
ముంబై: రూపే నెట్‌వర్క్‌పై కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టే దిశగా పేటీఎం, ఎస్‌బీఐ కార్డ్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ) చేతులు కలిపాయి. రూపే ఆధారిత పేటీఎం ఎస్‌బీఐ కార్డ్‌ను ఆవిష్కరించాయి.
యూపీఐ క్యూఆర్ కోడ్‌లపై కూడా రూపే క్రెడిట్ కార్డులు పని చేయనున్నందున మొబైల్ ఫోన్ల ద్వారా డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు మరింతగా పెరగగలవని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తెలిపారు.
ఇందులో ప్లాటినం కేటగిరీ కార్డుహోల్డర్లకు 1 శాతం ఇంధన సర్‌చార్జి మినహాయింపు, రూ. 1,00,000 వరకు సైబర్ ఫ్రాడ్ బీమా కవరేజీ ఉంటుంది. వెల్‌కం ఆఫర్ కింద పేటీఎం ఫస్ట్ సభ్యత్వం, ఓటీటీ ప్లాట్‌ఫాం మెంబర్‌షిప్ సహా రూ. 75,000 వరకు విలువ చేసే ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే పేటీఎం యాప్‌లో ఈ కార్డుతో సినిమా, ట్రావెల్ టికెట్లపై 3 శాతం, ఇతర కొనుగోళ్లపై 2 శాతం, బైట జరిపే లావాదేవీలపై 1 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment