రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని పరుగులు పెట్టించనున్న బీజేపీ అగ్రనేతలు
జహీరాబాద్ ఎంపీ సీటు పరిధిలోని అల్లా్లదుర్గ్‌లో రేపు ప్రధాని సభ
మే 3న మరోసారి తెలంగాణలో మోదీ ప్రచారం
నేడు నడ్డా.. ఎల్లుండి హైదరాబాద్‌కు అమిత్ షా
పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీపాలిత సీఎంలు, జాతీయ నేతలూ ప్రచారానికి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచార స్పీడ్ పెంచింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు నాలుగో విడతలో భాగంగా మే 13న ఎన్నికలు జరగనుండటంతో వచ్చే రెండు వారాలపాటు ప్రచారాన్ని పరుగులు పెట్టించనుంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ మంగళవా రం రాష్ట్ర పర్యటనకు రానున్నారు.
అలాగే మే 3న సైతం తెలంగాణలో ప్రచారం చేపట్టనున్నారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం వివిధ చోట్ల ప్రచారం నిర్వహించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మే 1న హైదరాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో ప్రచారం నిర్వహించనున్నారు. మరోవైపు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీపాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారపర్వంలోకి దిగనున్నారు.
సభలు, సమావేశాల హోరు..
జేపీ నడ్డా సోమవారం ఉదయం 10 గంటలకు ఖమ్మం లోక్‌సభ పరిధిలోని కొత్తగూడెంలో బహిరంగ సభలో పాల్గననున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు మహబుబాబాద్ ఎంపీ స్థానం పరిధిలోని మహబుబాబాద్‌లో జనసభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 గంటలకు మేడ్చల్ లోక్‌సభ పరిధిలోని నిజాంపేటలో రోడ్డు షో చేపట్టనున్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర ముఖ్యనేతలతో సమావేశమై ఎన్నికల సన్నద్ధత తీరు, ప్రచార కార్యక్రమాలను సమీక్షించనున్నారు.
మరోవైపు మంగళవారం ఉదయం 11 గంటలకు జహీరాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోని అందోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న అల్లాదుర్గ్ మండలంలో ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. మరోసారి మే 3న తెలంగాణకు రానున్నారు. ఇక మే 1న అమిత్ షా హైదరాబాద్ లోక్‌సభలోని చారి్మనార్ శాసనసభ నియోజకవర్గంలోని గౌలిపురలో సాయంత్రం 5 గంటలకు రోడ్ షో నిర్వహించనున్నారు.
క్యాంపెయిన్‌లో ముందున్న ముఖ్య నేతలు
అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ కంటే దాదాపుగా అన్ని లోక్‌సభ స్థానాల్లో చేపట్టిన విస్తృత ప్రచారంలో బీజేపీ ముందుంది. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులు, పార్టీనాయకులు, కార్యకర్తల ఇప్పటికే తమ తమ పరధుల్లో మొదటి విడత ప్రచారాన్ని ముగించి రెండోవిడత ప్రచారానికి సిద్ధమయ్యారు. కొన్నిచోట్ల రెండో విడత ప్రచారాన్ని కూడా ప్రారంభించి ముఖ్యనేతలు ముందున్నట్లు పారీ్టకి నివేదికలు అందుతున్నాయి.
ముఖ్యంగా సికింద్రాబాద్‌లో పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యరి్థ, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, మల్కాజిగిరిలో పోటీ చేస్తున్న జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, నిజామాబాద్ అభ్యరి్థ, ఎంపీ అరి్వంద్ ధర్మపురి, మెదక్ అభర్థి, మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత నిర్వహిస్తున్న ప్రచారంలో కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ, రాష్ట్ర ముఖ్యనేతలు పాల్గొని హుషారు పెంచుతున్నారు. వరంగల్ లోక్‌సభ అభ్యర్థి ఆరూరి రమేశ్, ఆదిలాబాద్‌లో ఎంపీ అభ్యర్థి గోడెం నగే‹Ù, ఇతర నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ఉధృతం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment