
కోల్‌కతా: జాతీయ సీనియర్ టీమ్ చెస్ చాంపియన్ షిప్‌లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) జట్లు మహిళల, పురుషుల విభాగాల్లో టైటిల్స్ సొంతం చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి బొడ్డ ప్రత్యూష, పద్మిని రౌత్, ఇషా కరవాడే, సౌమ్య స్వామినాథన్, మేరీ ఆన్‌గోమ్స్ సభ్యులుగా ఉన్న పీఎస్‌పీబీ జట్టు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి 14 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
సూర్యశేఖర గంగూలీ, అరవింద్ చిదంబరం, జీఎన్ గోపాల్, కార్తికేయన్ మురళీ, దీప్ సేన్‌గుప్తాలతో కూడిన పీఎస్‌పీబీ పురుషుల జట్టు 17 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది.