hat trick win
-
హరియాణాలో హ్యాట్రిక్
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ.. 48 సీట్లతో సొంతంగా మెజారిటీ సాధించింది. గెలుపు తమదేననే ధీమాతో వెళ్లిన కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల నష్టాన్ని నివారించలేకపోయింది. మరోవైపు ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్– కాంగ్రెస్ కూటమి విజయాన్ని సొంతం చేసుకుంది. సీపీఎంతో కలిసి కూటమికి 49 స్థానాలు లభించాయి. హరియాణా ప్రజలు తప్పుడు ప్రచారాన్ని తిరస్కరించారు. అభివృద్ధికి గ్యారంటీని గెలిపించారు. భగవద్గీత బోధించిన నేలపై సత్యం, అభివృద్ధి, సుపరిపాలనకు దక్కిన విజయమిది. ఏ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా దీర్ఘకాలం పాటు ప్రజలు మద్దతిస్తూ వచ్చారు. అక్కడ కాంగ్రెస్‌కు ‘నో ఎంట్రీ’చూపించారు. అధికారాన్ని జన్మహక్కుగా భావించే కాంగ్రెస్‌కు మళ్లీ అవకాశమివ్వడం చాలా అరుదు. వరుసగా మూడోసారి బీజేపీకి మెజారిటీ ఇచ్చిన హరియాణా ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. కూటములు కడుతూ భాగస్వాములపై ఆధారపడే కాంగ్రెస్ పార్టీ పరాన్నజీవి. ఒక్కోసారి ఆ పార్టీలనే మింగేస్తుంటుంది.జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడం భారత రాజ్యాంగం, ప్రజాస్వా మ్యం సాధించిన విజయం. మంచి ఫలితాలు సాధించిన నేషనల్ కాన్ఫరెన్స్‌కు అభినందనలు. బీజేపీ సాధించిన ఫలితాలను చూసి గర్వంగా ఉంది. మా పార్టీపై నమ్మకముంచి, ఓటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు – బీజేపీ కార్యాలయంలో మోదీచండీగఢ్: పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను పటాపంచలు చేస్తూ, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ మూడోసారీ హరియాణాలో అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైంది. జాట్లనే నమ్ముకున్న కాంగ్రెస్ చతికిలపడితే ఓబీసీ, దళితులు, బ్రాహ్మణుల ఓట్లను సమీకరించి బీజేపీ జయకేతనం ఎగరేసింది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో తగ్గిన ఎంపీ సీట్లతో కుదుపులకు లోనైన కమలనాథుల విజయరథ జైత్రయాత్ర.. హరియాణాలో మాత్రం సాఫీగా సాగింది.మంగళవారం ఉదయం కౌంటింగ్ మొదలయ్యాక ఆరంభ రౌండ్లలో కాంగ్రెస్ ఆధిక్యత స్పష్టంగా కనిపించింది. తర్వాత ఉదయం 10, 11 గంటల సమయం దాటగానే ఫలితాల సరళిలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ఆధిక్యత క్రమంగా తగ్గుతూ బీజేపీ పుంజుకుంది. అది అలాగే తుదికంటా కొనసాగి కమలనాథులకు విజయాన్ని కట్టబెట్టింది. మంగళవారం వెల్లడైన హరియాణా శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 48 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ 37 స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే బీజేపీకి 39.94 శాతం ఓట్లు పడగా దాదాపు అదే స్థాయిలో కాంగ్రెస్‌కు 39.09 శాతం ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ కంటే కేవలం 0.85 శాతం ఓట్ల ఆధిక్యతతో బీజేపీ ఏకంగా 11 సీట్లను ఎక్కువ గెల్చుకోవడం గమనార్హం. చాలా చోట్ల అత్యల్ప తేడాతో కాంగ్రెస్ ఓడినట్లు వార్తలొచ్చాయి. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపించగా వాటిని నిరాధార ఆరోపణలుగా కేంద్ర ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఐఎన్ఎల్డీ) పార్టీ కేవలం రెండు చోట్ల గెలిచింది. స్వతంత్రులు మూడు స్థానాల్లో నెగ్గారు. దుష్యంత్ చౌతాలా సారథ్యంలోని జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. సొంతంగా బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 1.79 శాతం ఓట్లతో గెలుపు బోణీ కొట్టలేక ఉసూరుమంది. మల్లయోధురాలి గెలుపు పట్టు బీజేపీ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ(లాద్వా), కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హూడా(గర్హీ సాంప్లా–కిలోయీ) విజయం సాధించారు. ఒలింపిక్స్‌లో స్వర్ణం కొద్దిలో చేజార్చుకున్న మల్లయోధురాలు వినేశ్ ఫొగాట్ ఎన్నికల్లో మాత్రం విజయాన్ని తొలి ప్రయత్నంలోనే ఒడిసిపట్టుకున్నారు. ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఈమె జూలానా నియోజకవర్గంలో విజయకేతనం ఎగరేశారు. హిసార్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రామ్నివాస్ రాణాపై దేశంలోనే అత్యంత ధనిక మహిళ సావిత్రి జిందాల్ స్వతంత్య్ర అభ్యరి్థగా పోటీచేసి గెలిచారు.జేజేపీ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా, హరియాణా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్, మాజీ సీఎం భజన్‌లాల్ మనవడు, బీజేపీ నేత భవ్య బిష్ణోయ్ ఓటమిని చవిచూశారు. భవ్య ఓడిపోయిన అదమ్‌పూర్ స్థానం గత ఐదు దశాబ్దాలుగా బిష్ణోయ్‌లకు కంచుకోటగా ఉంది. ఐఎన్ఎల్డీ నేత అభయ్ సింగ్ చౌతాలా సైతం ఓడిపోయారు. ఎగ్జిట్ పోల్స్‌ను తలకిందులు చేసిన బీజేపీ తన కేబినెట్ మంత్రులను మాత్రం గెలిపించుకోలేకపోయింది. అసెంబ్లీ స్పీకర్, బీజేపీ నేత జ్ఞాన్‌చంద్ గుప్తా, ఎనిమిది మంది మంత్రులు ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో 15 శాతం ఓట్లతో 10 స్థానాల్లో గెలిచిన జననాయక్ జనతా పార్టీ ఈసారి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 13 మందిమహిళల విజయం 90 స్థానాలున్న అసెంబ్లీలోకి ఈసారి 13 మంది మహిళలు అడుగుపెట్టబోతున్నారు. వినేశ్ ఫొగాట్, సావిత్రి జిందాల్‌సహా 13 మంది గెల్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది మహిళా అభ్యర్థులు గెలిచారు. బీజేపీ నుంచి ఐదుగురు, కాంగ్రెస్ నుంచి ఏడుగురు మహిళలు విజయం సాధించారు. ప్రభుత్వ పథకాలకు ప్రజామోదం: సీఎం సైనీ పార్టీని విజయతీరాలకు చేర్చినందుకు ఓటర్లకు బీజేపీ నేత, ముఖ్యమంత్రి సైనీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ మోదీ నాయకత్వంలో ప్రభుత్వ విధానాలకు ప్రజలు పట్టంకట్టారు. ప్రభుత్వ పథకాలకు ప్రజామోదం దక్కిందనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. ఈ గెలుపు ఘనత పూర్తిగా మోదీజీదే’ అని సీఎం అన్నారు. -
Exit Poll 2024: భారీ మెజార్టీతో ఎన్డీఏ హ్యాట్రిక్
ఎన్డీఏ హ్యాట్రిక్ ఖాయమని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. భారీ మెజారిటీతో కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకుంటుందని మెజా రిటీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. బీజేపీ యూపీలో స్థానాలను పెంచుకోవడంతో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్‌ల్లో క్లీన్‌స్వీప్ చేస్తుందని కర్ణాటకలో హవా కొనసాగించడమే గాక బెంగాల్లో చొచ్చుకుపోతుందని చెప్పాయి. కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి 150 మార్కు దాటొచ్చని తెలిపాయి. న్యూఢిల్లీ: కేంద్రంలో పాలక ఎన్డీఏ కూటమిదే మళ్లీ అధికారమని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. భారీ మెజారిటీతో కూటమి హ్యాట్రిక్ కొట్టడం, నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధాని కావడం ఖాయమని అభిప్రాయపడ్డాయి. శనివారం సాయంత్రం సార్వత్రిక ఎన్నికల తుది విడత పోలింగ్ ముగుస్తూనే ఎగ్జిట్ పోల్స్ వెల్లువెత్తాయి. గుజరాత్, మధ్యప్రదేశ్‌ల్లో మరోసారి బీజేపీ క్లీన్‌స్వీప్ చేస్తుందని వాటిలో చాలావరకు పేర్కొన్నాయి. కర్నాటకలో కూడా బీజేపీ హవాయే కొనసాగుతుందని, పశ్చిమబెంగాల్లో మరింతగా చొచ్చుకుపోతుందని వెల్లడించడం విశేషం. బిహార్, రాజస్తాన్, హరియాణాల్లో మాత్రం ఎన్డీఏకు సీట్లు కాస్త తగ్గుతాయని అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. విపక్షాల అవకాశవాద రాజకీయాలను జనం పూర్తి గా తిరస్కరించారన్నారు. వాస్తవ ఫలితాల్లో తమకు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి వస్తాయని ధీమా వెలిబుచ్చారు. కాంగ్రెస్ మాత్రం ఎగ్జిట్ పోల్స్‌ను మోదీ ప్రభావితం చేశారని ఆరోపించింది. వాస్తవ ఫలితాలు చాలా భిన్నంగా రాను న్నాయని విశ్వాసం వెలిబుచి్చంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డ నేపథ్యంలో ఇప్పుడిక అందరి కళ్లూ జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు జరిగాక రాబోయే అసలు ఫలితాలపైనే కేంద్రీకృతమయ్యాయి. ఏ సర్వే ఏం చెప్పింది...? ఇండియాటుడే–మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ ఎన్డీఏకు 361 నుంచి 401 స్థానాలిచి్చంది. ఇండియా కూటమికి 131 నుంచి గరిష్టంగా 166 రావచ్చని తెలిపింది. ఎన్డీఏకు 368 దాకా వస్తాయని రిపబ్లిక్ భారత్–మారై్టజ్ సర్వే పేర్కొంది. ఇండియా కూటమికి 133, ఇతరులకు 48 రావచ్చని తెలిపింది. ఎన్డీఏకు 392 దాకా, ఇండియాకు 161, ఇతరులకు 20 దాకా రావచ్చని జన్ కీ బాత్ అభిప్రాయపడింది. ఎన్డీఏకు బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్న మేరకు 401 స్థానాలు దక్కుతాయని ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ అంచనా వేయడం విశేషం. ఇండియా కూటమికి 139, ఇతరులకు 38 స్థానాలు రావచ్చని తెలిపింది. టుడేస్ చాణక్య కూడా కూడా ఎన్డీఏకు 385 నుంచి ఏకంగా 415 సీట్లిచి్చంది! ఇండియా కూటమి 96 నుంచి 118 మధ్య సాధిస్తుందని పేర్కొంది. న్యూస్ నేషన్ ఎన్డీఏకు 378, ఇండియా కూటమికి 169 స్థానాలిచి్చంది. దైనిక్ భాస్కర్ ఎన్డీఏ కూటమికి 350 దాకా, ఇండియా కూటమికి గరిష్టంగా 201, ఇతరులకు 49 సీట్లిచి్చంది. రిపబ్లిక్ టీవీ సర్వేలో ఎన్డీఏకు 359, ఇండియాకు 154, ఇతరులకు 30 స్థానాలొచ్చాయి. ఏబీపీ న్యూస్–సీ వోటర్ ఎన్డీఏకు 353–383, ఇండియాకు 152 నుంచి 182 సీట్లిచ్చింది. ఎన్డీఏకు 371, ఇండియాకు 125 రావచ్చని ఇండియా న్యూస్ పేర్కొంది. టైమ్స్ నౌ–ఈటీజీ సర్వే ఎన్డీఏకు 358, ఇండియా కూటమికి 152 స్థానాలిచ్చింది. రాష్ట్రాల్లో ఇలా... కేంద్రంలో అధికార సాధనకు అత్యంత కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌పై బీజేపీ మరోసారి పట్టు నిలుపుకుంటోందని సర్వేలన్నీ తెలిపాయి. బీజేపీకి యూపీలో ఏకంగా 67 సీట్ల దాకా రావచ్చని ఇండియాటుడే వెల్లడించింది. సమాజ్‌వాదీ, కాంగ్రెస్ సింగిల్ డిజిట్లకే పరిమితమవుతాయని తెలిపింది. కర్నాటకలో ఈసారి కూడా బీజేపీకి 23, భాగస్వామి జేడీ(యూ)కు 3 సీట్లు వస్తాయని తెలిపింది. ఇక పశి్చమబెంగాల్లోనైతే పాలక తృణమూల్ కాంగ్రెస్‌ను తోసిరాజని 23 నుంచి 27 స్థానాలతో బీజేపీ తొలిసారిగా రాష్ట్రంలో అతి పెద్ద పారీ్టగా అవతరించనుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఇండియాటుడే అయితే బెంగాల్లో బీజేపీకి 30 పై చిలుకు, తృణమూల్‌కు 11 నుంచి 12 స్థానాలివ్వడం విశేషం. కీలకమైన మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి సీట్లు 2019తో పోలిస్తే కాస్త తగ్గి 30 నుంచి 32 దాకా రావచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.సర్వత్రా ఆసక్తి నెలకొన్న ఒడిశాలోనైతే 21 సీట్లకు గాను ఎన్డీఏకు ఏకంగా 18 నుంచి 20 వస్తాయని, అధికార బిజూ జనతాదళ్ ఒకట్రెండు సీట్లకు మించబోదని ఇండియాటుడే పేర్కొనడం విశేషం. దక్షిణాదిన కేరళలోనూ తొలిసారి కమలవికాసం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. అక్కడ బీజేపీకి 3 సీట్ల దాకా ఖాయమని పేర్కొన్నాయి. లెఫ్ట్ ఫ్రంట్ కుదేలవుతుందని, కాంగ్రెస్‌కే మెజారిటీ సీట్లు వస్తాయని తెలిపాయి. రాజస్తాన్, బిహార్లలో ఎన్డీఏకు ఐదారు స్థానాలు తగ్గి ఆ మేరకు ఇండియా కూటమికి పెరగవచ్చని పేర్కొన్నాయి. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడమే గాక మెజారిటీ లోక్‌సభ స్థానాలూ నెగ్గుతుందని కొన్ని ఎగ్జిట్ పోల్స్, ఎన్డీఏ కూటమిదే విజయమని మరికొన్ని పేర్కొన్నాయి. తెలంగాణలో బీజేపీకే ఎక్కువ లోక్‌సభ స్థానాలొస్తాయని తెలిపాయి.2019లో ఏం జరిగింది?2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ గెలుస్తుందనే జోస్యం చెప్పాయి. మొత్తం 13 ఎగ్జిట్ పోల్స్ సగటును చూస్తే ఎన్డీఏకు 306, యూపీఏకు 120 సీట్లొస్తాయని పేర్కొన్నాయి. చివరికి ఎన్డీఏకు 353 స్థానాలు రాగా యూపీఏ కేవలం 93 సీట్లతో సరిపెట్టుకుంది. బీజేపీకి సొంతంగానే 303 స్థానాలు రాగా కాంగ్రెస్ కేవలం 53 సీట్లు నెగ్గింది. -
Lok sabha elections 2024:ఎన్డీఏ హ్యాట్రిక్ ఖాయం
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని టైమ్స్ నౌ–ఈటీజీ సర్వే పేర్కొంది. ఎన్డీఏకు 383 స్థానాలొస్తాయని, విపక్ష ఇండియా కూటమి 118 సీట్లకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. అధికార బీజేపీ ఏకంగా 344 సీట్లు సాధిస్తుందని, కాంగ్రెస్ తన చరిత్రలోనే అత్యల్పంగా కేవలం 37 లోక్‌సభ స్థానాలతో కుదేలవనుందని పేర్కొంది. ఎన్డీఏ కూటమి ఏకంగా 49 శాతం ఓట్లు ఒడిసిపడుతుందని, ఇండియా కూటమికి 34 శాతం వస్తాయని తేల్చింది. ఆంధ్రప్రదేశ్‌లో 25 స్థానాలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 22 సీట్లు సాధించి లోక్‌సభలో మూడో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని వెల్లడించింది. తమిళనాట డీఎంకేకు కూడా 22 స్థానాలొస్తాయని, పశి్చమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు 19, ఒడిశాలో బిజూ జనతాదళ్‌కు 11 సీట్లొస్తాయని తెలిపింది. కేజ్రీవాల్ అరెస్టుతో సంక్షోభంలో పడ్డట్టు కని్పస్తున్న ఆప్ 6 స్థానాలతో మెరుగైన ప్రదర్శన చేస్తుందని సర్వే పేర్కొనడం విశేషం. ఇక అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న తెలంగాణలో 17 స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 9 దక్కుతాయని, బీజేపీ 5, మజ్లిస్ ఒక స్థానం గెలుచుకుంటాయని వివరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమికి తోడు నేతల వలస తదితరాలతో కుంగిపోయిన బీఆర్ఎస్ 2 స్థానాలకు పరిమితబమవుతుందని తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 353 స్థానాలు రావడం తెలిసిందే. అందులో ఒక్క బీజేపీయే ఏకంగా 303 స్థానాలు సాధించింది. కాంగ్రెస్ కేవలం 52 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. యూపీఏకు 91, ఇతరులకు 98 సీట్లొచ్చాయి. -
AP: తమ్ముళ్ల ‘ఉనికి’పాట్లు
సంక్షేమ పథకాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆదరాభిమానాలను చూరగొంది. గడప గడపకు మన ప్రభుత్వంతో నాయకులు ఇంటి వద్దకే వచ్చి అభివృద్ధిని వివరించడంతో పాటు సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తుండటం సరికొత్త చరిత్రకు నాంది పలికింది. ఈ కోవలోనే శ్రీశైలం నియోజకవర్గంలో ఇప్పటికే రెండు విడతలుగా విజయదుందుభి మోగించిన వైఎస్సార్సీపీ.. హ్యాట్రిక్ విజయం దిశగా దూసుకెళ్తుంది. ఎన్నికలు సమీపిస్తున్నా తెలుగుదేశం పారీ్టలో అభ్యర్థి ఎవరనే విషయంలోనూ స్పష్టత కొరవడింది. ఇప్పటి వరకు అంటీముట్టనట్లుగా ఉన్న ఇద్దరు నాయకులు ఇప్పుడు తమ ‘ఉనికి’ చాటుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ‘తమ్ముళ్ల’ను గందరగోళానికి గురిచేస్తుండటం గమనార్హం. సాక్షి, నంద్యాల: శ్రీశైలం నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2014, 2019 రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థులే విజయకేతనం ఎగరవేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్‌రెడ్డిపై 39వేలకు పైగా మెజారీతో గెలుపొందారు. 