లోక్‌సభ ఎన్నికల్లో 383 స్థానాలు
టైమ్స్ నౌ సర్వే వెల్లడి
బీజేపీకి ఒంటరిగానే 344, ఇండియా కూటమికి 118
కాంగ్రెస్‌కు కేవలం 37 స్థానాలు
తెలంగాణలో కాంగ్రెస్‌కు 9, బీజేపీకి 5, బీఆర్‌ఎస్‌కు 2
వైఎస్సార్‌సీపీకి 22 స్థానాలు
డీఎంకేకు 22, టీఎంసీకి 19
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని టైమ్స్ నౌ–ఈటీజీ సర్వే పేర్కొంది. ఎన్డీఏకు 383 స్థానాలొస్తాయని, విపక్ష ఇండియా కూటమి 118 సీట్లకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. అధికార బీజేపీ ఏకంగా 344 సీట్లు సాధిస్తుందని, కాంగ్రెస్ తన చరిత్రలోనే అత్యల్పంగా కేవలం 37 లోక్‌సభ స్థానాలతో కుదేలవనుందని పేర్కొంది. ఎన్డీఏ కూటమి ఏకంగా 49 శాతం ఓట్లు ఒడిసిపడుతుందని, ఇండియా కూటమికి 34 శాతం వస్తాయని తేల్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో 25 స్థానాలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 22 సీట్లు సాధించి లోక్‌సభలో మూడో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని వెల్లడించింది. తమిళనాట డీఎంకేకు కూడా 22 స్థానాలొస్తాయని, పశి్చమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు 19, ఒడిశాలో బిజూ జనతాదళ్‌కు 11 సీట్లొస్తాయని తెలిపింది. కేజ్రీవాల్ అరెస్టుతో సంక్షోభంలో పడ్డట్టు కని్పస్తున్న ఆప్ 6 స్థానాలతో మెరుగైన ప్రదర్శన చేస్తుందని సర్వే పేర్కొనడం విశేషం.
ఇక అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న తెలంగాణలో 17 స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 9 దక్కుతాయని, బీజేపీ 5, మజ్లిస్ ఒక స్థానం గెలుచుకుంటాయని వివరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమికి తోడు నేతల వలస తదితరాలతో కుంగిపోయిన బీఆర్‌ఎస్ 2 స్థానాలకు పరిమితబమవుతుందని తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 353 స్థానాలు రావడం తెలిసిందే. అందులో ఒక్క బీజేపీయే ఏకంగా 303 స్థానాలు సాధించింది. కాంగ్రెస్ కేవలం 52 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. యూపీఏకు 91, ఇతరులకు 98 సీట్లొచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment