third phase elections
-
కశ్మీర్ మూడో విడత పోలింగ్‌లో 68 శాతం ఓటింగ్
జమ్మూ/శ్రీశ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి మూడో విడతలో మంగళవారం జరిగిన పోలింగ్‌లో 68.72 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల కమిషన్(ఈసీ) తెలిపింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికలకు మించి జనం ఓటేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఏడు జిల్లాల్లో 66.78% ఓటింగ్ నమోదైంది. ఎప్పుడూ ఎన్నికలను బహిష్కరించే బారాముల్లా, సొపోర్ అసెంబ్లీ స్థానాల్లో 30 ఏళ్లలోనే అత్యధికంగా ఈసారి జనం పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని ఈసీ తెలిపింది.అత్యంత కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య జమ్మూకశ్మీర్‌లోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరారు. ముఖ్యంగా పశ్చిమ పాకిస్తానీ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గూర్ఖా వర్గం ప్రజలు పెద్ద సంఖ్యలో కనిపించారు. అత్యధికంగా సాంబాలో 73.45%, ఉధంపూర్‌లో 72.91% మంది ఓటేయగా, కథువా లో 70.53%, జమ్మూలో 66.79%, బందిపొరాలో 64.85%, కుప్వారాలో 62.76%, బారాముల్లాలో 55.73% మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.జమ్మూ జిల్లాలోని ఛాంబ్ నియోజకవర్గంలో అత్యధికంగా 77.35 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఈసీ వివరించింది. సొపోర్ నియోజకవర్గంలో 41.44%, బారాముల్లా అసెంబ్లీ స్థానంలో 47.95% మంది ఓటు వేశారు. గత 30 ఏళ్ల ఎన్నికల చరిత్రలోనే ఇది అత్యధికమని ఈసీ తెలిపింది. గతంలో ఇక్కడ తరచూ ఎన్నికలను బహిష్కరించే ఆనవాయితీ నడిచిందని పేర్కొంది. జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా మూడు విడతల్లో కలిపి ఓటింగ్ శాతం 63.45 అని ఈసీ పేర్కొంది. మూడో విడత పోలింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని, పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఈసీ పేర్కొంది. ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని, రీపోలింగ్ అవసరం కూడా లేదని వివరించింది. ఈ నెల 8వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. -
Lok Sabha Election 2024: మూడో దశలో... ముమ్మర పోరు
ఒంటరి పోరుతో పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టిన మమత ఇప్పుడు బీజేపీ నుంచి రాష్ట్రంలో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. మూడో విడతలో భాగంగా అక్కడ నాలుగు లోక్‌సభ స్థానాలకు, బీజేపీ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో ఏడింటికి, అసోంలో నాలుగింటికి మంగళవారం పోలింగ్ జరగనుంది. వాటిల్లో కీలక స్థానాలను ఓసారి చూస్తే... జాంగీపూర్ (పశి్చమ బెంగాల్) మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంది. 2019లో బీజేపీ అభ్యర్థి మఫుజా ఖాతూన్‌పై తృణమూల్ కాంగ్రెస్ నేత ఖలీలుర్ రెహమాన్ 2.4 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారీ ఆయనే పోటీలో ఉన్నారు. బీజేపీ ధనుంజయ్ ఘోష్‌కు టికెటివ్వగా కాంగ్రెస్ ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్‌ను పక్కన పెట్టి మొర్తజా హుస్సేన్‌ను పోటీకి దింపింది. దాంతో ఇక్కడ ముక్కోణపు పోటీ నెలకొంది.దక్షిణ మాల్డా (పశి్చమ బెంగాల్) ఉత్తర మాల్డాతో పాటు ఈ స్థానం కూడా ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. జమిందారీ కుటుంబీకుడు ఘనీఖాన్ చౌదరి హవా నడిచేది. రెండు దశాబ్దాలు మాల్డా రాజకీయాలను శాసించిన ఆయన మరణానంతరం పరిస్థితి మారింది. ముస్లిం ప్రాబల్య స్థానమైన దక్షిణ మాల్డాలో ముక్కోణపు పోటీ నెలకొంది. 2009, 2014, 2019ల్లో ఘనీఖాన్ సోదరుడు అబూ హసీం ఖాన్ కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఈసారి ఆయన కుమారుడు ఇషా ఖాన్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి శ్రీరూప మిత్ర చౌదరి, టీఎంసీ తరఫున షానవాజ్ అలీ రెహమాన్ పోటీ చేస్తున్నారు.ఉత్తర మాల్డా (పశి్చమ బెంగాల్) ఇక్కడి ఓటర్లలో చైతన్యం ఎక్కువ. బీజేపీ సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి ఖగేన్ ముర్ముకు తృణమూల్ నుంచి బరిలో దిగిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రసూన్ బెనర్జీ గట్టి పోటీ ఇస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ముస్తాక్ ఆలం బరిలో ఉన్నారు. ఇక్కడ 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన మౌసమ్ నూర్ 2019లో తృణమూల్ నుంచి పోటీ చేశారు. ఖగేన్ చేతిలో 1.85 లక్షల ఓట్ల తేడాతో ఓడారు. ఇక్కడా ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది.మాధేపుర (బిహార్) మండల్ కమిషన్ చైర్మన్ బిందేశ్వరీ ప్రసాద్ మండల్, జేడీ(యూ) దిగ్గజం శరద్ యాదవ్, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ వంటి రాజకీయ ప్రముఖులు ప్రాతినిధ్యం వహించిన స్థానమిది. ఆర్జేడీ సారథ్యంలోని మహా కూటమి నుంచి ప్రొఫెసర్ కుమార్ చంద్రదీప్ యాదవ్ పోటీలో ఉన్నారు. జేడీ(యూ) నుంచి సిట్టింగ్ ఎంపీ దినేశ్ చంద్ర యాదవ్ మరోసారి పోటీకి నిలబడ్డారు.అరారియా (బిహార్) బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ ప్రదీప్‌కుమార్ సింగ్ బరిలో ఉన్నారు. 2019లో ఆయన చేతిలో 1.37 లక్షల ఓట్ల తేడాతో ఓడిన మహమ్మద్ సర్ఫరాజ్ ఆలంకే ఆర్జేడీ మళ్లీ టికెటి చి్చంది. ఇద్దరు బలమైన స్వతంత్ర అభ్యర్థులూ బరిలో ఉన్నారు.గువాహటి (అసోం) ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ రెండూ మహిళలకే టికెటిచ్చాయి. బీజేపీ సిట్టింగ్ ఎంపీ క్వీన్ ఓజాను కాదని రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు బిజూలి కలిత మేధిను బరిలో దింపింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి బీరా బోర్తకుమార్ గోస్వామి పూర్వాశ్రమంలో బీజేపీ నేతే! పర్వత, మారుమూల ప్రాంతాల్లోనూ ఆమె సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. నిరుద్యోగం, వరదలు, తాగునీరు ఇక్కడి సమస్యలు. డుబ్రి (అసోం) ఈ లోక్‌సభ స్థానం ఏకంగా 142 కిలోమీటర్ల మేర బంగ్లాదేశ్‌తో సరిహద్దును పంచుకుంటోంది. బ్రహ్మపుత్ర పొంగినప్పుడల్లా ఇక్కడి ప్రజలకు కష్టాలు తప్పవు. వరదలు, పేదరికం, బాల్య వివాహాలు ప్రధాన సమస్యలు. ముస్లింలు ఏకంగా 80 శాతమున్నారు. దాంతో వారి ఓట్లే ఫలితాన్ని నిర్దేశిస్తుంటాయి. ఏఐయూడీఎఫ్ అధినేత బద్రుద్దీన్ అజ్మల్ ఇక్కడ వరుసగా నాలుగోసారి గెలిచేందుకు శ్రమిస్తున్నారు. బీజేపీ మిత్రపక్షం ఏజీపీ నుంచి జబేద్ ఇస్లాం, కాంగ్రెస్ నుంచి రకీబుల్ హుస్సేన్ పోటీలో ఉన్నారు. రాయ్‌గఢ్ (ఛత్తీస్‌గఢ్) ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి 1999 నుంచి 2014 దాకా ఇక్కడినుంచే లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. పైగా ఆయన అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం కూడా రాయ్‌గఢ్ లోక్‌సభ స్థానం పరిధిలోనే ఉంది. దాంతో ఇక్కడ బీజేపీని గెలిపించుకోవడం సీఎంకు ప్రతిష్టాత్మకంగా మారింది. బీజేపీ నుంచి రాధేశ్యామ్ రతియా, కాంగ్రెస్ నుంచి మేనకాదేవి సింగ్ పోటీ చేస్తున్నారు. గోండ్ రాజ కుటుంబ వారసురాలైన మేనకాదేవి డాక్టర్ కూడా. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: మోదీ, షా కంచుకోటలో... కాంగ్రెస్‌కు పెనుసవాల్
దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో శుక్రవారం మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. కీలకమైన రాష్ట్రం గుజరాత్లో మొత్తం స్థానాలకూ ఇదే విడతలో పోలింగ్ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్లో గత రెండు ఎన్నికల్లోనూ బీజేపీ క్లీన్స్వీప్చేసింది. అదే ఊపులో ఈసారి హ్యాట్రిక్‌పై కన్నేసింది. లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో అంతకంతకూ చిక్కిపోతున్న కాంగ్రెస్ ఈసారి ఆప్‌తో కలిసి ‘ఇండియా’ కూటమి కింద బీజేపీని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని కీలక లోక్‌సభ స్థానాలపై ఫోకస్... వదోదర... కొత్త ముఖాలు గుజరాత్లో మూడో అతి పెద్ద నగరమిది. ఇక్కడ వరుసగా రెండు ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలుపొందిన రంజన్‌బెన్ ధనంజయ్ భట్‌ను బీజేపీ అనూహ్యంగా పక్కనబెట్టింది. డాక్టర్ హేమంగ్ జోషీని పార్టీ బరిలో నిలిపింది. కాంగ్రెస్ తరఫున పధియార్ జస్పాల్సింగ్ మహేంద్రసింగ్ పోటీలో ఉన్నారు. వీరిద్దరూ కొత్తవారే కావడం విశేషం. ఈ సీటు 1998 నుంచి బీజేపీ గుప్పిట్లోనే ఉంది. మోదీ ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదంతో మరోసారి నెగ్గుతామని కమలనాథులు ధీమాగా ఉన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 7 సెగ్మెంట్లలో 6 బీజేపీ ఖాతాలోనే పడ్డాయి. మిగతా చోట స్వతంత్ర అభ్యర్థి నెగ్గారు. 2014లో మోదీ లోక్‌సభ అరంగేట్రం వారణాసి, వదోదరల నుంచే జరగడం తెలిసిందే. ఇక్కడ ఆయనకు ఏకంగా 5.7 లక్షల మెజారిటీ లభించింది. వారణాసి నుంచి ఎంపీగా కొనసాగి వదోదరను వదులుకున్నారు. రాజ్‌కోట్... రూపాలాకు రాజ్‌పుత్ గండం గుజరాత్లో ఎదురే లేని కమలనాథులకు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా కొత్త చిక్కులు తెచ్చిపెట్టారు. సిట్టింగ్ ఎంపీ మోహన్ కుందరియాను కాదని బీజేపీ ఆయనకు టికెటిచి్చంది. కానీ ‘మహారాజులు బ్రిటి‹Ùవారికి, విదేశీ పాలకులకు లొంగిపోయారని, వారితో విందువినోదాల్లో మునగడమే గాక వాళ్లకు తమ కుమార్తెలనిచ్చి పెళ్లిళ్లు చేశా’రని రాజ్‌పుత్‌లపై రూపాలా చేసిన వ్యాఖ్యలతో ఆ సామాజికవర్గం భగ్గుమంది. ఆయన్ను రాజ్‌కోట్ బరి నుంచి తప్పించాలని, లేదంటే ఓడించి తీరుతామని బీజేపీకి వారు అలి్టమేటమిచ్చారు! ఆందోళనలు కూడా చేశారు. రూపాలా పలుమార్లు క్షమాపణలు చెప్పినా వివాదం సద్దుమణగలేదు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పరేశ్‌బాయ్ ధనాని పోటీలో ఉన్నారు. రాజ్‌పుత్‌లు, పటీదార్లు, మధ్య ఎప్పటినుంచో వైరముంది. పటీదార్ సామాజికవర్గానికి చెందిన రూపాలా దానికిలా ఆజ్యం పోయడం తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది.భావనగర్.. బరిలో ఆప్ ఈ స్థానంపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్నేసింది. కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా భావనగర్, బరుచ్‌లను ఆ పార్టీ దక్కించుకుంది. ఇక్కడ గట్టి పట్టున్న బీజేపీని ఢీకొట్టేందుకు ఉమేశ్‌బాయ్ నరన్‌బాయ్ మక్వానాను పోటీకి దించింది. బీజేపీ కూడా సిట్టింగ్ ఎంపీ భారతీబెన్ ధీరూబాయ్ శియాల్‌ను పక్కనబెట్టి నింబూబెన్ బంభానియాకు టికెటిచి్చంది. 1991 నుంచీ ఇక్కడ కాషాయ జెండానే ఎగురుతోంది. గత ఎన్నికల్లో భారతీబెన్‌కు 4.29 లక్షల మెజారిటీ లభించింది. ఈ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు బీజేపీ చేతిలోనే ఉన్నాయి. మిగతా స్థానం ఆప్‌ది కావడం విశేషం. గత అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసి 5 సీట్లు నెగ్గిన ఆప్ లోక్‌సభ బరిలో బీజేపీకి సవాలు విసురుతోంది. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్టు చేశారంటూ ప్రచారంతో హోరెత్తిస్తోంది. కేజ్రీవాల్ భార్య సునీత కూడా ప్రచారానికి దిగారు. పోర్బందర్.. మన్సుఖ్ అరంగేట్రం బీజేపీకి గట్టి పట్టున్న ఈ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తొలిసారి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. 2012 నుంచీ రాజ్యసభకు ఎన్నికవుతున్న ఆయన పోటీతో పోర్‌బందర్‌పై ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రమేశ్‌బాయ్ ధడక్ చేతిలో 2.3 లక్షల ఓట్ల తేడాతో ఓడిన లలిత్ వసోయాకే కాంగ్రెస్ మళ్లీ టికెటిచి్చంది. ఈ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఆరు బీజేపీ చేతిలోనే ఉన్నాయి. కుతియానాలో మాత్రం సమాజ్‌వాదీ పార్టీ గెలిచింది. బనస్కాంత.. గెనీబెన్ సవాల్ ఉత్తర గుజరాత్‌లోని ఈ స్థానంలో బీజేపీకి గట్టి పోటీ ఎదురవుతోంది. ‘వావ్’ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గెనీబెన్ ఠాకోర్‌ను కాంగ్రెస్ బరిలోకి దించడమే అందుకు కారణం. దాంతో బీజేపీ కూడా సిట్టింగ్ ఎంపీ పర్వత్‌బాయ్ పటేల్‌ను కాదని ఇంజనీరింగ్ ప్రొఫెసర్ రేఖా బెన్ చౌదరి రూపంలో మహిళకే టికెటివ్వాల్సి వచ్చింది. ఆమెకు రాజకీయ అనుభవం లేదు. తొలిసారి ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. గుజరాత్లో ఇరు పారీ్టల నుంచీ మహిళలే రంగంలో ఉన్న ఏకైక సీటు కావడంతో బనస్కాంత అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దీని పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాలుగు చోట్ల గెలిచింది. అయితే గెనీబెన్ కమలం హవాలో కూడా విజయం సాధించి ‘వావ్’ అనిపించారు. రేఖాబెన్‌కు రాజకీయ అనుభవం లేకున్నా నియోజకవర్గంతో సత్సబంధాలున్నాయి. బనస్ డెయిరీ ఈ నియోజకవర్గంలోని 4.5 లక్షల మంది రైతుల నుంచి రోజూ పాలు సేకరిస్తుంది. దీని వ్యవస్థాపకుడు గల్బాబాయ్ చౌదరి మనుమరాలు రేఖ. ఆమె భర్త హితేశ్ చౌదరి బీజేపీ నాయకుడు. అయినా గెనీబెన్ వంటి బలమైన ప్రత్యరి్థపై రేఖ వంటి కొత్త ముఖాన్ని నిలబెట్టడంపై బీజేపీ కార్యకర్తల్లోనూ అసంతృప్తి నెలకొందని పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి!గాంధీనగర్.. అద్వానీ కోటలో షా పాగా! ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటైన ఈ నియోజకవర్గం 1989 నుంచి కమలనాథుల గుప్పిట్లోనే ఉంది. శంకర్ సింఘ్ వాఘేలా, అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్కే అద్వానీ వంటి హేమాహేమీలకు నెలవైన ఈ స్థానంలో కేంద్ర హోం మంత్రి, బీజేపీ దిగ్గజం అమిత్ షా పాగా వేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 5,57,014 ఓట్ల మెజారిటీతో విజయ ఢంకా మోగించారు. ఈసారి మెజారిటీ మరింత పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన్ను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి! చివరకు 62 ఏళ్ల సోనల్ పటేల్‌ను రంగంలోకి దించింది. ఆమె ఏఐసీసీ సెక్రటరీగా. ముంబై, పశి్చమ మహారాష్ట్ర ఇన్చార్జిగా ఉన్నారు. గిఫ్ట్ సిటీ అభివృద్ధి, గాంధీ సబర్మతి ఆశ్రమానికి మెరుగులు, అయోధ్య రామ మందిరం, మోదీ ఫ్యాక్టర్ తదితరాలతో తనకు తిరుగులేదని షా ధీమాతో ఉన్నారు. గాం«దీనగర్ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ స్థానాలూ బీజేపీవే! సీఎం భూపేంద్ర పటేల్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఘట్లోడియా కూడా వాటిలో ఒకటి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Association for Democratic Reforms: మూడో విడతలో... మహిళలు 9 శాతమే
తొలి రెండు విడతల్లో మాదిరిగానే లోక్‌సభ ఎన్నికల మూడో విడతలోనూ మహిళలకు సముచిత స్థానం దక్కలేదు. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 లోక్‌సభ స్థానాలకు మే 7న పోలింగ్ జరగనుంది. 1,352 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో మహిళలు 123 మందే (9 శాతం) ఉన్నారు. ఇక ప్రతి పది మంది అభ్యర్థుల్లో ఇద్దరు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్టు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారమ్స్ (ఏడీఆర్) డేటా వెల్లడించింది. వీరిలో13 శాతం మందిపై మహిళలపై అత్యాచారం వంటి తీవ్ర కేసులున్నాయి. మొత్తం 38 మంది అభ్యర్థులు మహిళలకు సంబంధించిన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. శివసేన (ఉద్ధశ్) అభ్యర్థుల్లో ఏకంగా 80 శాతం, ఎన్సీపీ (శరద్ పవార్) అభ్యర్థుల్లో 67 శాతం, ఎస్పీ అభ్యర్థుల్లో 50 శాతం, జేడీ(యూ)లో 33 శాతం, తృణమూల్ కాంగ్రెస్‌లో మందిపై క్రిమినల్ కేసులుండటం విశేషం! బీజేపీ నుంచి 22 మంది, కాంగ్రెస్ నుంచి 26, ఆర్జేడీ నుంచి ముగ్గురిపై కేసులున్నాయి. అభ్యర్థుల్లో ముగ్గురు, అంతకంటే ఎక్కువ మందిపై క్రిమినల్ కేసులున్నప్పుడు ప్రకటించే రెడ్ అలర్ట్‌ను 43 నియోజకవర్గాల్లో జారీ చేశారు. మూడో వంతు కోటీశ్వరులే మొత్తం అభ్యర్థుల్లో 392 మంది కోటీశ్వరులేనని వారు దాఖలు చేసిన అఫిడవిట్లు తెలియజేస్తున్నాయి. దక్షిణ గోవా బీజేపీ అభ్యర్థి పల్లవీ శ్రీనివాస్ డెంపో రూ.1,361 కోట్ల ఆస్తులతో టాప్‌లో ఉన్నారు. తర్వాత మధ్యప్రదేశ్ గుణ బీజేపీ అభ్యర్థి జ్యోతిరాదిత్య సింధియా రూ.424 కోట్లు, మహారాష్ట్రలో కొల్హాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఛత్రపతి సాహు మహారాజ్ రూ.342 కోట్లతో రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు. మూడో దశలో 82 మంది బీజేపీ అభ్యర్థుల్లో 77 మంది; 68 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లోనూ ఏకంగా 60 మంది కోటీశ్వరులే. జేడీ(యూ), శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ, ఆర్జేడీ, శివసేన, ఎన్సీపీ (శరద్ పవార్) అభ్యర్థులంతా కోటీశ్వరులే. ఐదుగురు అభ్యర్థులు తమకెలాంటి ఆస్తులూ లేవని పేర్కొనడం విశేషం. సగం మంది ఇంటర్ లోపే అభ్యర్థుల్లో 639 మంది విద్యార్హత ఆరో తరగతి నుంచి ఇంటర్ లోపే! 19 మందైతే ఏమీ చదువుకోలేదు. 56 మంది ఐదో తరగతి లోపే చదివారు. 591 మందికి డిగ్రీ, అంతకంటే ఉన్నత విద్యార్హతలు ఉన్నాయి. 44 మంది డిప్లొమా చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok sabha elections 2024: మూడో దశలో మహా ఫైట్
మహారాష్ట్రలో మూడో దశ లోక్‌సభ ఎన్నికల సమరం మహాయుతి, మహా వికాస్ అగాడీ రెండు కూటముల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. పశి్చమ మహారాష్ట్రలో ఏడు స్థానాలు, కొంకణ్, మరాఠ్వాడా నుంచి రెండేసి చొప్పున మొత్తం 11 స్థానాలకు ఈ నెల 7న పోలింగ్ జరగనుంది. బీజేపీ, ఎన్సీపీ, శివసేనతో కూడిన అధికార మహాయుతి కూటమి ఒకవైపు.. కాంగ్రెస్, ఉద్ధవ్ శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలతో కూడిన ఎంవీఏ మరోవైపు మోహరించాయి. పలుచోట్ల రెబెల్ అభ్యర్థులూ వాటికి సవాలు విసురుతున్నారు. ఉద్ధవ్, శరద్ వర్గాలకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి... ఉస్మానాబాద్ మరాఠ్వాడా ప్రాంతంలో ప్రముఖ పట్టణం. దీని పేరును సర్కారు ఇటీవలే దారాశివ్‌గా మార్చింది. సిట్టింగ్ ఎంపీ ఓం ప్రకాశ్ రాజే నింబాల్కర్ శివసేన (ఉద్ధవ్) తరఫున పోటీలో ఉన్నారు. తుల్జాపూర్ బీజేపీ ఎమ్మెల్యే రాణా జగ్జీత్ సిన్హా భార్య అర్చనా పాటిల్‌ను మహాయుతి కూటమి బరిలో దింపింది. ఆమె ఇటీవలే ఎన్సీపీ (అజిత్) పారీ్టలో చేరి లోక్‌సభ టికెట్ సంపాదించారు. అర్చన మామ పదమ్సిన్హా పాటిల్ సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు. అజిత్ పవార్ భార్య సునేత్రకు సోదరుడు కూడా. నింబాల్కర్ కుటుంబంతోనూ వీరికి దగ్గరి బంధుత్వముంది. కానీ వీరి కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. నింబాల్కర్ తండ్రిని చంపించినట్టు పదమ్సిన్హాపై ఆరోపణలున్నాయి! 2019 లోక్‌సభ ఎన్నికల్లో నింబాల్కర్ ఈ స్థానంలో రాణా జగ్జీత్ సిన్హాను ఓడించడం విశేషం. ఈసారి మహిళల ఓట్లు తనను గెలిపిస్తాయని అర్చన నమ్మకం పెట్టుకున్నారు.సాంగ్లి బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ సంజయ్ కాక పాటిల్ మళ్లీ బరిలో ఉన్నారు. విపక్ష మహా వికాస్ అగాడీ తరఫున కాంగ్రెస్ నేత విశాల్ పాటిల్ టికెట్ ఆశించగా పొత్తులో భాగంగా ఈ స్థానం శివసేన (ఉద్ధవ్)కు వెళ్లింది. దాంతో ఆయన రెబెల్‌గా పోటీకి దిగారు. శివసేన (ఉద్ధవ్) నుంచి రెజ్లర్ చంద్రహర్ పాటిల్ బరిలో ఉన్నారు. దాంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ ఓట్లను విశాల్ చీలుస్తారని, అది బీజేపీకి కలిసొస్తుందని భావిస్తున్నారు.సోలాపూర్ 2014, 2019ల్లో ఇక్కడ వరుసగా బీజేపీయే నెగ్గింది. ఈసారి మాత్రం కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే కుమార్తె ప్రణతీ షిండే బరిలో ఉండటమే అందుకు కారణం. నిజానికి ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ చివరిదాకా ప్రయత్నించి విఫలమైంది. బీజేపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్ సాత్పుతే రంగంలోకి దిగారు. ప్రణతి కూడా సోలాపూర్ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యేనే కావడం విశేషం! ఆమె తొలిసారి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. ఇక్కడ అభ్యరి్థని మార్చే ఆనవాయితీని ఈసారి కూడా బీజేపీ కొనసాగించింది. 2014లో శరద్ బాన్సోడ్, 2019లో జైసిద్ధేశ్వర్ స్వామి బీజేపీ తరఫున గెలిచారు. ఆ రెండుసార్లూ ఓటమి చవిచూసింది సుశీల్‌కుమార్ షిండేనే! ఈసారి మజ్లిస్ ఇక్కడ అభ్యర్థిని ఉపసంహరించుకోవడం కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశం. సోలాపూర్, మాధా స్థానాల్లో విజయం కోసం చెమటోడ్చాల్సిందేనని బీజేపీ నేతలే అంగీకరిస్తుండటం విశేషం!సతారా మహాయుతి కూటమి తరఫున ఎన్సీపీ (శరద్ పవార్) నేత, కారి్మక నాయకుడు, ఎమ్మెల్సీ శశికాంత్ షిండే బరిలో ఉన్నారు. దాంతో కొల్హాపూర్ మాదిరిగానే ఇక్కడ కూడా బీజేపీ వ్యూహాత్మకంగా ఛత్రపతి శివాజీ వంశీయుడు, రాజ్యసభ ఎంపీ ఉదయన్‌రాజే భొసాలేకు టికెటిచి్చంది. మహాయుతి కూటమి నుంచి ఈ స్థానంలో పోటీ చేయాలని తొలుత ఎన్సీపీ (అజిత్) భావించింది. ఉదయన్‌రాజే భోసాలే పోటీకి ఆసక్తి చూపడంతో ఈ స్థానాన్ని బీజేపీ తీసుకుంది.రత్నగిరి–సింధుదుర్గ్ సిట్టింగ్ ఎంపీ, శివసేన (ఉద్ధవ్) నేత వినాయక్ రౌత్ మళ్లీ బరిలో ఉన్నారు. ఆయనపై కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను బీజేపీ పోటీకి దింపింది. శివసేన రెండుగా చీలిన తర్వాత జరుగుతున్న ఎన్నిక కావడంతో రెండుసార్లుగా గెలుస్తూ వస్తున్న రౌత్‌కు ఈసారి విజయం తేలిక కాదంటున్నారు. ఈ నేపథ్యంలో ఉద్దవ్ వర్గానికి చెందిన స్థానిక నేతలు, శ్రేణుల ఐక్యతకు ఈ ఎన్నిక పరీక్షగా మారింది.రాయగఢ్ ఇక్కడ పోటీ ప్రధానంగా సిట్టింగ్ ఎంపీ, ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తత్కారే, శివసేన (ఉద్ధవ్) అభ్యర్థి అనంత్ గీతే మధ్యే ఉంది. 2019 ఎన్నికల్లో అనంత్ గీతేపైనే తత్కారే 30 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. అంతకుముందు రెండు పర్యాయాలు వరుసగా అనంత్ గీతేనే ఇక్కడ గెలిచారు.మాధా బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ సిన్హా నాయక్ నింబాల్కర్ మళ్లీ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థి సంజయ్మామ విఠల్‌రావు షిండేపై 86 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ మళ్లీ నింబాల్కర్‌కు టికెటివ్వడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ జిల్లా కార్యదర్శి ధైర్యశీల్ మోహిత్ పాటిల్ ఇటీవలే శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీలో చేరారు. ఆ పార్టీ నుంచి రంగంలోకి దిగి బీజేపీకి గట్టి సవాలు విసురుతున్నారు. మోహిత్‌కు స్థానికంగా బాగా పట్టుండటంతో ఇక్కడ బీజేపీ ఎదురీదుతోందని చెబుతున్నారు.అజిత్కూ ప్రతిష్టాత్మకమే ఎన్సీపీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. బాబాయి శరద్ పవార్‌తో విభేదించి పార్టీని చీల్చి తన వర్గానికే అసలు ఎన్సీపీగా అధికారిక గుర్తింపు సాధించుకోవడం తెలిసిందే. రాయగఢ్, ఉస్మానాబాద్తో పాటు బారామతిలో విజయం ఆయనకు సవాలుగా మారింది. బారామతిలో అజిత్ భార్య సునేత్ర బరిలో ఉన్నారు. తన మరదలు, శరద్ పవార్ కూతురైన సిట్టింగ్ ఎంపీ సుప్రియా సులేతో ఆమె తలపడుతుండటం విశేషం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok sabha elections 2024: బారామతి నుంచి మెయిన్‌పురి దాకా...హోరాహోరీ
లోక్‌సభ ఎన్నికల సుదీర్ఘ ఘట్టంలో మే 7న మూడో విడత పోలింగ్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈ విడతలో రాజకీయ ఉద్ధండులతో పాటు కొత్త ముఖాలూ బరిలో ఉన్నారు. కొల్హాపూర్‌లో ఛత్రపతి శివాజీ వారసునికి బీజేపీ టికెటిచి్చంది. శివమొగ్గలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ భార్య బరిలోకి ఉన్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ లోక్‌సభ టికెట్ తీసుకున్నారు. మెయిన్‌పురిలో డింపుల్ భాభీ మరోసారి మేజిక్ చేసేందుకు సిద్ధమంటున్నారు. ఇలా మూడో దశ బరిలో ఆసక్తి రేపుతున్న కీలక స్థానాలపై ఫోకస్... బారామతి వదినా మరదళ్ల వార్! దేశమంతటా ఆసక్తి రేపుతున్న నియోజకవర్గమిది. మరాఠా రాజకీయ యోధుడు శరద్ పవార్ ముద్దుల తనయ సుప్రియా సులేపై వదిన సునేత్రా పవార్ పోటీకి సై అంటున్నారు. బాబాయి శరద్ పవార్‌పై తిరుగుబావుటా ఎగరేసి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని దక్కించుకున్న అజిత్ పవార్ తన చెల్లెలిపై ఏకంగా భార్యనే రంగంలోకి దించారు. సుప్రియ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ. ఎన్సీపీ (శరద్) వర్గానికి సారథ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నేత కంచన్ రాహుల్ కూల్‌పై 1,55,774 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారి వదినా మరదళ్ల మధ్య హై ఓల్టేజ్ పోటీ నెలకొంది. సునేత్రకు బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్)లతో కూడిన మహాయుతి కూటమి బలమైన దన్నుంది. ఇక సుప్రియ కాంగ్రెస్, శివసేన (ఠాక్రే) ఎన్సీపీ (పవార్)తో కూడిన మహా వికాస్ అగాడీ తరఫున వదినకు సవాలు విసురుతున్నారు. బీఎస్పీ నుంచి ప్రియదర్శని కోక్రే కూడా రేసులో ఉన్నారు. విదిశ మామాజీ ఈజ్ బ్యాక్ మధ్యప్రదేశ్‌కు 20 ఏళ్లకు పైగా సీఎం. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బంపర్ మెజారిటీ సాధించి పెట్టారు. ఇంతటి రికార్డున్నా శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు మళ్లీ సీఎంగా చాన్స్ రాలేదు. అయితే బీజేపీ అనూహ్యంగా ఆయనను విదిశ నుంచి లోక్‌సభ బరిలో దింపింది. ‘‘శివరాజ్‌ను ఢిల్లీకి తీసుకెళ్తా. కేంద్ర ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారు’ అన్న మోదీ ప్రకటనతో విదిశ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మామాజీగా ప్రసిద్ధుడైన శివరాజ్ ఇక్కడ 1991 నుంచి 2004 దాకా వరుసగా ఐదుసార్లు ఎంపీగా గెలవడం విశేషం. బీజేపీ దిగ్గజాలు వాజ్‌పేయి ఒకసారి, సుష్మా స్వరాజ్ రెండుసార్లు ఇక్కడ విజయం సాధించారు. ఈ బీజేపీ కంచుకోటలో కాంగ్రెస్ నుంచి ప్రతాప్ భాను శర్మ బరిలో ఉన్నారు. ఆయన కూడా 1980, 1984లో ఇక్కడ రెండుసార్లు గెలిచారు. ఏకంగా 40 ఏళ్ల తర్వాత మళ్లీ బరిలో దిగుతున్నారు!ఆగ్రా త్రిముఖ పోరు యూపీకి దళిత రాజధానిగా పేరొందిన ఆగ్రాలో ముక్కోణపు పోరు నెలకొంది. సిట్టింగ్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ బఘెల్‌పై బీఎస్పీ నుంచి పూజా అమ్రోహి, సమాజ్‌వాదీ నుంచి సురేశ్ చంద్ర కర్దామ్ బరిలో ఉన్నారు. మోదీ–యోగీ ఫ్యాక్టర్, అయోధ్య రామమందిరం, సంక్షేమ పథకాలనే బఘెల్ నమ్ముకున్నారు. వైశ్యులు, బ్రాహ్మణులు, పంజాబీలు, యాదవేతర ఓబీసీలతో పాటు దళితుల్లో ఒక వర్గం కమలానికి మద్దతిస్తుండటం ఆయనకు కలిసి రానుంది. దళితుల ఓటు బ్యాంకుపై పూజ, జాతవ్‌లు, ముస్లిం ఓట్లపై కర్దామ్ ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడి 20.57 లక్షల ఓట్లలో 30 శాతం దళితులే. వారిలోనూ మూడొంతుల మంది జాతవ్ దళితులు! బీఎస్పీ, ఎస్పీ అభ్యర్థులిద్దరిదీ ఇదే సామాజికవర్గం. ప్రత్యర్థుల నాన్ లోకల్ విమర్శలను పూజ దీటుగా తిప్పికొడుతున్నారు. ఈ స్థానం ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట. రామమందిర ఉద్యమంతో 1990 నుంచి బీజేపీ గుప్పిట్లోకి చేరింది. మధ్యలో రెండుసార్లు మాత్రం ఎస్పీ నుంచి బాలీవుడ్ నటుడు రాజ్ బబ్బర్ గెలిచారు.శివమొగ్గ బీజేపీకి పక్కలో బల్లెం కర్ణాటక దిగ్గజ నేత బీఎస్ యడ్యూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్ర మరోసారి శివమొగ్గలో బరిలో నిలిచారు. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ భార్య గీతకు కాంగ్రెస్ టికెటివ్వడంతో రాజకీయం వేడెక్కింది. పైగా బీజేపీతో 50 ఏళ్లకు పైగా అనుబంధమున్న అగ్ర నేత కేఎస్ ఈశ్వరప్ప స్వతంత్ర అభ్యరి్థగా బరిలో నిలిచి రాఘవేంద్రకు పక్కలో బల్లెంలా మారారు. ఈ ముక్కోణపు పోటీ అందరినీ ఆకర్షిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్న ఈశ్వరప్ప తన కుమారుడు కంతేశ్‌కు ఎంపీ టికెట్ కోసం విఫలయత్నం చేశారు. యడ్యూరప్పతో మొదట్నుంచీ ఉప్పు నిప్పుగా ఉన్న ఈశ్వరప్పకు ఈ పరిణామం తీవ్ర ఆగ్రహం కలిగించింది. రాష్ట్ర బీజేపీ చీఫ్, యడ్యూరప్ప కుమారుడు విజయేంద్రపై తీవ్ర విమర్శలకు దిగి పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. తాను మోదీకి వీర విధేయుడినంటూ ఆయన బొమ్మతోనే ఈశ్వరప్ప జోరుగా ప్రచారం చేస్తుండటంతో బీజేపీ నేతలు తలపట్టుకుంటున్నారు!కొల్హాపూర్.. బరిలో ఛత్రపతి ఛత్రపతి శివాజీ వంశీయుడిని కాంగ్రెస్ బరిలోకి దించడంతో కొల్హాపూర్‌లో పోటీ కాక పుట్టిస్తోంది. శివసేన సిట్టింగ్ ఎంపీ సంజయ్ మాండ్లిక్ ఈసారి శివసేన (షిండే) నేతగా మహాయుతి కూటమి తరఫున మళ్లీ బరిలో ఉన్నారు. దాంతో కాంగ్రెస్, శివసేన (ఠాక్రే) ఎన్సీపీ (శరద్)లతో కూడిన మహా వికాస్ అగాడీ వ్యూహాత్మకంగా ఛత్రపతి రాజర్షి సాహు మహారాజ్‌కు టికెటిచ్చింది. ఆయన కాంగ్రెస్ అభ్యరి్థగా బరిలో ఉన్నారు. అయితే ఆయన శివాజీకి నిజమైన వారసుడు కాదన్న మాండ్లిక్ వ్యాఖ్యలతో అగ్గి రాజుకుంది. వీటిపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అధికార కూటమి వెనక్కు తగ్గింది. ‘గాడీ (సింహాసనం)ని గౌరవించండి. కానీ ఓటు మాత్రం మోడీకే వేయండి’ అంటూ కొత్త తరహా ప్రచారం మొదలుపెట్టింది. రెండు కూటముల మధ్య ఇక్కడ టఫ్ ఫైట్ జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, ఎన్సీపీలకు గట్టి పట్టుండటం సాహు మహారాజ్‌కు కలిసొచ్చే అంశం.మెయిన్‌పురి.. భాభీ సవాల్ ఈ స్థానం ఎస్పీ దిగ్గజం దివంగత ములాయం సింగ్ యాదవ్ కంచుకోట. ములాయం మరణానంతరం 2022లో ఉప ఎన్నికలో ఆయన కోడలు, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ సత్తా చాటారు. 2.88 లక్షల ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రఘురాజ్ సింగ్ శాక్యను ఓడించారు. ఈసారి మళ్లీ బీజేపీకి సవాలు విసురుతున్నారు. బీజేపీ నుంచి యూపీ పర్యాటక మంత్రి జైవీర్ సింగ్ ఠాకూర్ బరిలో ఉన్నారు. ఫిరోజాబాద్‌కు చెందిన ఠాకూర్ బలమైన నాయకుడు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా గెలిచారు. బీఎస్పీ కూడా శివ ప్రసాద్ యాదవ్ రూపంలో బలమైన అభ్యరి్థని రంగంలోకి దించడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. బీఎస్పీ నుంచి మధ్యలో బీజేపీలోకి వెళ్లిన శివప్రసాద్ అనంతరం సొంత పార్టీ కూడా పెట్టి చివరికి బీఎస్పీ గూటికే చేరారు. ఇక్కడ మోదీ–యోగి ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదంతో సమాజ్‌వాదీకి ఎలాగైనా చెక్ పెట్టేందుకు కమలనాథులు తీవ్రంగా ప్రయతి్నస్తున్నారు. కానీ డింపుల్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok sabha elections 2024: ‘మూడో విడత’కు నేడు నోటిఫికేషన్
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక సమరంలో మూడో విడత ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. మూడో విడతలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 లోక్‌సభ స్థానాల్లో మే 7వ తేదీన పోలింగ్ జరగనుంది. వీటితోపాటు అభ్యర్థి మృతితో రెండో విడతలో వాయిదా పడిన మధ్యప్రదేశ్‌లోని బేతుల్ లోక్‌సభ నియోజకవర్గానికి మే 7నే పోలింగ్ ఉంటుంది. శుక్రవారం మూడో విడత ఎన్నికల ప్రక్రియకు నోటిఫికేషన్ వచ్చాక నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. ఈ 94 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 20న ఉంటుంది. మూడో విడతలో అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌తదితర రాష్ట్రాల్లో మే 7న ఎన్నికలు జరుగనున్నాయి. గుజరాత్‌లోని విజాపూర్, ఖంభట్, వఘోడియా, మానవదర్, పోర్బందర్ అసెంబ్లీ స్థానాలతో పాటు, పశి్చమబెంగాల్‌లోని భగవాన్‌గోలా, కర్ణాటకలోని షోరాపూర్ (ఎస్టీ) అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. -
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ప్రచార పర్వానికి తెర
చెన్నై/తిరువనంతపురం/గువాహటి/కోల్‌కతా: తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో శాసనసభ ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రం 7 గంటలకు తెరపడింది. పశ్చిమ బెంగాల్, అస్సాంలో మూడో దశ ఎన్నికలకు ప్రచార పర్వం ముగిసింది. ఇన్నాళ్లూ అవిశ్రాంతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజకీయ పార్టీల నేతలు ఇక ఓట్ల లెక్కల్లో మునిగిపోయారు. ఈ నెల 6న(మంగళవారం) జరిగే ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశారు. కీలకమైన తమిళనాడుపై అందరి దృష్టి నెలకొంది. తమిళనాట 3,998 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ముఖ్యమంత్రి కె.పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, డీఎంకే నేత ఎం.కె.స్టాలిన్, సినీ నటుడు కమల్ హాసన్ తదితర ప్రముఖులు ఎన్నికల బరిలోకి దిగారు. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలుండగా, 6.28 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కేరళలో చివరి రోజు ప్రచారాన్ని నేతలు హోరెత్తించారు. భారీ రోడ్డు షోలు, ర్యాలీలు నిర్వహించారు. ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో జన సమూహాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ ఎవరూ పెద్దగా లెక్కచేయలేదు. రాష్ట్రంలోని 140 నియోజకవర్గాల్లో ఆదివారం భారీ సభలు జరిగాయి. కాంగ్రెస్ నేత రాహుల్ ఉత్తర కోజికోడ్, తిరువనంతపురం జిల్లాల్లో, సీఎం విజయన్ కన్నూరులో రోడ్డు షోల్లో పాల్గొన్నారు. ఆఖరి రోజు కనిపించని హడావుడి పుదుచ్చేరిలో పలు నియోజకవర్గాల్లో ఆఖరి రోజు ఎన్నికల ప్రచారంలో హడావుడి కనిపించలేదు. రాష్ట్రంలో 30 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని సెక్యులర్ డెమొక్రటిక్ అలయెన్స్, ఎన్డీయే నేతృత్వంలోని ఏఐఎన్ఆర్సీ మధ్యే ప్రధానమైన పోటీ సాగుతోంది. అస్సాంలో మూడో దశ ఎన్నికలు మంగళవారం జరుగనున్నాయి. రాష్ట్రంలో ఇవే చివరి దశ ఎన్నికలు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమికి, అధికార బీజేపీ నేతృత్వంలోని కూటమికి మధ్య హోరాహోరి పోరు సాగుతోంది. మరోసారి అధికారం దక్కించుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుండగా, నెగ్గాలని కాంగ్రెస్ కూటమి ఆరాట పడుతోంది. పశ్చిమ బెంగాల్లో మూడో దశ ఎన్నికలకు సర్వం సిద్ధమయ్యింది. దక్షిణ 24 పరగణాల జిల్లా, హుగ్లీ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 31 స్థానాల్లో ప్రచారం ముగిసింది. మూడో దశలో 205 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ జరుగనుండడంతో అధికారులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. -
ప్రచారం..సమాప్తం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తుది విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. మొత్తం మూడు విడతలుగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఇప్పటికే రెండు దశల పోలింగ్ ప్రశాంతంగా పూర్తయింది. ఈ నెల 14వ తేదీన మూడో విడతలో 7 జెడ్పీటీసీ, 91 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సమాయత్తమైంది. ఇప్పటికే ఒక ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవమైన విషయం విదితమే. మూడో విడత జరిగే ఎన్నికల్లో ప్రధానమైన జెడ్పీటీసీ స్థానాలు ఉండడంతో ముఖ్య పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని హోరాహోరీ ప్రచారాన్ని నిర్వహించాయి. టీఆర్ఎస్ తరఫున ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఆయా నియోజకవర్గాల్లోని మండలాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. చివరి రోజైన ఆదివారం ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చింతకాని మండలం రామకృష్ణాపురం, లచ్చగూడెం, నాగులవంచ, కోమట్లగూడెం, నాగిలిగొండ, ప్రొద్దుటూరు, బోనకల్ మండలం లక్ష్మీపురం, గోవిందాపురం, రావినూతల తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ విస్తృత ప్రచారం చేసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను గెలిపించాల్సిందిగా కోరారు. వైరా నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రచారం సాగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున మధిర నియోజకవర్గంలో ఆదివారం కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ)నేత మల్లు భట్టి విక్రమార్క ప్రచారం నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి రఘునాథపాలెం మండలంలో ఈ నెల 9వ తేదీన ఓట్లు అభ్యర్థించిన విషయం విదితమే. మాజీ ఎంపీ, టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు వివిధ మండలాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. కీలక ప్రాదేశిక నియోజకవర్గాలు ఈ విడతలో ఉండడంతో ప్రధాన రాజకీయ పక్షాలు వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. చిత్రవిచిత్రంగా పొత్తులు.. ఇక రాజకీయ పక్షాల పొత్తులు సైతం ఒక్కొక్క చోట చిత్ర విచిత్రంగా కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల సీపీఎం, టీఆర్ఎస్, కొన్ని చోట్ల సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్, ఒక ఎంపీటీసీ స్థానంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తుండటంతో ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. ఇక కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అనేక చోట్ల కలిసి పోటీ చేస్తున్నాయి. రఘునాథపాలెం మండలంలో టీఆర్ఎస్కి సీపీఐ, సీపీఎం మద్దతునివ్వగా, కాంగ్రెస్‌కి టీడీపీ మద్దతునిచ్చింది. బీజేపీ ఒంటరిగా బరిలో ఉండగా, మరికొద్ది మంది స్వతంత్రులుగా పోటీలో నిలిచారు. 7 జెడ్పీటీసీ స్థానాలకు 30మంది, 91 స్థానాలకు 259మంది బరిలో ఉన్నారు. వీరిలో ప్రధానంగా బీజేపీ 18మంది, టీఆర్ఎస్ 85, కాంగ్రెస్ 65, సీపీఎం 18, టీడీపీ 11, సీపీఐ 14, గుర్తింపు పొందిన పార్టీల నుంచి 5, స్వతంత్రులు 43మంది బరిలో ఉన్నారు. ఓటర్లకు గాలం.. మూడో విడత ఎన్నికలకు ప్రచార పర్వం ముగియడంతో ఆయా స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఆయా పార్టీల నేతలు పలు చోట్ల ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే పనిలో నిమగ్నమైనట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధాన పార్టీల మధ్య నువ్వా? నేనా ? అనే రీతిలో ఉన్న స్థానాల్లో ఓటర్లకు తాయిలాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో స్వల్ప ఓట్ల తేడానే గెలుపోటములను తేల్చనుండడంతో..ఓటర్లను ఆకట్టుకునేలా, తమకు ఓట్లు పడేలా అభ్యర్థులు మద్యం, డబ్బు పంపిణీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. -
పొడిచిన పొత్తు!
నారాయణపేట: జిల్లాలో రాజకీయాలు అసక్తికరంగా మారాయి. అధికార పార్టీని ఎదుర్కొనేందుకు బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్కటయ్యాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి ఇదే నిదర్శనమని చెప్పవచ్చు. దేశరాజకీయాలు మనకేందుకు గల్లీ రాజకీయాలు మనకే ముఖ్యం అంటూ కమలంతో చేయి కలిపి వామపక్షాలతో జతకట్టి స్థానిక పోరుకు సిద్దమయ్యారు. బెడిసికొట్టిన ఒప్పందాలు.. నారాయణపేట మండలంలో జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్ తరఫున డాక్టర్ రంజితారెడ్డిని రంగంలోకి దిగి ఎంపీపీ ఒప్పందంతో బీజేపీ నుంచి పోటీకి దిగారు. ధన్వాడ మండలంలో జెడ్పీటీసీకి బీజేపీ నుంచి విమల నామినేషన్ వేయగా కాంగ్రెస్ పార్టీకి ఎంపీపీకి ఇచ్చేందుకు అంగీకారం కూదుర్చుకుంటూ 11 సీట్లలో ఎంపీటీసీ స్థానాలను సర్దుబాటు చేసుకొని రంగంలోకి దిగారు. అలాగే మందిపల్లికి చెందిన చంద్రమ్మ స్వతంత్య్ర అభ్యర్థిగా జెడ్పీటీసీకి నామినేషన్ వేశారు. మరికల్ మండలంలో జెడ్పీటీసీకి కాంగ్రెస్ నుంచి గొల్ల జయమ్మ, బీజేపీ నుంచి జ్యోతిలు నామినేషన్ వేశారు. సయోద్య కోసం పార్టీ బడానేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉపసంహరణ సమయానికి ఏదో ఒకటి తేలిపోయే అవకాశం ఉంది. దామరగిద్ద మండలంలో బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం మైత్రితో కాంగ్రెస్ పార్టీ నుంచి అనిత, కవితలతో నామినేషన్ వేయించారు. ఇద్దరిలో ఒకరిని పోటీలో పెట్టే సమాలోచనలు ఉన్నారు. అధికార పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థులు వీరే.. మరికల్ జెడ్పీటీసీ అభ్యర్థిగా సురేఖారెడ్డి, ధన్వాడ అభ్యర్థిగా కమలమ్మ, నారాయణపేట నుంచి అంజలి, దామరగిద్దలో లావణ్యలతో పాటు 55 స్థానాల్లో ఎంపీటీసీలుగా అభ్యర్థులు పోటీ చేసేందుకు నామినేషన్లు వేశారు. నారాయణపేట ఎంపీపీ జనరల్ కావడంతో చిన్న జట్రం ఎంపీటీసీ స్థానం నుంచి అప్పంపల్లికి చెందిన మాజీ మార్కెట్ చైర్మన్ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డితో నామినేషన్ వేయించారు. కోటకొండలో కిరికిరి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ మైత్రిలో టీఆర్ఎస్ మద్దతుదారులుగా సర్పంచ్‌కు పోటీకి నిలిపారు. ఆ సమయంలో రెండు ఎంపీటీసీ స్థానాలను బీజేపీకి మద్దతిస్తామని అప్పట్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. మారిన రాజకీయ పరిణామాలతో కోటకొండలో చిక్కుముడి పడినట్లయింది. మండలంలో బీజేపీ, కాంగ్రెస్‌పార్టీల మధ్య సయోద్య కుదర్చుకొని ఎంపీపీకి బీజేపీ, కాంగ్రెస్‌కు జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు వేశారు. అయితే కోటకొండలో బీజేపీ, టీఆర్ఎస్లు ముందు ఒప్పుకున్న విధంగానే అభ్యర్థులను ఖరారు చేసుకొని నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే ససేమిరా.. నారాయణపేట మండలంలో కాంగ్రెస్, బీజేపీ పొత్తు పెట్టుకుంటే మీరేమో కోటకొండలో బీజేపీతో పొత్తుపెట్టుకుంటారేమో అంటూ ఎమ్మెల్యే ఆ గ్రామ టీఆర్ఎస్ నేతలపై గరమైనట్లు సమాచారం. నామినేషన్లకు చివరిరోజు కావడంతో టీఆర్ఎస్ నేతలు హుటాహుటిన అభ్యర్థులను తయారుచేసి కోటకొండ ఎంపీటీసీ–1కు ఈడిగ అనంతమ్మను, ఎంపీటీసీ–2కు నాగేంద్రమ్మలతో నామినేషన్లు వేయించారు. ఎరిదారిలో వారు.. బీజేపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ కోటకొండలో బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఉన్న ఒప్పందంతో ముందస్తుగానే కోటకొండ ఎంపీటీసీ–1కి బీజేపీ తరఫున కెంచి అనసూయ, కాంగ్రెస్ తరఫున ఎడ్ల పూజ, 2వ ఎంపీటీసీకి పెంటమ్మ కాంగ్రెస్ తరఫున నామినేషన్లు వేశారు. ఇందులో ఎవరు ఏ రంగంలో ఉంటారో తెలియరాలేదు. పోటీలో సీపీఐ(ఎంల్)న్యూడెమోక్రసీ.. వామపక్షాలకు, బీజేపీకి కోటకొండలో ఎప్పటికీ వారి మధ్యనే పోరు కొనసాగుతుంది. మారిన రాజకీయ సమీకరణలతో కాంగ్రెస్, బీజేపీ పొత్తు కుదుర్చుకున్న సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నుంచి జెడ్పీటీసీగా సరళతో పాటు ఎంపీటీసీ–1కి అభ్యర్థులుగా సీతవీణ, రాజేశ్వరి, అక్కమ్మ, రెండో ఎంపీటీసీకి రాజేశ్వరితో నామినేషన్లు వేయించారు. కృష్ణ మండలంలో కలకలం టికెట్టు ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం తనకు అధికార పార్టీ బీఫాం ఇవ్వలేదని పోటీలోంచి తప్పించి ఉపసంహరింపజేసిందంటూ టీఆర్ఎస్ నాయకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కృష్ణ మండలం జెడ్పీటీసీ స్థానం బీసీ జనరల్‌కు రిజర్వు కావడంతో అధికార పార్టీ నుంచి తనకు టికెట్ ఇవ్వాలని వీరేందర్‌పాటిల్ నామినేషన్ వేశాడు. అయితే పార్టీ టికెట్ తాజా ఎంపీపీ అంజమ్మపాటిల్కు ఇచ్చింది. దీంతో మానస్తాపానికి గురైన వీరేందర్‌పాటిల్ క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