2024లో జరిగే ఎన్నికల్లోనూ హ్యాట్రిక్ నమోదు దిశగా పార్టీ దూసుకుపోతోంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీలో అభ్యర్థి ఎవరనే విషయంలోనూ స్పష్టత కరువైంది. ఓటమి తప్పదని తెలిసినా ఇద్దరు నేతలు సీటు తనకంటే తనకని సిగపట్లకు సిద్ధమయ్యారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా గ్రూపులుగా ఏర్పడి దూషణలకు తెరతీయడం పార్టీ పరువు బజారున పడుతోంది. ఇదే సమయంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సీట్ల కేటాయింపు విషయంలో బేరం పెట్టారనే చర్చ జరుగుతోంది. ఎవరు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టుకుంటారో వాళ్ల వైపే ఆయన మొగ్గు చూపుతున్నట్లు ఆ పార్టీ వర్గీయులే చెప్పుకుంటున్నారు. ఇకపోతే 2014లో వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత అధికారంలో ఉన్న టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో ఆయనపై నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ పరిణామం 2019 ఎన్నికల్లో ప్రస్ఫుటంగా కనిపించింది. టీడీపీ నుంచి పోటీ చేసిన బుడ్డా వైఎస్సార్ సీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి చేతిలో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్గా కొనసాగుతున్నా.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కనీస పోటీ ఇవ్వలేకపోవడం గమనార్హం. పంచాయతీ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసి ప్రజా క్షేత్రంలో తిరుగులేదని చాటుకుంది. లోకేశ్ మద్దతు తనకే ఉందని, జిల్లా టీడీపీ నాయకులు కూడా అభ్యర్థిగా తన పేరునే అధిష్టానికి సూచించారని చెప్పుకుంటున్న బుడ్డా పార్టీ ఫిరాయింపు మచ్చను ఇప్పటికీ తుడిచేసుకోలేకపోతున్నారు. వైఎస్సార్సీపీపై అభిమానంతో గెలుపును అందిస్తే.. తమ మనోభావాలను టీడీపీకి తాకట్టు పెట్టారని ప్రజలు ఇప్పటికీ ఆయనపై భగ్గుమంటున్నారు. డబ్బు మూటలతో ఏరాసు.. ఏరాసు ప్రతాపరెడ్డి కాంగ్రెస్ హయాంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందినా.. రాష్ట్ర విభజన తర్వాత 2014లో పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ తరపున పోటీ చేశారు. అయితే ప్రజలు ఆయనను ఆదరించకపోవడంతో ఓటమిని చవిచూశారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. తాజాగా ఆయన శ్రీశైలం నియోజకవర్గంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు టీడీపీ తరపున పావులు కదుపుతున్నారు. ఎన్నికల సమయంలో తప్పితే ఎప్పుడూ కనిపించని, ప్రజలతో సత్సంబంధాలు లేని ఈయన డబ్బును నమ్ముకుని రాజకీయం చేసేందుకు సిద్ధమయ్యారనే చర్చ జరుగుతోంది. టిక్కెట్ తనకు ఇస్తే ఎంత ఖర్చుకైనా వెనుకాడేది లేదనే విషయాన్ని ఆయన ఇటీవల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును కలిసి తన ప్రతిపాదనను ఆయన ముందుంచినట్లు తెలిసింది. ఆ మేరకు ఆయన జనవరిలో తనను ఇన్చార్జ్గా ప్రకటిస్తారని తన వర్గంతో చెప్పుకుంటున్నట్లు సమాచారం. ఇదిలాఉంటే ఏరాసు అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ నేతలు మాండ్ర శివానందరెడ్డి, గౌరు వెంకటరెడ్డి అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా వార్ నిన్న మొన్నటి వరకు ప్రజల్లో ఎక్కడా కనిపించని ఏరాసు ఎన్నికల సమయంలో తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేసమయంలో టీడీపీ టిక్కెట్ తనకేనని ఆయన ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో బుడ్డా వర్గం సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలకు దిగుతోంది. ఎన్నికల సమయంలో ఆయన షో చేస్తున్నారని ఘాటు గా స్పందిస్తోంది. టిక్కెట్ ఎవరికనే విషయంలో ఆ పార్టీ నిర్ణయం తీసుకోలేకపోవడం పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేస్తోంది. ఇప్పటి ఆ పార్టీ వర్గీయులు ఒక్కొక్కరుగా వైఎస్సార్సీపీలో చేరిపోతుండగా.. నేతలను కూడా ఓటమి భయం వెంటాడుతోంది. వీరిద్దరి మధ్య నెలకొన్న విభేదాలతో రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అహ్మద్ హుస్సేన్ కూడా టీడీపీ తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు చర్చ జరుగుతోంది. -
Times Now ETG Survey on Elections 2024: మళ్లీ ఎన్డీఏనే!
న్యూఢిల్లీ: ఇప్పటికిప్పుడు లోక్‌సభకు ఎన్నికలు జరిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ కొడుతుందని టైమ్స్ నౌ నవజీవన్, ఈటీజీ ఒపీనియన్ పోల్ బుధవారం వెల్లడించింది. మొత్తం 543 స్థానాల్లో ఎన్డీఏ కూటమికి ఏకంగా 323 సీట్లొస్తాయని అంచనా వేసింది. విపక్ష ఇండియా కూటమి 163 సీట్లకు పరిమితమవుతుందని చెప్పింది. ఇతర ప్రాంతీయ పార్టీలన్నీ కలిపి 57 స్థానాలు దక్కించుకుంటాయని వెల్లడించింది. ముఖ్యంగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనైతే ఆ పార్టీ దాదాపుగా క్లీన్‌స్వీప్ చేస్తుందని తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 354 సీట్లు రావడం తెలిసిందే. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏకు 93 సీట్లు రాగా ఇతరులకు 96 దక్కాయి. -
‘హ్యాట్రిక్’ హీరో కేపీ వివేకానంద్
ఎమ్మెల్యేగా వివేకానంద్ ముచ్చటగా మూడోసారి ఎన్నికలో ‘హ్యాట్రిక్’ సాధించారు. గతంలో మేడ్చల్‌లో అంతర్భాగంగా ఉన్న కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ 2009లో నియోజకవర్గంగా ఏర్పడింది. ఈ క్రమంలో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యరి్థగా కూన శ్రీశైలంగౌడ్ గెలుపొందారు. తర్వాత 2014, 2018, 2023 వరుసగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వివేకానంద ఘన విజయం సాధిస్తూ వచ్చారు. గడచిన ఎన్నికల్లో 41,500 మెజార్టీ రాగా తాజాగా ఏకంగా 85,576 మెజారీ్టతో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా భారీ మెజారీ్టతో గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు నెలకొల్పారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అనూహ్యంగా కాంగ్రెస్, బీజేపీ బలమైన అభ్యర్థులు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన వివేకానంద్ తనదైన శైలిలో పాదయాత్రల ద్వారా, స్థానికంగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. ఈ క్రమంలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఆయనకు ఘనవిజయం చేకూర్చి పెట్టారు. కుత్బుల్లాపూర్: ఎమ్మెల్యే వివేకానంద్ ఘనవిజయం సాధించడంతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది.. గత నెల రోజులుగా విస్తృత ప్రచారంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు కలిసి సూరారం కట్ట మైసమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా చింతల్ పార్టీ కార్యాలయానికి వచ్చి ఈ విజయం కుత్బుల్లాపూర్ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివేకానంద ప్రకటించారు. హ్యాట్రిక్ ఇచి్చన ప్రజలకు రుణపడి ఉంటా.. తనపై నమ్మకంతో హ్యాట్రిక్ విజయం చేకూర్చిన ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. సుమారు రూ.6వేల కోట్ల నిధులతో కుత్బుల్లాపూర్ రూపురేఖలు మార్చానన్నారు. తద్వారా ప్రజల్లో ఉంటూ ముందుకు సాగానన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని అభివృద్ధి మౌలిక వసతులు కలి్పంచడం మూలంగానే నన్ను ఆదరించి గెలిపించారని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇచి్చన తనకు మీ సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని కోరారు. రికార్డు విజయంతో ఆనందోత్సవాలు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఎన్నికైన వివేకానంద్ రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 85,576 మెజార్టీ ఓట్లు కార్యకర్తల్లో జోష్ పెంచింది. ఆది నుండి ఎమ్మెల్యేకు వెన్నంటి ఉండేవారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక టీమ్ స్పిరిట్‌తో ముందుకు సాగుతూ తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న ఎమ్మెల్యే వివేకానంద్‌కు రెండు సంవత్సరాలుగా పార్టీ కార్పొరేటర్లు దూరం ఉన్నప్పటికీ చివరికి మంత్రి కేటీఆర్ చొరవతో ఎట్టకేలకు ఎన్నికల్లో ఎమ్మెల్యేతో కలిసి ప్రచారం చేశారు. అంతకుముందే తనకంటూ ఒక వర్గాన్ని ద్వితీయ శ్రేణి నాయకులను ఎంపిక చేసుకొని డివిజన్ల వారీగా పక్క ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగడంతో ఈ భారీ విజయం చేకూరిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఇద్దరూ హ్యాట్రిక్ వీరులే.. కుత్బుల్లాపూర్: ఆదివారం వెలువడిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో కుత్బుల్లాపూర్ నుంచి వివేకానంద్, కూకట్పల్లి నుంచి మాధవరం కృష్ణారావులు ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేలుగా హ్యాట్రిక్ విజయం సాధించారు. దీంతో ఫలితం వెలువడిన వెంటనే ఇరువురు ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి గెలుపొందిన ఆనందాన్ని పంచుకున్నారు. ఇరువురు గతంలో టీడీపీ నుంచి గెలిచి అనంతరం బీఆర్ఎస్లో చేరారు. ఒకటి నుంచి 22వ రౌండ్ వరకు వివేకానంద్ ఆధిపత్యం కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల్లో కేపీ వివేకానందగౌడ్ (బీఆర్ఎస్)కు 1,87, 999 ఓట్లు, కూన శ్రీశైలంగౌడ్(బీజేపీ)కు 1,02,423 ఓట్లు, కొలన్ హన్మంత్‌రెడ్డి (కాంగ్రెస్)కు 1,01,554 ఓట్లు రాగా 85,576 ఆదిక్యంతో బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానందగౌడ్ సమీప బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్‌పై ఘన విజయం సాధించారు. ఒకటో రౌండ్ నుంచి 22 రౌండ్ వరకు ఎక్కడా తగ్గకుండా ప్రతి రౌండ్లో ఆధిక్యత కనబరిచి వివేకానంద పట్టు నిలుపుకుని హ్యాట్రిక్ నమోదు చేసుకున్నారు. అయితే 20 రౌండు వరకు రెండో స్థానంలో కొనసాగిన కాంగ్రెస్ అభ్యర్థి హన్మంత్‌రెడ్డి చివరి రెండు రౌండ్లలో వెనక్కి తగ్గడంతో అనూహ్యంగా రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్ వచ్చారు. ఫలితం ప్రకటించే సమయానికి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. -
మామ, అల్లుళ్ల డబుల్ ధమాకా
