నగదు రహితమంటూ నగుబాటు
-
ప్రచారం ఘనం.. ఆచరణ స్వల్పం
-
రేష¯ŒS సరుకుల పంపిణీలో విఫలం
-
ఆర్థికమంత్రి ఇలాకాలో 0.19 శాతం మాత్రమే
-
జిల్లాలో కేవలం 7.63 శాతం నమోదు
ఆలమూరు (కొత్తపేట) :
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు రహిత లావాదేవీలు జరపాలంటూ ప్రచారం సాగించి ఆచరణలో భంగపడుతున్నాయి. తొలుత రేష¯ŒS సరుకులను నగదు రహితంగా పంపిణీ చేస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేమితో అమలు చేయలేకపోయింది. దీంతో జనవరి నెలలో పౌరసరఫరాలశాఖ కేవలం నగదు రహిత లావాదేవీలను 7.63 శాతంగా మాత్రమే నమోదు చేయగలిగింది. జిల్లాలోని అన్ని మండలాల్లో నెల రోజుల పాటు మండల స్థాయి అధికారగణాన్ని గ్రామాల చుట్టూ తిప్పించి చేపట్టిన అవగాహన సదస్సులు నిరుపయోగంగా మారాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పరిధిలోనున్న రేష¯ŒS దుకాణాల్లో కనీసం పది శాతం కూడా జరిపించలేని అధికారులు ప్రయివేటు వ్యాపారుల ద్వారా ఏవిధంగా జరిపించగలరనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో సుమారు 16 లక్షలు రేష¯ŒSకార్డులుండగా అందులో మన్యం, విలీన మండలాలు మినహా మిగతా మండలాల్లో 14.16 లక్షల కార్డులున్నాయి. జనవరిలో అత్యధికంగా రేష¯ŒSకార్డుదారులకు నగదు రహిత చెల్లింపులు జరిపేందుకు నిర్ణయించినా ఫలితం దక్కలేదు. కేవలం 1.08 లక్షల కార్డులదారులు మాత్రమే నగదు రహిత లావాదేవీలు జరిపారు. సమస్యలను పరిష్కరించవలసిన సర్కారీ వ్యవస్థ నిర్లిప్తంగా వ్యవహరించడం వల్ల ఆ ప్రభావం నగదు రహిత లావాదేవీలపై పడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సమన్వయం లోపం
జిల్లాలోని రేష¯ŒS పంపిణీ వ్యవస్థకు సంబంధించి నగదు రహిత లావాదేవీలు విఫలం కావడానికి ప్రధానంగా బ్యాంకర్లు–అధికారుల మధ్య సమన్వయ లోపం కారణమని తెలుస్తోంది. బ్యాంకు ఖాతాకు ఆధార్ జత కాకపోవడం, ఖాతా వాడుకలో లేకపోవడం, విత్ డ్రా పరిమితి పూర్తికావడం తదితర కారణాల వల్ల నగదు రహిత లావాదేవీలు అనుకున్న విధంగా జరగలేదని తెలుస్తోంది. దీంతో లబ్ధిదారులంతా రేష¯ŒS దుకాణాలు, బ్యాంకుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగవలసిన పరిస్థితి ఏర్పడింది. అయినా ఇప్పటికీ కూడా బ్యాంకు ఖాతాలకు కొన్ని రేష¯ŒSకార్డులు అనుసంధానం కాలేదు. ఈ సమస్యపై అధికారులు దృష్టి సారించకపోవడంతో లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.
కొన్ని మండలాల్లో ఖాతానే తెరవలేదు
రేష¯ŒS పంపిణీలో ప్రవేశపెట్టిన నగదు రహిత లావాదేవీల కోసం కొన్ని మండలాల్లో ఖాతా కూడా తెరవలేదు. మన్యం, విలీన మండలాలను మినహాయించి మిగతా 53 మండలాల్లో ఒక కార్డుకు కూడా నగదు రహిత లావాదేవీలు జరగలేదు. రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు నియోజకవర్గం తునిలో కేవలం 0.19 శాతం మాత్రమే నగదు రహిత లావాదేవీలు నమోదయ్యాయి. ఆత్రేయపురం మండలం 59.9 శాతం, ఆలమూరు మండలం 39.4 శాతం, కడియం మండలం 35.72 శాతంతో తొలి మూడు స్థానాలు సాధించాయి.