సం‘గ్రామం’.. సమాప్తం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియ పరిసమాప్తమైంది. తొలి దశలో తప్పిస్తే రెండు, మూడో దశల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మూడు దశల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించగా.. చివరి దశ గ్రామాల్లో బుధవారం పోలింగ్ జరిగింది. ఈ మేరకు మొదటి దశలో పోలిస్తే ఎక్కువగా, రెండో దశతో పోలిస్తే తక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. ఇందులో భాగంగా ఎనిమిది మండలాల్లోని 227 పంచాయతీలకు గాను 24 జీపీల పాలకవర్గాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 203 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు. కాగా, ఎన్నికల సందర్భంగా ఎక్కడ కూడా రీ పోలింగ్ నిర్వహించే అవసరం రాకపోవడం.. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. 85.91 శాతం నమోదు మూడో దశ ఎన్నికల సందర్భంగా 85.91 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు. ఈనెల 21న జరిగిన మొదటి దశ ఎన్నికల్లో 84.71 శాతం, 25వ తేదీన రెండో దశ ఎన్నికల్లో 89.5 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు మొదటి దశలో పోలిస్తే ఎక్కువగా, రెండో దశతో పోలిస్తే తక్కువగా మూడో దశలో పోలింగ్ నమోదైనట్లయింది. పర్యవేక్షించిన అధికారులు ఎన్నికల సందర్భంగా అటు ఉద్యోగులు, ఇటు ఓటర్లకు ఇటు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు బుధవారం పోలింగ్ సందర్భంగా ఎనిమిది మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ రొనాల్డ్‌రోస్, ఎస్పీ రెమారాజేశ్వరి ప్రత్యక్షంగా పరిశీలించారు. పోలింగ్ నిర్వహణ తీరును పరిశీలించిన వారు సజావుగా సాగేలా ఉద్యోగులకు పలు సూచనలు చేశారు. ఉదయం మందకొడిగా... మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా చలి ప్రభావం పెరిగింది. ఇది బుధవారం జరిగిన పోలింగ్‌పై ప్రభావం చూపింది. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు మంచు కురుస్తుండడంతో పోలింగ్ ఏడు గంటలకు ప్రారంభమైనా పెద్దగా ఓటర్లు రాలేదు. ఇక 9 గంటల తర్వా త మాత్రం పోలింగ్ జోరందుకుంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 31.81 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఆ తర్వాత 11 గంటల్లోపు ఇది 66.07 శాతానికి చేరింది. మొత్తంగా ఒంటి గంటకు పోలింగ్ ముగిసే సరికి పోలింగ్ శాతం 85.91గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. విధి నిర్వహణలో ఉద్యోగి మృతి పోలింగ్‌లో విధుల్లో ఉన్న ఉద్యోగి ఒకరు గుండెపోటుతో మృతి చెందారు. కోస్గి మండలంలోని ముశ్రీఫా వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్న నర్సప్ప (48)కు ఎన్నికల సందర్భంగా అదే పంచాయతీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. పోలింగ్ ప్రారంభమయ్యాక ఆయనకు ఛాతినొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లే సరికే కన్నుమూశారు. ఓటు వేసిన ఎమ్మెల్యే పంచాయతీ ఎన్నికల్లో భాగంగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. భూత్పూర్ మండలంలోని సొంత గ్రామమైన అన్నసాగర్లో ఆయన ఓటు వేశారు. ఈ మేరకు పోలింగ్ సరళి ఎలా కొనసాగుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. బారులు తీరిన ఓటర్లు ఓట్లు వేసేందుకు గ్రామాల్లో ప్రజలు ఉత్సాహం చూపారు. మూడో విడతలో జిల్లాలోని ఎనిమిది మండలాల్లో ఎన్నికలు జరగగా మొత్తం 85.91 శాతం పోలింగ్ నమోదైంది. అయితే, అత్యధికంగా దేవరకద్ర మండలంలో 91.49 శాతం, తక్కువగా గండీడ్ మండలంలో 74.75 శాతం పోలింగ్ నమోదైంది. పలు గ్రామాల్లో ఉదయం మందకొడిగా సాగినా.. 9గంటల తర్వాత పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. ఇక సమయం ముగిసే ఒంటి గంటకు కొద్దిముందు ఓటర్లు ఎక్కువగా> రాగా.. అందరినీ అనుమతించారు. కట్టుదిట్టమైన భధ్రత జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. పల్లెల్లో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి ఆ బూత్‌ల్లో గట్టి భద్రత చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఎస్పీ రెమారాజేశ్వరి స్వయంగా పలు కేంద్రాల్లో బందోబస్తును పర్యవేక్షించారు. ఓటు వేసిన 2,17,049 మంది మూడో విడతగా ఎన్నికలు జరిగిన 203 పంచాయతీల్లో 2,52,647 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయా జీపీల్లో మొత్తం 1,26,476 మంది పురుషులు, 1,26,090 మంది మహిళా ఓటర్లతో పాటు ఏడుగురు ఇతరులు ఉన్నారు. వీరిలో 1,08,778 మంది పురుషులు, 1,08,269 మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకోగా.. ఇద్దరు ఇతరులు ఓటు వేశారు. 2 గంటల నుంచి కౌంటింగ్ ఉదయం 7 గంటల నుంచి మ«ధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ సాగింది. అనంతరం భోజనం కోసం అధికారులు గంట పాటు విరామం తీసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి లెక్కింపు ప్రారంభించారు. తొలుత వార్డు సభ్యుల ఓట్లు, అనంతరం సర్పంచ్ ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించారు. ఆ తర్వాత ఉపసర్పంచ్ ఎన్నిక కూడా చేతులు లేపే పద్ధతిలో నిర్వహించారు. -
తుది సమరం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో బుధవారం జరిగే మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే తొలి, మలివిడత ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసిన అధికారులు.. అదే తరహాలో మూడో విడత ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. రఘునాథపాలెం, కొణిజర్ల, వైరా, ఎర్రుపాలెం, మధిర, బోనకల్, చింతకాని మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ ప్రక్రియ ఒంటిగంట వరకు కొనసాగనున్నది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ తర్వాత ఎన్నికల అధికారులు ఫలితాలను వెల్లడిస్తారు. ఎన్నికల నిర్వహణ నుంచి కౌంటింగ్ ప్రక్రియ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, లావుడ్యా రాములునాయక్ నియోజకవర్గాలైన ఖమ్మం, వైరాలతోపాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా రాజకీయ పక్షాల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. మూడో విడతలో 192 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. అందులో 24 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 168 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది సిద్ధమయ్యారు. అలాగే 1,740 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 245 వార్డు సభ్యులు ఏకగ్రీవం కాగా.. 1,495 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏడు మండలాల్లో 2,20,011 మంది ఓటర్లు ఉండగా.. 1,08,007 మంది పురుషులు.. 1,11,990 మంది మహిళలు, ఇతరులు 14 మంది ఉన్నారు. 24 జీపీలు ఏకగ్రీవం.. రెండో విడత ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లో 24 గ్రామ పంచాయతీలు, 245 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 168 గ్రామ పంచాయతీల్లో ఎన్నిక జరగనుండగా.. 3,484 మంది సిబ్బందిని ఎన్నికల విధులకు వినియోగిస్తున్నారు. అదనంగా మరో 200 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచారు. వెబ్‌కాస్టింగ్‌లో 136 మంది పాల్గొననున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నిమిత్తం ఇప్పటికే పోలీసు అధికారులు, సిబ్బంది తరలివెళ్లారు. పల్లెల్లో పోటాపోటీ.. గ్రామ పంచాయతీ ఎన్నికలు తుది దశకు చేరుకోవడంతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభ్యర్థులు తమ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే తమకు కేటాయించిన గుర్తులతో అభ్యర్థులు గ్రామాలు, వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సోమవారం సాయంత్రం మూడో విడత ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ముగిసింది. దీంతో అభ్యర్థులు గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందించుకుంటున్నారు. దూర ప్రాంతంలో ఉన్న ఓటర్లను గ్రామాలకు రప్పించే ప్రయత్నాలను ప్రారంభించారు. -
మూడోవిడత షురూ..!
