hatrick record
-
సీఎంగా హ్యాట్రిక్ కొడుతున్న బ్యాక్ బెంచర్
ముంబై: ఏబీవీపీ కార్యకర్తగా బీజేపీలో ప్రస్థానం ఆరంభించిన దేవేంద్ర ఫడ్నవీస్ పార్టీ పట్ల విధేయత, అంకితభావం, పట్టుదలతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఆయన 1970 జూలై 22న మహారాష్ట్రలోని నాగపూర్‌లో జన్మించారు. తండ్రి దివంగత గంగాధర్ ఫడ్నవీస్ జనసంఘ్, బీజేపీలో కీలక నాయకుడిగా వ్యవహరించారు. దేవేంద్ర 1989లో ఏబీవీపీలో చేరారు. 22 ఏళ్ల వయసులో నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్‌గా గెలిచారు. 1997లో 27 ఏళ్ల పిన్న వయసులోనే నాగపూర్ మేయర్‌గా ఎన్నికై రికార్డు సృష్టించారు. తొలిసారిగా 1999 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో నాగపూర్ సౌత్‌వెస్ట్ స్థానం నుంచి ఎన్నికయ్యారు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా, ఒకసారి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫడ్నవీస్‌పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం విశేషం. మహారాష్ట్రలో మనోహర్ జోషీ తర్వాత రెండో బ్రాహ్మణ ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతికి ఎదురుదెబ్బ తగిలినప్పటికీ ఫడ్నవీస్ నిరుత్సాహపడలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమిని విజయపథంలో నడిపించారు. సున్నిత మనస్కుడు ఫడ్నవీస్ పాఠశాలలో చదువుకునేటప్పుడు బ్యాక్ బెంచర్ అని ఆయన గురువు సావిత్రి సుబ్రమణియం చెప్పారు. ఫడ్నవీస్ ఎనిమిది నుంచి పదో తరగతి దాకా సరస్వతి విద్యాలయలో చదువుకున్నారు. తన విద్యార్థి అయిన ఫడ్నవీస్ చిన్నప్పుడు సున్నిత మనస్కుడిగా ఉండేవాడని, అందరినీ చక్కగా గౌరవించేవాడని, ఇతరులకు చేతనైన సహాయం చేసేవాడని, చాలా మర్యాదస్తుడని సావిత్రి సుబ్రమణియం తెలిపారు. చదువులో సగటు విద్యారి్థగానే ఉండేవాడని అన్నారు. అసాధారణమైన విద్యార్థి కానప్పటికీ బాగానే చదివేవాడనని వెల్లడించారు. బాగా పొడగరి కావడంతో తరగతిలో చివర వరుసలో కూర్చొనేవాడని పేర్కొన్నారు. -
Lok Sabha Election 2024: మోదీ, షా కంచుకోటలో... కాంగ్రెస్‌కు పెనుసవాల్
దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో శుక్రవారం మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. కీలకమైన రాష్ట్రం గుజరాత్లో మొత్తం స్థానాలకూ ఇదే విడతలో పోలింగ్ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్లో గత రెండు ఎన్నికల్లోనూ బీజేపీ క్లీన్స్వీప్చేసింది. అదే ఊపులో ఈసారి హ్యాట్రిక్‌పై కన్నేసింది. లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో అంతకంతకూ చిక్కిపోతున్న కాంగ్రెస్ ఈసారి ఆప్‌తో కలిసి ‘ఇండియా’ కూటమి కింద బీజేపీని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని కీలక లోక్‌సభ స్థానాలపై ఫోకస్... వదోదర... కొత్త ముఖాలు గుజరాత్లో మూడో అతి పెద్ద నగరమిది. ఇక్కడ వరుసగా రెండు ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలుపొందిన రంజన్‌బెన్ ధనంజయ్ భట్‌ను బీజేపీ అనూహ్యంగా పక్కనబెట్టింది. డాక్టర్ హేమంగ్ జోషీని పార్టీ బరిలో నిలిపింది. కాంగ్రెస్ తరఫున పధియార్ జస్పాల్సింగ్ మహేంద్రసింగ్ పోటీలో ఉన్నారు. వీరిద్దరూ కొత్తవారే కావడం విశేషం. ఈ సీటు 1998 నుంచి బీజేపీ గుప్పిట్లోనే ఉంది. మోదీ ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదంతో మరోసారి నెగ్గుతామని కమలనాథులు ధీమాగా ఉన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 7 సెగ్మెంట్లలో 6 బీజేపీ ఖాతాలోనే పడ్డాయి. మిగతా చోట స్వతంత్ర అభ్యర్థి నెగ్గారు. 2014లో మోదీ లోక్‌సభ అరంగేట్రం వారణాసి, వదోదరల నుంచే జరగడం తెలిసిందే. ఇక్కడ ఆయనకు ఏకంగా 5.7 లక్షల మెజారిటీ లభించింది. వారణాసి నుంచి ఎంపీగా కొనసాగి వదోదరను వదులుకున్నారు. రాజ్‌కోట్... రూపాలాకు రాజ్‌పుత్ గండం గుజరాత్లో ఎదురే లేని కమలనాథులకు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా కొత్త చిక్కులు తెచ్చిపెట్టారు. సిట్టింగ్ ఎంపీ మోహన్ కుందరియాను కాదని బీజేపీ ఆయనకు టికెటిచి్చంది. కానీ ‘మహారాజులు బ్రిటి‹Ùవారికి, విదేశీ పాలకులకు లొంగిపోయారని, వారితో విందువినోదాల్లో మునగడమే గాక వాళ్లకు తమ కుమార్తెలనిచ్చి పెళ్లిళ్లు చేశా’రని రాజ్‌పుత్‌లపై రూపాలా చేసిన వ్యాఖ్యలతో ఆ సామాజికవర్గం భగ్గుమంది. ఆయన్ను రాజ్‌కోట్ బరి నుంచి తప్పించాలని, లేదంటే ఓడించి తీరుతామని బీజేపీకి వారు అలి్టమేటమిచ్చారు! ఆందోళనలు కూడా చేశారు. రూపాలా పలుమార్లు క్షమాపణలు చెప్పినా వివాదం సద్దుమణగలేదు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పరేశ్‌బాయ్ ధనాని పోటీలో ఉన్నారు. రాజ్‌పుత్‌లు, పటీదార్లు, మధ్య ఎప్పటినుంచో వైరముంది. పటీదార్ సామాజికవర్గానికి చెందిన రూపాలా దానికిలా ఆజ్యం పోయడం తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది.భావనగర్.. బరిలో ఆప్ ఈ స్థానంపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్నేసింది. కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా భావనగర్, బరుచ్‌లను ఆ పార్టీ దక్కించుకుంది. ఇక్కడ గట్టి పట్టున్న బీజేపీని ఢీకొట్టేందుకు ఉమేశ్‌బాయ్ నరన్‌బాయ్ మక్వానాను పోటీకి దించింది. బీజేపీ కూడా సిట్టింగ్ ఎంపీ భారతీబెన్ ధీరూబాయ్ శియాల్‌ను పక్కనబెట్టి నింబూబెన్ బంభానియాకు టికెటిచి్చంది. 1991 నుంచీ ఇక్కడ కాషాయ జెండానే ఎగురుతోంది. గత ఎన్నికల్లో భారతీబెన్‌కు 4.29 లక్షల మెజారిటీ లభించింది. ఈ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు బీజేపీ చేతిలోనే ఉన్నాయి. మిగతా స్థానం ఆప్‌ది కావడం విశేషం. గత అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసి 5 సీట్లు నెగ్గిన ఆప్ లోక్‌సభ బరిలో బీజేపీకి సవాలు విసురుతోంది. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్టు చేశారంటూ ప్రచారంతో హోరెత్తిస్తోంది. కేజ్రీవాల్ భార్య సునీత కూడా ప్రచారానికి దిగారు. పోర్బందర్.. మన్సుఖ్ అరంగేట్రం బీజేపీకి గట్టి పట్టున్న ఈ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తొలిసారి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. 2012 నుంచీ రాజ్యసభకు ఎన్నికవుతున్న ఆయన పోటీతో పోర్‌బందర్‌పై ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రమేశ్‌బాయ్ ధడక్ చేతిలో 2.3 లక్షల ఓట్ల తేడాతో ఓడిన లలిత్ వసోయాకే కాంగ్రెస్ మళ్లీ టికెటిచి్చంది. ఈ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఆరు బీజేపీ చేతిలోనే ఉన్నాయి. కుతియానాలో మాత్రం సమాజ్‌వాదీ పార్టీ గెలిచింది. బనస్కాంత.. గెనీబెన్ సవాల్ ఉత్తర గుజరాత్‌లోని ఈ స్థానంలో బీజేపీకి గట్టి పోటీ ఎదురవుతోంది. ‘వావ్’ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గెనీబెన్ ఠాకోర్‌ను కాంగ్రెస్ బరిలోకి దించడమే అందుకు కారణం. దాంతో బీజేపీ కూడా సిట్టింగ్ ఎంపీ పర్వత్‌బాయ్ పటేల్‌ను కాదని ఇంజనీరింగ్ ప్రొఫెసర్ రేఖా బెన్ చౌదరి రూపంలో మహిళకే టికెటివ్వాల్సి వచ్చింది. ఆమెకు రాజకీయ అనుభవం లేదు. తొలిసారి ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. గుజరాత్లో ఇరు పారీ్టల నుంచీ మహిళలే రంగంలో ఉన్న ఏకైక సీటు కావడంతో బనస్కాంత అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దీని పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాలుగు చోట్ల గెలిచింది. అయితే గెనీబెన్ కమలం హవాలో కూడా విజయం సాధించి ‘వావ్’ అనిపించారు. రేఖాబెన్‌కు రాజకీయ అనుభవం లేకున్నా నియోజకవర్గంతో సత్సబంధాలున్నాయి. బనస్ డెయిరీ ఈ నియోజకవర్గంలోని 4.5 లక్షల మంది రైతుల నుంచి రోజూ పాలు సేకరిస్తుంది. దీని వ్యవస్థాపకుడు గల్బాబాయ్ చౌదరి మనుమరాలు రేఖ. ఆమె భర్త హితేశ్ చౌదరి బీజేపీ నాయకుడు. అయినా గెనీబెన్ వంటి బలమైన ప్రత్యరి్థపై రేఖ వంటి కొత్త ముఖాన్ని నిలబెట్టడంపై బీజేపీ కార్యకర్తల్లోనూ అసంతృప్తి నెలకొందని పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి!గాంధీనగర్.. అద్వానీ కోటలో షా పాగా! ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటైన ఈ నియోజకవర్గం 1989 నుంచి కమలనాథుల గుప్పిట్లోనే ఉంది. శంకర్ సింఘ్ వాఘేలా, అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్కే అద్వానీ వంటి హేమాహేమీలకు నెలవైన ఈ స్థానంలో కేంద్ర హోం మంత్రి, బీజేపీ దిగ్గజం అమిత్ షా పాగా వేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 5,57,014 ఓట్ల మెజారిటీతో విజయ ఢంకా మోగించారు. ఈసారి మెజారిటీ మరింత పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన్ను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి! చివరకు 62 ఏళ్ల సోనల్ పటేల్‌ను రంగంలోకి దించింది. ఆమె ఏఐసీసీ సెక్రటరీగా. ముంబై, పశి్చమ మహారాష్ట్ర ఇన్చార్జిగా ఉన్నారు. గిఫ్ట్ సిటీ అభివృద్ధి, గాంధీ సబర్మతి ఆశ్రమానికి మెరుగులు, అయోధ్య రామ మందిరం, మోదీ ఫ్యాక్టర్ తదితరాలతో తనకు తిరుగులేదని షా ధీమాతో ఉన్నారు. గాం«దీనగర్ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ స్థానాలూ బీజేపీవే! సీఎం భూపేంద్ర పటేల్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఘట్లోడియా కూడా వాటిలో ఒకటి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మోదీ విజయం జాతీయ బాధ్యత: నడ్డా
డెహ్రాడూన్: నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా నెగ్గడానికి సహకరించడం ప్రజల జాతీయ బాధ్యత అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలంటే మోదీని మూడోసారి గెలిపించుకోవాలని సూచించారు. నడ్గా గురువారం ఉత్తరాఖండ్‌లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. ఉత్తరాఖండ్‌లోని మొత్తం ఐదు లోక్‌సభ స్థానాలకు బీజేపీకి కట్టబెట్టాలని కోరారు. మోదీని మళ్లీ గెలిపిస్తే దేశాన్ని మరింత అభివృద్ధి చేస్తారని పేర్కొన్నారు. దేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఓటు బ్యాంకు రాజకీయాలు, కుల రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి రాజకీయాలకు శ్రీకారం చుట్టిన ఘనత నరేంద్ర మోదీదే అని నడ్డా ప్రశంసించారు. -
Indian general election 2024: కాషాయ ప్ర‘దక్షిణం’..!
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజ యాన్ని నమోదు చేయాలన్న గట్టిపట్టుదలతో ఉన్న బీజేపీ తన దృష్టినంతా దక్షిణా ది రాష్ట్రాలపై కేంద్రీకరించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. కొరకరాని కొయ్యలా ఉన్న దక్షిణాది రాష్ట్రా లపై పట్టు సాధిస్తే కేంద్రంలో వరుస గా మూడోసారి అధికారం దక్కించుకోవడం ఆ పార్టీకి నల్లేరుపై నడకే. ఉత్తరాదితో పోలిస్తే ముందునుంచీ సవాలుగానే ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ పట్టుదలగా ఉంది... ఆరునూరైనా 60 దాటాల్సిందే...! కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పుదుచ్చేరిలలో కలిపి మొత్తం 130 లోక్‌సభ స్థానాలున్నాయి. 2024 సాధారణ ఎన్నికల్లో వాటిలో 80 సీట్ల సాధనే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే వాటిలో కర్ణాటక మినహా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కమలదళం పోటీ పడలేకపోతోంది. గత ఎన్నికల్లో కాషాయపార్టీ ఈ 130 సీట్లలో కేవలం 29 చోట్ల గెలిచింది. కర్ణాటకలో 28 సీట్లకు ఏకంగా 25 నెగ్గగా తెలంగాణలో 17 స్థానాలకుగాను నాలుగు చోట్ల గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో 25, తమిళనాడులో 39, కేరళలో 20 స్థానాలకు గాను ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేక చతికిలపడింది. ఈసారి మాత్రం దక్షిణాదిన ఎలాగైనా కనీసం 60 సీట్లలో గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా జరిగిన బీజేపీ పదాధికారుల భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఇదే విషయాన్ని నొక్కిచెప్పారు. బీజేపీ ఎత్తుగడలను ఇటీవలి కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దెబ్బ తీశాయనే చెప్పాలి. కర్ణాటక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌కు 42.88 శాతం ఓట్లు రాగా, బీజేపీ 36 శాతం ఓట్లకు పరిమితం కావడమే గాక రాష్ట్రంలో అధికారం కూడా కోల్పోయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో 13 శాతం ఓట్లు సాధించిన జేడీ(ఎస్)తో కలిసి లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. కాంగ్రెస్‌ను ఎలాగైనా సింగిల్ డిజిట్‌కే పరిమితం చేసేలా వ్యూహాలు రచిస్తోంది. అయితే సీట్ల పంపకాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. జేడీ(ఎస్) నేత కుమారస్వామి ఇటీవలే ప్రధాని మోదీతో ఈ అంశమై చర్చలు జరిపారు. ఇక 2019లో నాలుగు లోక్‌సభ సీట్లు సాధించిన తెలంగాణలో ఈసారి కనీసం రెట్టింపు చోట్ల గెలవాలని బీజేపీ యోచిస్తోంది. తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7 శాతం ఓట్లు సాధించిన బీజేపీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో దాన్ని రెట్టింపునకు పెంచుకుని 14 శాతం ఓట్లు రాబట్టింది. ఈ లెక్కన ఎంపీ సీట్లను కూడా డబుల్ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదనే ఆశపడుతోంది. పదాధికారుల భేటీలో మోదీ, షా ద్వయం ఇదే విషయాన్ని తెలంగాణ బీజేపీ నేతలకు నూరిపోశారు. కేరళలో... కేరళలో వామపక్ష సంకీర్ణ కూటమితో తలపడటం బీజేపీకి పెద్ద సవాల్‌గా మారింది. వరుసగా 2104, 2019 ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన బీజేపీ ఈసారి కనీసం ఎనిమిది సీట్లు సాధించాలని చూస్తోంది. గత ఎన్నికల్లో 12 శాతం ఓట్లను రాబట్టుకున్న పార్టీ ఈసారి 25 శాతం ఓట్లు లక్ష్యంగా కార్యాచరణను రూపొందిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో తన పట్టు పెంచుకునేందుకు బీజేపీ ఎక్కువగా పొత్తులపైనే ఆధారపడుతోంది. జనసేనతో పొత్తు కొనసాగినా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి 24 సీట్ల దాకా ఖాయమన్న వస్తాయన్న సర్వే సంస్థల వెల్లడి నేపథ్యంలో బీజేపీ ఇక్కడ ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. ఉత్తరాది నేతలకు బాధ్యతలు దక్షిణాది రాష్ట్రాల్లో పాగా దిశగా వ్యూహ రచనకు బీజేపీ ఇప్పటికే టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, ఉపాధ్యక్షులు బైజయంత్ పాండా, దిలీప్ ఘోష్, లాల్‌సింగ్ ఆర్య ఇందులో ఉన్నారు. రాష్ట్రాలవారీగా పార్టీ పరిస్థితులను అంచనా వేసి, తదనుగుణంగా గెలుపు వ్యూహాలను అధిష్టానం సిద్ధం చేసింది. వాటి అమలు బాధ్యతను గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కీలక నేతలకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. యూపీ నేతలు కేశవ్ ప్రసాద్ మౌర్య, సునీల్ బన్సల్, స్వతంత్ర దేవ్ సింగ్, గుజరాత్‌కు చెందిన పర్ణేశ్ మోదీ, విజయ్ రూపానీ సేవలను కూడా వినియోగించుకోనుంది. – సాక్షి, న్యూఢిల్లీ -
IPL2023: రైజర్స్ జోరుకు బ్రేక్....
వరుసగా రెండు విజయాలతో జోరు పెంచిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సొంతగడ్డపై అడ్డుకట్ట పడింది. కొంత పోరాటపటిమ కనబర్చినా చివరకు విజయం మాత్రం దక్కలేదు. అన్ని రంగాల్లో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ ‘హ్యాట్రిక్’ గెలుపుతో సత్తా చాటింది. కామెరాన్ గ్రీన్, తిలక్ వర్మ విజయంలో కీలకపాత్ర పోషించగా... ఒక్క బ్యాటర్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోవడంతో రైజర్స్ ఉప్పల్‌లో చతికిలపడింది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో సన్‌రైజర్స్ ఖాతాలో మరో ఓటమి చేరింది. మంగళవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 14 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కామెరాన్ గ్రీన్ (40 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా, ఇషాన్ కిషన్ (31 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్ వర్మ (17 బంతుల్లో 37; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించారు. అనంతరం హైదరాబాద్ 19.5 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (41 బంతుల్లో 48; 4 ఫోర్లు,1 సిక్స్), హెన్రిచ్ క్లాసెన్ (16 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. సూర్యకుమార్ విఫలం... కెప్టెన్ రోహిత్ శర్మ (18 బంతుల్లో 28; 6 ఫోర్లు) ముంబై ఇన్నింగ్స్‌ను ధాటిగా మొదలు పెట్టాడు. సుందర్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అతను ఈ క్రమంలో ఐపీఎల్లో 6 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. నటరాజన్ ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టిన రోహిత్, అదే ఓవర్లో వెనుదిరిగాడు. పవర్‌ప్లేలో ముంబై 53 పరుగులు చేసింది. అనంతరం రైజర్స్ బౌలింగ్ కట్టుదిట్టంగా సాగడంతో ముంబై స్కోరు వేగం మందగించింది. జాన్సెన్ ఒకే ఓవర్లో కిషన్, సూర్యకుమార్ (7)లను అవుట్ చేసి దెబ్బ కొట్టాడు. ఈ రెండు క్యాచ్‌లను మార్క్రమ్ అద్భుతంగా అందుకున్నాడు. 14 ఓవర్లలో ముంబై 109 పరుగులు చేసింది. అయితే చివరి 6 ఓవర్లలో చెలరేగిన ఆ జట్టు 83 పరుగులు రాబట్టింది. నటరాజన్ వేసిన 18వ ఓవర్లో వరుస బంతుల్లో గ్రీన్ 4, 4, 4, 6 తో చెలరేగడం విశేషం. ఈ క్రమంలో 33 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. భువీ తన చివరి 2 ఓవర్లలో 14 పరుగులే ఇచ్చినా, ఇతర బౌలర్లు విఫలమయ్యారు. తిలక్ జోరు... సొంతగడ్డపై ప్రత్యర్థి జట్టు హైదరాబాద్‌పై తిలక్ వర్మ సత్తా చాటాడు. తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజ్‌లో ఉన్న 24 నిమిషాల్లో ఫటాఫట్ బ్యాటింగ్ ప్రదర్శించాడు. జాన్సెన్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన అతను... మర్కండే, భువీ బౌలింగ్‌లో ఒక్కో సిక్సర్ బాదాడు. భువీ బౌలింగ్‌లో మరో షాట్‌కు ప్రయత్నించి కవర్స్‌లో చిక్కడంతో అతని ఇన్నింగ్స్ ముగిసింది. సమష్టి వైఫల్యం... ఛేదనలో రైజర్స్‌కు సరైన ఆరంభం లభించలేదు. గత మ్యాచ్ హీరో బ్రూక్ (9), రాహుల్ త్రిపాఠి (7)లను బెహ్రన్‌డార్ఫ్ తన వరుస ఓవర్లో అవుట్ చేశాడు. మరో ఎండ్‌లో మయాంక్ మాత్రం కొన్ని చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. 6 ఓవర్లలో జట్టు స్కోరు 2 వికెట్లకు 42. మార్క్రమ్ (17 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోగా, అభిషేక్ (1) కూడా వెంటనే అవుటయ్యాడు. రైజర్స్ గెలుపు అవకాశాలు సన్నగిల్లుతున్న దశలో చావ్లా వేసిన 14వ ఓవర్ ఆశలు రేపింది. ఈ ఓవర్లో క్లాసెన్ వరుసగా 4, 6, 6, 4 బాదాడు. అయితే చివరి బంతికి అతను అవుట్ కావడంతో పరిస్థితి మళ్లీ మారిపోయింది. తర్వాతి ఓవర్లో మయాంక్ వెనుదిరిగాక జట్టు ఓటమి లాంఛనమే అయింది. అర్జున్ టెండూల్కర్ తన తొలి ఐపీఎల్ వికెట్‌తో హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగించగానే ముంబై సంబరాల్లో మునిగిపోయింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) మార్క్రమ్ (బి) నటరాజన్ 28; ఇషాన్ కిషన్ (సి) మార్క్రమ్ (బి) జాన్సెన్ 38; గ్రీన్ (నాటౌట్) 64; సూర్యకుమార్ (సి) మార్క్రమ్ (బి) జాన్సెన్ 7; తిలక్ (సి) మయాంక్ (బి) భువనేశ్వర్ 37; డేవిడ్ (రనౌట్) 16; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1–41, 2–87, 3–95, 4–151, 5–192. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–31–1, జాన్సెన్ 4–0–43–2, సుందర్ 4–0–33–0, నటరాజన్ 4–0–50–1, మర్కండే 4–0–35–0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: బ్రూక్ (సి) సూర్యకుమార్ (బి) బెహ్రన్‌డార్ఫ్ 9; మయాంక్ (సి) డేవిడ్ (బి) మెరిడిత్ 48; త్రిపాఠి (సి) ఇషాన్ కిషన్ (బి) బెహ్రన్‌డార్ఫ్ 7; మార్క్రమ్ (సి) షోకీన్ (బి) గ్రీన్ 22; అభిషేక్ (సి) డేవిడ్ (బి) చావ్లా 1; క్లాసెన్ (సి) డేవిడ్ (బి) చావ్లా 36; సమద్ (రనౌట్) 9; జాన్సెన్ (సి) డేవిడ్ (బి) మెరిడిత్ 13; సుందర్ (రనౌట్) 10; భువనేశ్వర్ (సి) రోహిత్ (బి) అర్జున్ 2; మర్కండే (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 178. వికెట్ల పతనం: 1–11, 2–25, 3–71, 4–72, 5–127, 6–132, 7–149, 8–165, 9–174, 10–178. బౌలింగ్: అర్జున్ టెండూల్కర్ 2.5–0–18–1, బెహ్రన్‌డార్ఫ్ 4–0–37–2, మెరిడిత్ 4–0–33–2, షోకీన్ 1–0–12–0, చావ్లా 4–0–43–2, గ్రీన్ 4–0–29–1. -
300కుపైగా సీట్లు మావే
దిబ్రూగఢ్: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 300కు పైగా సీట్లు సాధించి వరుసగా మూడోసారి అధికారంలోకి రాబోతున్నామని ధీమా వెలిబుచ్చారు. అస్సాంలోని దిబ్రూగఢ్‌లో అప్పర్ అస్సాం జోనల్ బీజేపీ కార్యాలయ నిర్మాణానికి అమిత్ షా మంగళవారం పునాదిరాయి వేశారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగించారు. అస్సాంలో 14 లోక్‌సభ స్థానాలు ఉండగా, వచ్చే ఎన్నికల్లో తాము 12 స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకప్పుడు కాంగ్రెస్ బలంగా ఉండేదని, ఇప్పుడు ఆ పార్టీ నామమాత్రంగా మారిపోయిందని అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదని, ఇటీవల ఈశాన్యంలో జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయిందని గుర్తుచేశారు. ఈశాన్యంలో తమకు అధికారం కట్టబెట్టిన తొలి రాష్ట్రం అస్సాం ప్రజలకు అమిత్ షా కృతజ్ఞతలు తెలియజేశారు. అస్సాంలో శాంతి సౌభాగ్యాలు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై దేశాన్ని అవమానించారని అమిత్ షా మండిపడ్డారు. ఇలాగే చేస్తే కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతోందని అన్నారు. ప్రధాని మోదీని కొందరు ఇష్టారాజ్యంగా దూషిస్తున్నా ప్రజల ఆశీస్సులు ఆయనకు లభిస్తున్నాయన్నారు. మోదీ బాగుండాలని ప్రజలంతా ప్రార్థిస్తున్నారని తెలిపారు. అస్సాం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. రాష్ట్రంలో 70 శాతం భూభాగం నుంచి వివాదాస్పద సైనిక దళాల (ప్రత్యేక అధికారాల) చట్టం–1958ను తొలగించామని పేర్కొన్నారు. అస్సాం అనగానే ఆందోళనలు, ఉగ్రవాదం గుర్తుకొచ్చేవని, ప్రస్తుతం శాంతి సౌభాగ్యాలు పరిఢవిల్లుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. -
హస్తిన హ్యాట్రిక్ విజేత
ఢిల్లీ పీఠాన్ని వరసగా మూడు సార్లు దక్కించుకున్న విజేత ఆమె. పదిహేనేళ్లపాటు ఢిల్లీని పరిపాలించి ఢిల్లీ రూపురేఖలను మార్చి నగరం స్థాయిని పెంచిన నాయకురాలు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల్ని భాగస్వామ్యుల్ని చేసే భాగిదాని వ్యవస్థను ప్రవేశపెట్టి మంచి పరిపాలనా దక్షురాలిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.పెద్ద భవంతులు, ఫ్లై ఓవర్లు, ఢిల్లీ మెట్రో ఆమె హయాంలోనే వచ్చాయి. 81 ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహం వయసుతో రాజకీయాలకు పని లేదని నిరూపిస్తూ ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఈశాన్య ఢిల్లీ నుంచి పోటీ పడుతూ కాంగ్రెస్ ప్రచారాన్ని ముందుండి నడిపించారు. బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ చేతిలో ఓటమి పాలైనప్పటికీ 81 ఏళ్ల వయసులో ఆమెలో ఉన్న ఉరిమే ఉత్సాహం కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపింది. పంజాబ్‌లోని కపుర్తలాలో 1938, మార్చి 31వ తేదీన జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీలో డాక్టరేట్ సాధించారు. ఆమె భర్త దివంగత వినోద్ దీక్షిత్ ఐఏఎస్ అధికారి. వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు సందీప్ దీక్షిత్ కాంగ్రెస్ సభ్యుడే. కుమార్తె లతికా సయ్యద్. ఆసక్తికరం...షీలా ప్రేమాయణం! ఢిల్లీ విశ్వద్యాలయంలో చరిత్ర చదివే సమయంలో ïషీలా కపూర్‌కు వినోద్ దీక్షిత్‌తో పరిచయమైంది. వినోద్ దీక్షిత్ కాంగ్రెస్ నేత ఉమా శంకర్ కొడుకు. వినోద్ చురుకైన వాడు, మంచి క్రికెటర్ అని ïషీలా తన ఆత్మకథలో రాశారు. ఇద్దరు మిత్రుల మధ్య ప్రేమ వ్యవహారంలో ఏర్పడిన వివాదంలో మధ్యవర్తిత్వం వహించిన షీలా, వినోద్ ఆతర్వాత దగ్గరయ్యారు. అయితే, తాను బ్రాహ్మణ కులస్తురాలు కాకపోవడంతో వినోద్ తల్లిదండ్రులు పెళ్లికి గట్టిగా అభ్యంతరం చెప్పారని పంజాబీ ఖత్రీ అయిన షీలా తెలిపారు. ఆతర్వాత వినోద్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆలిండియా స్థాయిలో 9వ ర్యాంకు సాధించడంతో తమ పెళ్లికి అడ్డుచెప్పలేదని షీలా పేర్కొన్నారు. అనూహ్యంగా రాజకీయ ప్రవేశం షీలా మామ ఉమా శంకర్ స్వాతంత్య్ర పోరాటయోధుడు. తర్వాత ఆయన ఇందిర కేబినెట్లో మంత్రి అయ్యారు. ఆయన రాజకీయాల్లో ఎదగడానికి షీలా తెరవెనుక సహకారం అందించారు. ఇందిరాగాంధీని తరచూ కలిసేవారు. షీలాలోని పాలనా నైపుణ్యాన్ని గుర్తించిన ఇందిర ఆమెను ఐక్యరాజ్యసమితిలో మహిళా అంశంపై జరిగే సదస్సుకు భారత్ తరఫున ప్రతినిధిగా పంపారు. అదే షీలా రాజకీయ జీవితానికి పునాది వేసింది. 1984–89 సంవత్సరాల మధ్య ఐక్యరాజ్య సమితిలో భారత్ రాయబారిగా సేవలు అందించారు. రాజీవ్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1998 నుంచి వరసగా మూడు ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికై తిరుగులేని నేతగా ఎదిగారు. 2014లో కేరళ గవర్నర్‌గా అయిదు నెలలు కొనసాగారు. వివాదాలు, పురస్కారాలు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బెస్ట్ చీఫ్ మినిస్టర్ అవార్డు, 2009లో బెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎన్డీటీవీ పురస్కారం, అసోచామ్ సంస్థ నుంచి ఢిల్లీ వుమెన్ ఆఫ్ ది డికేడ్ అచీవర్స్ అవార్డు వంటివి అందుకున్నారు. రూ.3.5 కోట్ల కేంద్ర నిధుల్ని ఆమె తన సొంత రాజకీయ ప్రకటనల కోసం ఖర్చు చేశారని బీజేపీ కోర్టుకెక్కింది. 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడల్లో వీధి దీపాల సామగ్రి కొనుగోలులో అవకతవకలు జరిగాయని కాగ్ వేలెత్తి చూపించింది. -
తాపేశ్వరం లడ్డు ‘హ్యాట్రిక్’ గిన్నిస్ రికార్డు
మూడోసారీ తాపేశ్వరం లడ్డూ గిన్నిస్ రికార్డులకెక్కింది. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలోని శ్రీభక్తాంజనేయ స్వీట్స్ సంస్థ ఈ అరుదైన ఘనత సాధించింది. వినాయక చవితి సందర్భంగా గణేష్ మహాలడ్డూల తయారీలో మూడేళ్ల నుంచి వరుసగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంటూ వచ్చింది. 2013లో తయారుచేసిన మహాలడ్డూకు గిన్నిస్ రికార్డ్స్ నుంచి శనివారం సర్టిఫికెట్ అందినట్టు సంస్థ అధినేత సలాది వెంకటేశ్వరరావు (శ్రీనుబాబు) తెలిపారు. తొలిసారిగా 2011లో విశాఖపట్నానికి చెందిన సువర్ణభూమి సంస్థ ఆర్డర్‌తో 5,570 కిలోల లడ్డు, 2012లో రాజమండ్రిలోని రాజమహేంద్రి గణేష్ ఉత్సవ కమిటీ ఆర్డర్ మేరకు 6,599.29 కిలోల లడ్డు, 2013 ఆగస్టులో వినాయక చవితి సందర్భంగా అదే కమిటీ వారికి తయారు చేసిన 7,132.87 కిలోల మహాలడ్డూ వరుసగా గిన్నిస్ రికార్డుల్లోకెక్కాయని వివరించారు. తమ సంస్థ మినహా ప్రపంచంలో ఏ స్వీట్ స్టాల్ మూడుసార్లు గిన్నిస్ రికార్డు సాధించలేదని చెప్పారు. - న్యూస్‌లైన్, మండపేట