తెలంగాణ తొలి, మలి ఉద్యమానికి ఊపిరి సిద్దిపేట. ఉద్యమాల పురిటి గడ్డగా, విలక్షణమైన తీర్పునకు వేదికగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందింది. నాడు తెలంగాణ ప్రజాసమితితో తొలిదశ ఉద్యమానికి అనంతుల మదన్ మోహన్ నాయకత్వం వహించారు. నేడు మలిదశ ఉద్యమం ద్వారా స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజకీయ ఓనమాలు నేర్పిన గడ్డ ఇది. మామ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని హరీశ్‌రావు ప్రస్తుతం అదే పరంపర కొనసాగిస్తున్నారు. సిద్దిపేటజోన్: సిద్దిపేట నియోజకవర్గం ఏర్పడి 71 ఏళ్లు అయినప్పటికీ ఐదు దశాబ్దాలుగా ముగ్గురిని మాత్రమే ప్రజలు ఆదరించి విలక్షణమైన తీర్పును ఇచ్చారు. వారిలో మదన్ మోహన్ హ్యాట్రిక్ సాధించగా, సీఎం కేసీఆర్, ఆయన మేనల్లుడు హరీశ్‌రావు మాత్రం డబుల్ హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. సిద్దిపేటలో బీఆర్ఎస్ ఐదుసార్లు, కాంగ్రెస్ ఐదు సార్లు, టీడీపీ నాలుగు సార్లు, ఒక్కొక్కసారి పీడీఎఫ్, టీపీఎస్, స్వతంత్ర అభ్యర్థులను ఆదరించారు. ప్రస్తుతం ఏడోసారి విజయం కోసం హరీశ్‌రావు బరిలో ఉన్నారు. ముగ్గురూ ముగ్గురే.. సిద్దిపేట నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఇరవై సార్లు ఎన్నికలు జరిగాయి. వాటిలో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఐదుసార్లు ఉప ఎన్నికలు వచ్చాయి. 1952లో ఎడ్ల గురవారెడ్డి(పీడీఫ్), 1957 లో రాజేశ్వర్‌రావు(కాంగ్రెస్), 1962లో సోమేశ్వర్ రావు(స్వతంత్ర), 1967లో వీబీ రాజు(కాంగ్రెస్)ను నియోజకవర్గ ప్రజలు ఒక్కోసారి ఆదరించి గెలిపించారు. తర్వాత 1970లో పోటీ చేసిన మదన్ మోహన్‌ను నాలుగు సార్లు, తర్వాత పోటీ చేసిన కేసీఆర్, హరీశ్‌రావును ఆరు సార్లు వరుసగా గెలిపించారు. వారిలో మదన్ మోహన్ హ్యాట్రిక్, కేసీఆర్, హరీశ్‌రావు డబుల్ హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. ఉద్యమానికి వేదిక.. సిద్దిపేట తెలంగాణ తొలి, మలి ఉద్యమానికి వేదిక లాంటిది. 1969 తొలి విడత ఉద్యమ నేపథ్యంలో అప్పట్లో వీబీ రాజు ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. 1970లో జరిగిన తొలి ఉపఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి(పీడీఎఫ్) నుంచి అనంతుల మదన్ మోహన్ పోటీచేసి విజయం సాధించారు. అక్కడి నుంచి మొదలైన మదన్ మోహన్ రాజకీయ ప్రస్థానం 1985 వరకు కొనసాగింది. కాంగ్రెస్‌లో టీపీఎస్ విలీనం కావడంతో పీవీ రాజేశ్వర్‌రావు, మర్రి చెన్నారెడ్డి, భవనం వెంకట్రాం, టి.అంజయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వాల్లో మదన్ మోహన్ పలుశాఖల మంత్రిగా పనిచేశారు. 1985లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో మదన్ మోహన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడుగా కొనసాగారు. అదే పంథాలో సీఎం కేసీఆర్ 2001లో మలి విడత తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి స్వరాష్ట్ర సాధన ద్వారా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అంతకు ముందు కేసీఆర్ ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాల్లో మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా కొనసాగారు. 2001 నుంచి గులాబీ గుబాళింపు ఒకప్పుడు కాంగ్రెస్, తర్వాత టీడీపీలకు కంచుకోటగా ఉన్న సిద్దిపేట నియోజకవర్గం నేడు గులాబీ పార్టీకి కంచుకోట అయ్యింది. తెలంగాణ మలి విడత ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ టీడీపీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పేరిట గులాబీ జెండా చేపట్టారు. నాటి నుంచి నేటి వరకు రెండు దశాబ్దాల కాలం పైగా సిద్దిపేట గులాబీ పార్టీకి అడ్డాగా మారింది. -
100 సీట్లతో బీఆర్ఎస్ ప్రభంజనం
దుబ్బాక టౌన్/రామాయంపేట: ‘తెలంగాణలో జాకీలు పెట్టి లేపినా బీజేపీ లేవదు.. కాంగ్రెస్ గెలిచేది లేదు సచ్చేది లేదు’అని ఆరి్ధక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి విగ్రహావిష్కరణ, ఐఓసీ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అలాగే.. మెదక్ జిల్లా రామాయంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. ఈసారి 100కు పైగా సీట్లతో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తుందని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మోదీ, అమిత్ షాలే కాదు ఎవరొచ్చినా బీఆర్ఎస్కు ప్రజలు అండగా ఉంటారన్నారు. కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో.. ఆ పారీ్టలో రేవంత్‌రెడ్డి పాత్ర ఏమిటో అందరికీ తెలిసిందేనన్నారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు దుబ్బాకకు నయాపైసా నిధులు తీసుకురాలేదని, బీజేపీ గెలిస్తే ఏమవుతుందో ఇట్టే తెలుస్తుందని విమర్శించారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికి రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మెదక్‌లో జనబలం.. ధనబలానికి మధ్య పోటీ మెదక్‌లో జనబలం.. ధనబలం, న్యాయం.. అన్యాయం మధ్య పోటీ జరగబోతోందని మంత్రి హరీశ్‌రావు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి రోహిత్నుద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో డబ్బుల సంచులతో కొందరు బయలుదేరారని, అలాంటివాళ్లు కావాలా.. ఎల్లవేళలా మీ కష్టాల్లో పాలుపంచుకునే వాళ్లు కావాలా? అని ప్రజలే ఆలోచించుకోవాలని కోరారు. -
హ్యాట్రిక్ ‘వందన కథ చెపుతుందిదే..బేటీ ఖేల్నేదో!
మూడు నెలల క్రితం హాకీ ప్లేయర్ వందనా కటారియా తండ్రి మరణించాడు. చివరి చూపులకు నోచుకోలేని దూరంలో ఒలింపిక్స్ ట్రయినింగ్లో ఉంది వందన. ‘అన్నీ వదిలేసి నాన్న కోసం ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తా’ అని ఏడ్చింది వందన. కాని దేశం కోసం ఆగిపోయింది. ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. అయితే ‘తక్కువ కులం’ అమ్మాయి ఇంత ఎదగడం ఇష్టం లేని ‘అగ్రవర్ణ కుర్రాళ్లు’ ఆమె ఇంటి ముందు హంగామా సృష్టించారు. కాని విజేత ఎప్పుడూ విజేతే. దేశమే ఆమె కులం. అందుకే నేడు ఆమెను ఉత్తరాఖండ్ ప్రభుత్వం ‘బేటీ బచావో’ కాంపెయిన్‌కి అంబాసిడర్‌ని చేసింది. కొందరు పూలదండలు పొందుతారు. మరి కొందరు రాళ్లనూ పూలు చేసుకుంటారు. ఉత్తరాఖండ్ సి.ఎం. పుష్కర్ సింగ్ ధమి ఆదివారం (ఆగస్టు 8) వందనా కటారియాను తమ రాష్ట్ర ‘బేటీ బచావో’ కాంపెయిన్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్టు ప్రకటన చేశారు. వందనా కటారియా హరిద్వార్ జిల్లాలోని రోష్నాబాద్‌లో పుట్టి పెరిగింది. భారతీయ మహిళా హాకీలో కీలకమైన ఫార్వర్డ్ ప్లేయర్. టోక్యో ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ చేసి, అలాంటి రికార్డు సాధించిన తొలి మహిళా ప్లేయర్‌గా ఆమె చేసిన అద్భుత ప్రయాణం ఈ ఊరి నుంచే మొదలైంది. నిజానికి వందనను ‘బేటీ బచావో’ కాంపెయిన్తోపాటు ‘బేటీ ఖేల్నేదో’ (అమ్మాయిలను ఆడనివ్వండి) క్యాంపెయిన్‌కి కూడా అంబాసిడర్ ని చేయాలి. ఎందుకంటే కుటుంబం, ఊరు కూడా ఆమె ఆటకు అభ్యంతరాలు చెప్పాయి. చెట్ల కొమ్మలతో బి.హెచ్.ఇ.ఎల్లో టెక్నిషియన్‌గా పని చేసే నహర్ సింగ్ తొమ్మిది మంది సంతానంలో ఒకమ్మాయి వందన. ఆమె అక్క, చెల్లి.. ముగ్గురూ కలిసి చెట్ల కొమ్మలతో హాకీ ఆడేవారు. అక్క, చెల్లి జిల్లాస్థాయిలోనే ఉండిపోతే వందనా ఒలింపిక్స్ దాకా ఎదిగింది. కాని వీళ్లు ముగ్గురూ క్రీడల్లోకి వెళతామంటే వాళ్ల నానమ్మ ఒప్పుకోలేదు. అన్నయ్యలు కూడా ఒప్పుకోలేదు. మిగిలిన చెల్లెళ్లు ఆటలో ఆగిపోయినా వందనా మీరట్ కు వెళ్లి అక్కడి స్పోర్ట్స్ స్కూల్‌కు జాయిన్ అవుదామని నిశ్చయించుకున్నప్పుడు అన్నయ్యలు ఎక్కడ చదివిస్తాం అని పెదవి విరిచారు. పైగా ఊరి వాళ్లు ఎందుకు ఆడపిల్లలకు ఆటలు అని ఎప్పుడూ వందన తండ్రికి సుద్దులు చెప్పేవారే. కాని తండ్రి ఆమె ప్రతిభను గౌరవించాడు. సపోర్ట్ చేశాడు. నువ్వు ఒకరోజు దేశానికి పేరు తేవాలి... మన ఊరికి పేరు తేవాలి అనేవాడు. దురదృష్టవశాత్తు మూడు నెలల క్రితమే ఆయన చనిపోయాడు. అప్పుడు వందన ట్రయినింగ్ క్యాంప్‌లో ఉంది. రావడం సులువు కాదు. రాకుండా ఉండలేదు. ‘నాన్న కోసం వచ్చేస్తాను అన్నయ్యా... ఆయన్ను చివరి చూపు చూడాలని ఉంది’ అని ఏడ్చింది వందన. ‘వద్దమ్మా... ఇక్కడి పనులు మేము చూసుకుంటాం. నాన్నకు నువ్వు మెడల్ తీసుకురావడమే అసలైన నివాళి’ అని అన్నయ్య చెప్పాడు. ఆమె ఆగిపోయింది. ఒలింపిక్స్‌లో ఆడింది. ఒకే మ్యాచ్‌లో మూడు గోల్స్ కొట్టింది. అది ఆమె ఘనత. ఎదగకూడదా? పాలేరు కొడుకు పాలేరు కావాలి... పని మనిషి కూతురు పని మనిషి కావాలి అనే భావజాలం మన దేశంలో కొందరిలో ఉంది. ఒక కులం వాళ్లు ఇంతలోనే ఉండాలి ఒక కులం వాళ్లు రాజ్యాలు ఏలాలి అనుకునే సంకుచిత మనస్తత్వం ఉందనేది వాస్తవం. వందన సొంత ఊరు రోష్నాబాద్‌లో ఉంది. చిన్న గల్లీలో ఉంటుంది వందన ఇల్లు. వందన ఎదగడం, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడటం, పేరు రావడం ఆ ఊరిలోని అగ్రవర్ణాలకు చెందిన కొందరు కుర్రాళ్లకు నచ్చలేదు. వందన సోదరుడు ‘మమ్మల్ని చాలా రోజులుగా ఇబ్బంది పెడుతున్నారు. మా ఇంట్లో దొంగతనాలు చేస్తున్నారు. వాళ్ల బాధ పడలేక సిసి కెమెరాలు బిగించాం’ అన్నాడు. అవమానించాలని చూసిన రోజు భారత మహిళా హాకీ జట్టు ఒలింపిక్స్ సెమి ఫైనల్స్‌కు వెళ్లి దేశమంతా గొప్ప ప్రశంసలు పొందింది. అర్జెంటీనాతో మేచ్ గెలిస్తే ఫైనల్స్‌లోకి వెళ్లేది. నిజానికి వందనా హాకీ స్టార్ అయ్యాక ఊళ్లో ఎంతో మార్పు వచ్చింది. చాలా మంది తల్లిదండ్రులు తమ కుమార్తెలను క్రీడల్లో ప్రోత్సహిస్తున్నారు. అగ్రవర్ణాల వారు కూడా వందనను ఎంతో మెచ్చుకున్నారు. ఊళ్లో వందన కుటుంబానికి ఎంతో గౌరవం కూడా పెరిగింది. కాని అదే సమయంలో కొందరు కుర్రాళ్లు మాత్రం భరించలేకపోయారు. అర్జెంటీనాతో మ్యాచ్ ఓడిన రోజు మ్యాచ్ అయిన వెంటనే వారు వందన ఇంటి ముందుకు వచ్చి టపాకాయలు కాల్చారు. ‘ఇలాంటి వాళ్లు (తక్కువ వర్ణాల వాళ్లు) టీమ్‌లో ఉండటం వల్లే ఇండియా ఓడిపోయింది’ అనే అర్థంలో కామెంట్లు చేశారు. చాలా అవమానించే ప్రయత్నం చేశారు. వందన కుటుంబం ఆ దాడికి దిగ్భ్రాంతి చెందింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేశమంతా దీనిపై నిరసనలు జరిగాయి. ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రభుత్వమే అడ్డుగా నిలబడి.. దేశం కోసం ఆడిన వందన ఇలాంటి దాడి ఎదుర్కొనడం ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా సహించలేకపోయింది. వెంటనే ఆ రాష్ట్ర క్రీడల మంత్రి రంగంలో దిగి వందన కుటుంబానికి ధైర్యం చెప్పారు. మరోవైపు ముఖ్యమంత్రి ఆమెను తమ మహిళా, శిశు సంక్షేమ శాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారు. తమ రాష్ట్రానికి చెందిన గొప్ప క్రీడాకారిణిగా ఆమెను గౌరవిస్తున్నామని తెలిపారు. మన దేశంలో అమ్మాయిలు క్రీడల్లో రాణించాలంటే అదీ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి నుంచి రాణించాలనంటే ముందు ‘అమ్మాయి’ అనే అడ్డంకిని దాటాలి, తర్వాత ‘వనరులు’ అనే అడ్డంకిని దాటాలి, తర్వాత వెనుకబడిన వర్గాల నుంచి అయినట్టయితే ‘సామాజిక వివక్ష’నూ దాటాలి. ఇన్ని అడ్డంకులను దాటి, దాటుతూ కూడా వందన సమున్నతంగా నిలబడింది. వందన ఉదంతం ఇలాంటి నేపథ్యం ఉన్నవాళ్లకు క్రీడల్లో ఎన్ని అడ్డంకులు ఉంటాయో తెలియజేస్తోంది. ఇలాంటి నేపథ్యం ఉన్నా ఈ దేశంలో విజయం సాధించేందుకు సకల అవకాశాలు ఉన్నాయని కూడా తెలియచేస్తోంది. మనం చూడాల్సింది ఈ రెండో కోణాన్నే. వందనా కటారియా -
భారత్ హ్యాట్రిక్
మస్కట్ (ఒమన్): ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ తమ విజయాల పరంపర కొనసాగిస్తోంది. ఆదివారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో భారత్ 9–0తో జపాన్ను ఓడించి వరుసగా మూడో గెలుపుతో హ్యాట్రిక్ నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో ఒమన్‌పై 11–0తో... రెండో మ్యాచ్‌లో పాక్‌పై 4–1తో నెగ్గిన మన్‌ప్రీత్ సింగ్ బృందం మూడో మ్యాచ్‌లోనూ తమ జోరును ప్రదర్శించింది. ప్రతి క్వార్టర్లో గోల్ చేసి జపాన్ను హడలెత్తించింది. భారత్ తరఫున మన్దీప్ సింగ్ (4, 49, 57వ నిమిషాల్లో) మూడు గోల్స్‌తో హ్యాట్రిక్ నమోదు చేయగా... హర్మన్‌ప్రీత్ సింగ్ (17, 21వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించాడు. గుర్జంత్ సింగ్ (8వ నిమిషంలో), ఆకాశ్‌దీప్ సింగ్ (36వ నిమిషంలో), సుమీత్ (42వ నిమిషంలో), లలిత్ ఉపాధ్యాయ్ (45వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఈ టోర్నీలో భారత్ తరఫున హ్యాట్రిక్ చేసిన రెండో ప్లేయర్‌గా మన్దీప్ సింగ్ నిలిచాడు. ఒమన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో దిల్‌ప్రీత్ సింగ్ ఈ ఘనత సాధించాడు. తాజా విజయంతో భారత్ 9 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. అంతర్జాతీయ స్థాయిలో జపాన్‌తో ఇప్పటివరకు 22 మ్యాచ్‌లు ఆడిన భారత్ 18 మ్యాచ్‌ల్లో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని... ఒక మ్యాచ్‌లో ఓడింది. మంగళవారం జరిగే నాలుగో లీగ్ మ్యాచ్‌లో మలేసియాతో భారత్ తలపడుతుంది. ఇటీవలే జకార్తా ఆసియా క్రీడల సెమీఫైనల్లో మలేసియా చేతిలో అనూహ్యంగా ఎదురైన ఓటమికి భారత్ భారీ విజయంతో ప్రతీకారం తీర్చుకుంటుందో లేదో వేచి చూడాలి. -
యువ భారత్ ‘హ్యాట్రిక్’
వరుసగా మూడో విజయం రాణించిన శామ్సన్, కుల్దీప్ అండర్ 19 ప్రపంచకప్ షార్జా: ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో తడబడినా అండర్-19 ప్రపంచ కప్ ప్రధాన టోర్నమెంట్లో మాత్రం భారత యువ జట్టు అదరగొడుతోంది. వరుసగా మూడో విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేయడంతోపాటు గ్రూప్ ‘ఎ’లో టాపర్‌గా నిలిచింది. పసికూన పపువా న్యూ గినియాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 245 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ సంజూ శామ్సన్ (48 బంతుల్లో 85, 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుతమైన బ్యాటింగ్‌తో 50 ఓవర్లలో 6 వికెట్లకు 301 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూ గినియా జట్టు 28.2 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌటైంది. బ్యాట్‌తో చెలరేగిన శామ్సన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఈనెల 22న దుబాయ్‌లో జరిగే తొలి క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. నిదానంగా మొదలుపెట్టి... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిదానంగా ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఓపెనర్లు అంకుశ్ బైన్స్(83 బంతుల్లో 59; 5 ఫోర్లు, సిక్స్), అఖిల్ హర్వాద్కర్ (40 బంతుల్లో 37; 3 ఫోర్లు, సిక్స్) గినియా బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడారు. జట్టు స్కోరు 58 పరుగుల దగ్గర హర్వాద్కర్ అవుటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ విజయ్ జోల్ (68 బంతుల్లో 35) నెమ్మదిగా ఆడాడు. బైన్స్‌తో కలిసి 74 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. అయితే వీళ్లిద్దరు కొద్ది పరుగుల తేడాతో అవుటైన తర్వాత మ్యాచ్ స్వరూపం మారిపోయింది. ఈ దశలో శామ్సన్, శ్రేయాస్ అయ్యర్ (38 బంతుల్లో 36; 3 ఫోర్లు) గినియా బౌలర్లను ఆడుకున్నారు. గినియా జట్టు బౌలర్ గెబాయ్ వేసిన ఇన్నింగ్స్ 40వ ఓవర్లో శామ్సన్ వరుసగా 4, 4, 4, 4, 6, 1 స్కోరు చేశాడు. ఇద్దరూ కలిసి జట్టు స్కోరును 250 దాటించిన తర్వాత అయ్యర్ అవుటయ్యాడు. ఆ తర్వాత శామ్సన్ కూడా వెనుదిరిగాడు. చివర్లో సర్ఫరాజ్ ఖాన్ (19 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) జోరుగా బ్యాటింగ్ చేయడంతో భారత్ స్కోరు 300 దాటింది. టపటపా... భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూ గినియాను భారత బౌలర్లు హడలెత్తించారు. రెండో ఓవర్ నుంచే గినియా వికెట్ల పతనం మొదలైంది. కుల్దీప్ యాదవ్ (4/10), మోను కుమార్ (3/13), దీపక్ హుడా (2/5) దెబ్బకు గినియా ఇన్నింగ్స్ 56 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా 74 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై; పాకిస్థాన్ 146 పరుగుల తేడాతో స్కాట్లాండ్పై; అఫ్ఘానిస్థాన్ 4 వికెట్ల తేడాతో నమీబియాపై గెలిచాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో పాకిస్థాన్‌తో శ్రీలంక (22న); అఫ్ఘానిస్థాన్‌తో దక్షిణాఫ్రికా (23న); ఆస్ట్రేలియాతో వెస్టిండీస్ (23న) తలపడతాయి.