నల్లగొండ : పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడతకు బుధవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి నోటిఫికేషన్ జారీచేశారు. నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. మొదటి విడత దేవరకొండ, రెండో విడత మిర్యాలగూడ డివిజన్లలో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. మూడో విడతకు సంబంధించి నల్లగొండ డివిజన్లోని 11 మండలాల్లోగల పంచాయతీల్లో ఎన్నికల కోసం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కాగా మొదటి రోజు అన్ని మండలాల్లోనూ నామినేషన్లు పడ్డాయి. 11 మండలాల్లో మూడో విడత పోరు.. నల్లగొండ డివిజన్ పరిధిలో 11 మండలాలు ఉన్నాయి. 11 మండలాల పరిధిలోని 257 గ్రామ పంచాయతీలు, 2,322 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో తొలిరోజు 11 మండలాల పరిధిలో 60 మంది సర్పంచ్ పదవులకు నామినేషన్ దాఖలు చేయగా 90 మంది ఆయా గ్రామాల్లోని వార్డులకు నామినేషన్లు వేశారు. ముహూర్తాలు చూసుకుని.. కనుమ మంచి రోజు కాదని చాలా మంది నామినేషన్లు వేసేందుకు ముందుకు రాలేదు. జాతకాలు చూపించుకుని మంచిరోజు కాదనడంతో చాలామంది వెనుకడుగు వేశారని తెలుస్తోంది. మంచిరోజు కాకుండా నామినేషన్ వేస్తే కలిసిరాదేమోనన్న పెద్దల సూచనల మేరకు చాలా వరకు నామినేషన్ల దాఖలు వాయిదా వేసుకున్నట్లు చెప్తున్నారు. గురువారం ఏకాదశి మంచిరోజు కావడంతో అన్ని గ్రామ పంచాయతీలకు నామినేషన్ భారీగా వేసే అవకాశం ఉంది. -
మూడో విడత 61% పోలింగ్
యూపీలో ఓటేసిన రాజ్‌నాథ్, అఖిలేశ్, మాయావతి లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మూడో విడతలో 12 జిల్లాల్లోని 69 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 826 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఉదయం 7 గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ క్రమంగా పుంజుకొంది. ఈ స్థానాల్లో 2012 అసెంబ్లీ ఎన్నికల్లో 59.96 శాతం, 2014 లోక్‌సభ ఎన్నికల్లో 58.43 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ 55 స్థానాలను, బీఎస్పీ ఆరు, బీజేపీ ఐదు, కాంగ్రెస్ రెండు, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానాన్ని గెలుచుకున్నారు. ఓటేసిన ప్రముఖులు కాగా మూడో విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. లక్నోలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బహుజనన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి కుటుంబసభ్యులతో కలసి వచ్చి ఓటేశారు. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, కేంద్ర మంత్రులు ఉమాభారతి, కల్రాజ్ మిశ్రా, సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైశ్వాల్, బీజేపీ ఎంపీ సాక్షీ మహరాజ్ తదితరులు సైతం తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఆశాభావం ఈ సందర్భంగా ప్రధాన పక్షాలన్నీ అధికారం తమదేనని ఘంటాపథంగా చెప్పాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ ‘బీఎస్పీ 300 సీట్లను సాధించి ఉత్తర ప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది’అని అన్నారు. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా యూపీలో బీజేపీ మెజారిటీ సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్పీ, కాంగ్రెస్ కూటమికే ప్రజలు పట్టం కడతారని ముఖ్యమంత్రి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. అఖిలేశే మళ్లీ సీఎం: ములాయం యూపీకి అఖిలేశ్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ గాంధీలు ఎవరికి ఓటేశారో! యూపీ మూడో దశ పోలింగ్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీలు ఓటేశారు. వీరు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కుమారులు కాదులెండి. లక్నోలోని ఓ కుటుంబంలోనూ రాజీవ్ గాంధీ (46), సంజయ్ గాంధీ (45), సోనియా గాంధీ (40)లు ఉన్నారు. రాజీవ్, సంజయ్‌లు అన్నదమ్ములు కాగా, సోనియా మాత్రం ఇక్కడ సంజయ్ భార్య. మరి ఈ గాంధీలను ఎవరికి ఓటేశారని అడగ్గా బయటకు వెల్లడించేందుకు నిరాకరించారు. -
కాశ్మీర్, జార్ఖండ్‌ల్లో మూడో దశ ఎన్నికలు ప్రారంభం
జమ్మూకాశ్మీర్/ జార్ఖండ్: జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల శాసనసభకు మూడో విడత పోలింగ్ మంగళవారం ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో సీఎం ఒమర్ అబ్దుల్లాతోపాటు ముగ్గురు కేబినెట్ మంత్రులు బరిలో ఉన్నారు. బద్గామ్, పుల్వామా, బారాముల్లా జిల్లాల్లోని 16 స్థానాలకు సంబంధించిన పోలీంగ్ కేంద్రాల వద్ద ఓట్లు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్లో మూడో దశ ఎన్నికల్లో మొత్తం 144 మంది అభ్యర్థులు బరిలో నిలిచి... తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాశ్మీర్‌లోయలో శుక్రవారం ఉగ్రవాదులు దాడితో 21 మంది మృతి చెందిన నేపథ్యంలో ఎన్నికల జరిగే ప్రాంతాలలో భారీగా భద్రత బలగాలను మోహరించారు. సీఎం ఒమర్ అబుల్లా గందర్ బాల్‌తోపాటు బీర్ వా స్థానం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. అలాగే జార్ఖండ్‌లో మూడో దశ ఎన్నికల్లో 17 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ దశలో మొత్తం 289 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో 103 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీతోపాటు ప్రస్తుతం ముగ్గురు మంత్రులు ఎన్నికల బరిలో నిలిచారు. -
‘దక్షిణ ముంబై’ బరి మరాఠీ, తెలుగు ఓటర్లే కీలకం
సాక్షి, ముంబై: దక్షిణ ముంబై లోక్‌సభ నియోజకవర్గంలో వివిధ రాష్ట్రాల ప్రజలు ఉంటున్నప్పటికీ మరాఠీ, తెలుగు ప్రజల ఓట్లే కీలకం. గతంలో జరిగిన లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థులు తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు నానాతంటాలు పడ్డారు. మూడో విడత ఎన్నికలకు సమయం దగ్గర పడడం, ఇదే ఆఖరు ఆదివారం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే వర్లీ, లోయర్‌పరేల్, దీపక్ టాకీస్ పరిసరాల్లో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భవనాలు, చాల్స్ వద్ద పర్యటిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు యత్నిస్తున్నారు. తాము గెలిస్తే చేపట్టే అభివృద్థి పనులపై తెలుగు ప్రజలతో సమావేశాలు, పలుకుబడిన వ్యక్తులతో మంతనాలు జరుపుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఒకప్పుడు అనేక వస్త్రమిల్లులు ఉండేవి. ప్రస్తుతం అవి మూతపడడంతో అనేకమంది తెలుగు ప్రజలు స్వగ్రామాలకు వెళ్లిపోయారు. ఈ ప్రాంతంలో అత్యధిక శాతం పేద, మధ్యతరగతి కుటుంబాలే నివసిస్తున్నాయి. మూతపడిన మిల్లు స్థలాల్లో నిర్మిస్తున్న ఇళ్లు ఉచితంగా ఇవ్వాలని వివిధ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గతంలో అనేక పోరాటాలు కూడా చేశాయి. అయితే అధికార డీఎఫ్ కూటమి ప్రభుత్వం అంగీకరించ లేదు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రోడ్డునపడ్డ మిల్లు కార్మికులకు ఉచితంగా ఇళ్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామంటూ ప్రధాన పార్టీలు హామీ ఇస్తున్నాయి. ఆకాశాన్నంటిన నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని, పేదలకు రేషన్ షాపుల్లో అతి తక్కువ ధరకే సరుకుల పంపిణీ ఇలా రకరకాల హామీలు గుప్పిస్తున్నారు. ఇలా ఇస్తున్న హామీలపై దక్షిణ ముంబై లోక్‌సభ నియోజక వర్గం తెలుగు ప్రజలు ఏమంటున్నారో తెలుసుకుందాం.