Exit Poll 2024: భారీ మెజార్టీతో ఎన్డీఏ హ్యాట్రిక్‌ | Exit Poll 2024: Narendra Modi-led NDA set for hattrick with 355-370 seats | Sakshi
Sakshi News home page

Exit Poll 2024: భారీ మెజార్టీతో ఎన్డీఏ హ్యాట్రిక్‌

Published Sun, Jun 2 2024 4:35 AM | Last Updated on Sun, Jun 2 2024 7:23 AM

Exit Poll 2024: Narendra Modi-led NDA set for hattrick with 355-370 seats

లోక్‌సభ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా

ఎన్డీఏకు 350 నుంచి 400 వరకు సీట్లు 

ఇండియా కూటమికి 200లోపే 

బీజేపీకి మళ్లీ సొంతగానే మెజారిటీ 

కాంగ్రెస్‌ 40 నుంచి 70 సీట్లకు పరిమితం 

గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో బీజేపీ క్లీన్‌స్వీప్‌.. మహారాష్ట్ర, బిహార్, రాజస్తాన్, హరియాణాల్లో కోత

ఎన్డీఏ హ్యాట్రిక్‌ ఖాయమని ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్నాయి. భారీ మెజారిటీతో కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకుంటుందని మెజా రిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. బీజేపీ యూపీలో స్థానాలను పెంచుకోవడంతో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్‌ల్లో క్లీన్‌స్వీప్‌ చేస్తుందని కర్ణాటకలో హవా కొనసాగించడమే గాక బెంగాల్లో చొచ్చుకుపోతుందని చెప్పాయి. కాంగ్రెస్‌ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి 150 మార్కు దాటొచ్చని తెలిపాయి. 

న్యూఢిల్లీ: కేంద్రంలో పాలక ఎన్డీఏ కూటమిదే మళ్లీ అధికారమని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్నాయి. భారీ మెజారిటీతో కూటమి హ్యాట్రిక్‌ కొట్టడం, నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధాని కావడం ఖాయమని అభిప్రాయపడ్డాయి. శనివారం సాయంత్రం సార్వత్రిక ఎన్నికల తుది విడత పోలింగ్‌ ముగుస్తూనే ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లువెత్తాయి.

 గుజరాత్, మధ్యప్రదేశ్‌ల్లో మరోసారి బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేస్తుందని వాటిలో చాలావరకు పేర్కొన్నాయి. కర్నాటకలో కూడా బీజేపీ హవాయే కొనసాగుతుందని, పశ్చిమబెంగాల్లో మరింతగా చొచ్చుకుపోతుందని వెల్లడించడం విశేషం. బిహార్, రాజస్తాన్, హరియాణాల్లో మాత్రం ఎన్డీఏకు సీట్లు కాస్త తగ్గుతాయని అంచనా వేశాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. 

విపక్షాల అవకాశవాద రాజకీయాలను జనం పూర్తి గా తిరస్కరించారన్నారు. వాస్తవ ఫలితాల్లో తమకు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను మించి వస్తాయని ధీమా వెలిబుచ్చారు. కాంగ్రెస్‌ మాత్రం ఎగ్జిట్‌ పోల్స్‌ను మోదీ ప్రభావితం చేశారని ఆరోపించింది. వాస్తవ ఫలితాలు చాలా భిన్నంగా రాను న్నాయని విశ్వాసం వెలిబుచి్చంది. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడ్డ నేపథ్యంలో ఇప్పుడిక అందరి కళ్లూ జూన్‌ 4న జరిగే ఓట్ల లెక్కింపు జరిగాక రాబోయే అసలు ఫలితాలపైనే కేంద్రీకృతమయ్యాయి. 

ఏ సర్వే ఏం చెప్పింది...? 
ఇండియాటుడే–మై యాక్సిస్‌ ఎగ్జిట్‌ పోల్‌ ఎన్డీఏకు 361 నుంచి 401 స్థానాలిచి్చంది. ఇండియా కూటమికి 131 నుంచి గరిష్టంగా 166 రావచ్చని తెలిపింది. ఎన్డీఏకు 368 దాకా వస్తాయని రిపబ్లిక్‌ భారత్‌–మారై్టజ్‌ సర్వే పేర్కొంది. ఇండియా కూటమికి 133, ఇతరులకు 48 రావచ్చని తెలిపింది. ఎన్డీఏకు 392 దాకా, ఇండియాకు 161, ఇతరులకు 20 దాకా రావచ్చని జన్‌ కీ బాత్‌ అభిప్రాయపడింది. 

