గంగూలీ వర్సెస్ సెహ్వాగ్!
దుబాయ్: మరోసారి మాజీ క్రికెటర్లు తమ ఆటతో అలరించేందకు సిద్ధమవుతున్నారు.ఇటీవల అమెరికాలో జరిగిన క్రికెట్ ఆల్ స్టార్స్ సిరీస్ ను వీక్షించిన ప్రేక్షకులు అదేస్థాయిలో కనువిందు చేసేందుకు మాస్టర్స్ చాంపియన్స్ లీగ్(ఎంసీఎల్) వేదిక కాబోతుంది. వచ్చే నెలలో యూఏఈలో జరగనున్న ఎంసీఎల్ కు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది.జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకూ యూఏఈలోని పలుచోట్ల జరిగే మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. లిబ్రా లెజెండ్స్, జెమినీ అరేబియన్స్, కాప్రికోర్న్ కమాండర్స్, లియో లైన్స్, విర్గో సూపర్ కింగ్స్ , సాగిటారియస్ స్ట్రైకర్స్ లు పోటీకి సన్నద్ధమవుతున్నాయి.
తొలి గేమ్ లో వీరేంద్ర సెహ్వాగ్ సభ్యుడిగా ఉన్న జెమినీ అరేబియన్స్ జట్టు.. సౌరవ్ గంగూలీకి నేతృత్వం వహించే లిబ్రా లెజెండ్స్ జట్టు తలపడనుంది. ఈ లీగ్ కు సంబంధించి ఎంసీఎల్ -ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుల మధ్య 10 సంవత్సరాల ఒప్పందం కుదిరింది. తొలి ఎడిషన్ లో ఓవరాల్ గా సెమీ ఫైనల్ , ఫైనల్ మ్యాచ్ లతో కలుపుకుని మొత్తం 18 మ్యాచ్ లు జరగనున్నాయి.