
అర్హత లేకపోయినా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు
న్యూఢిల్లీ: సమాజంలోని దిగువ ఆదాయ వర్గాల వారిని దృష్టిలో ఉంచుకుని ఎన్‌బీఐ రూ.25వేల పరిమితితో క్రెడిట్ కార్డులను జారీ చేయనుంది. చెల్లించగల సామర్థ్యం ఉండి, కార్డులు లేని వారి కోసం వీటిని తీసుకురానున్నట్టు ఓ అధికారి తెలిపారు. రుణ అర్హత లేని వారు సైతం క్రెడిట్ కార్డు పొందవచ్చని పేర్కొన్నారు.
‘‘ప్రతీ బ్యాంకు ఖాతాలో ఎంతో కొంత నగదు ఉంటోంది. ఎటువంటి క్రెడిట్ చరిత్ర లేకపోయినా వారికి సెక్యూర్డ్ కార్డు ఇవ్వనున్నాం. బ్యాంకు డిపాజిట్ హామీగా ఎవరికైనా రూ.25 వేల పరిమితితో క్రెడిట్ కార్డు జారీ చేస్తాం’’ అని ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సేవల విభాగం చీఫ్ ఎగ్జిక్యూటివ్ విజయ్ జసూజా తెలిపారు.