ఎన్డీఏకు బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్న మేరకు 401 స్థానాలు దక్కుతాయని ఇండియా టీవీ–సీఎన్‌ఎక్స్‌ అంచనా వేయడం విశేషం. ఇండియా కూటమికి 139, ఇతరులకు 38 స్థానాలు రావచ్చని తెలిపింది. టుడేస్‌ చాణక్య కూడా కూడా ఎన్డీఏకు 385 నుంచి ఏకంగా 415 సీట్లిచి్చంది! ఇండియా కూటమి 96 నుంచి 118 మధ్య సాధిస్తుందని పేర్కొంది. న్యూస్‌ నేషన్‌ ఎన్డీఏకు 378, ఇండియా కూటమికి 169 స్థానాలిచి్చంది.

 దైనిక్‌ భాస్కర్‌ ఎన్డీఏ కూటమికి 350 దాకా, ఇండియా కూటమికి గరిష్టంగా 201, ఇతరులకు 49 సీట్లిచి్చంది. రిపబ్లిక్‌ టీవీ సర్వేలో ఎన్డీఏకు 359, ఇండియాకు 154, ఇతరులకు 30 స్థానాలొచ్చాయి. ఏబీపీ న్యూస్‌–సీ వోటర్‌ ఎన్డీఏకు 353–383, ఇండియాకు 152 నుంచి 182 సీట్లిచ్చింది. ఎన్డీఏకు 371, ఇండియాకు 125 రావచ్చని ఇండియా న్యూస్‌ పేర్కొంది. టైమ్స్‌ నౌ–ఈటీజీ సర్వే ఎన్డీఏకు 358, ఇండియా కూటమికి 152 స్థానాలిచ్చింది. 

రాష్ట్రాల్లో ఇలా... 
కేంద్రంలో అధికార సాధనకు అత్యంత కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌పై బీజేపీ మరోసారి పట్టు నిలుపుకుంటోందని సర్వేలన్నీ తెలిపాయి. బీజేపీకి యూపీలో ఏకంగా 67 సీట్ల దాకా రావచ్చని ఇండియాటుడే వెల్లడించింది. సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌ సింగిల్‌ డిజిట్లకే పరిమితమవుతాయని తెలిపింది. కర్నాటకలో ఈసారి కూడా బీజేపీకి 23, భాగస్వామి జేడీ(యూ)కు 3 సీట్లు వస్తాయని తెలిపింది. 

ఇక పశి్చమబెంగాల్లోనైతే పాలక తృణమూల్‌ కాంగ్రెస్‌ను తోసిరాజని 23 నుంచి 27 స్థానాలతో బీజేపీ తొలిసారిగా రాష్ట్రంలో అతి పెద్ద పారీ్టగా అవతరించనుందని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. ఇండియాటుడే అయితే బెంగాల్లో బీజేపీకి 30 పై చిలుకు, తృణమూల్‌కు 11 నుంచి 12 స్థానాలివ్వడం విశేషం. కీలకమైన మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి సీట్లు 2019తో పోలిస్తే కాస్త తగ్గి 30 నుంచి 32 దాకా రావచ్చని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి.

సర్వత్రా ఆసక్తి నెలకొన్న ఒడిశాలోనైతే 21 సీట్లకు గాను ఎన్డీఏకు ఏకంగా 18 నుంచి 20 వస్తాయని, అధికార బిజూ జనతాదళ్‌ ఒకట్రెండు సీట్లకు మించబోదని ఇండియాటుడే పేర్కొనడం విశేషం. దక్షిణాదిన కేరళలోనూ తొలిసారి కమలవికాసం ఖాయమని ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్నాయి. అక్కడ బీజేపీకి 3 సీట్ల దాకా ఖాయమని పేర్కొన్నాయి.

 లెఫ్ట్‌ ఫ్రంట్‌ కుదేలవుతుందని, కాంగ్రెస్‌కే మెజారిటీ సీట్లు వస్తాయని తెలిపాయి. రాజస్తాన్, బిహార్లలో ఎన్డీఏకు ఐదారు స్థానాలు తగ్గి ఆ మేరకు ఇండియా కూటమికి పెరగవచ్చని పేర్కొన్నాయి. ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడమే గాక మెజారిటీ లోక్‌సభ స్థానాలూ నెగ్గుతుందని కొన్ని ఎగ్జిట్‌ పోల్స్, ఎన్డీఏ కూటమిదే విజయమని మరికొన్ని పేర్కొన్నాయి. తెలంగాణలో బీజేపీకే ఎక్కువ లోక్‌సభ స్థానాలొస్తాయని తెలిపాయి.

2019లో ఏం జరిగింది?
2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఎన్డీఏ గెలుస్తుందనే జోస్యం చెప్పాయి. మొత్తం 13 ఎగ్జిట్‌ పోల్స్‌ సగటును చూస్తే ఎన్డీఏకు 306, యూపీఏకు 120 సీట్లొస్తాయని పేర్కొన్నాయి. చివరికి ఎన్డీఏకు 353 స్థానాలు రాగా యూపీఏ కేవలం 93 సీట్లతో సరిపెట్టుకుంది. బీజేపీకి సొంతంగానే 303 స్థానాలు రాగా కాంగ్రెస్‌ కేవలం 53 సీట్లు నెగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement