ లోపం కారణమని తెలుస్తోంది. బ్యాంకు ఖాతాకు ఆధార్ జత కాకపోవడం, ఖాతా వాడుకలో లేకపోవడం, విత్ డ్రా పరిమితి పూర్తికావడం తదితర కారణాల వల్ల నగదు రహిత లావాదేవీలు అనుకున్న విధంగా జరగలేదని తెలుస్తోంది. దీంతో లబ్ధిదారులంతా రేష¯ŒS దుకాణాలు, బ్యాంకుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగవలసిన పరిస్థితి ఏర్పడింది. అయినా ఇప్పటికీ కూడా బ్యాంకు ఖాతాలకు కొన్ని రేష¯ŒSకార్డులు అనుసంధానం కాలేదు. ఈ సమస్యపై అధికారులు దృష్టి సారించకపోవడంతో లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. కొన్ని మండలాల్లో ఖాతానే తెరవలేదు రేష¯ŒS పంపిణీలో ప్రవేశపెట్టిన నగదు రహిత లావాదేవీల కోసం కొన్ని మండలాల్లో ఖాతా కూడా తెరవలేదు. మన్యం, విలీన మండలాలను మినహాయించి మిగతా 53 మండలాల్లో ఒక కార్డుకు కూడా నగదు రహిత లావాదేవీలు జరగలేదు. రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు నియోజకవర్గం తునిలో కేవలం 0.19 శాతం మాత్రమే నగదు రహిత లావాదేవీలు నమోదయ్యాయి. ఆత్రేయపురం మండలం 59.9 శాతం, ఆలమూరు మండలం 39.4 శాతం, కడియం మండలం 35.72 శాతంతో తొలి మూడు స్థానాలు సాధించాయి.