
కోల్‌కతా: ఈడెన్ టెస్టు తొలిరోజు భారత్ త్వరగా వికెట్లు కోల్పోయినప్పటికీ.. తొలిటెస్టులో విజయం సాధిస్తుందని భారత మాజీ కెప్టెన్, ‘క్యాబ్’ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. ‘రెండ్రోజులుగా వర్షం కురుస్తోంది. దాన్ని నేను ఆపలేను. వర్షం, పిచ్‌పై పచ్చిక కారణంగా మ్యాచ్ ఇలాగే ఉంటుంది. వర్షం పడుతున్నప్పుడు, సరైన వెలుతురు లేనప్పుడు ఎలా ఉంటుందో మీకు తెలుసు.
అయినా ఒక విషయం చెబుతున్నా.. తొలిరోజు వెనకబడ్డప్పటికీ భారత్ ఈ మ్యాచ్‌లో గెలుస్తుంది’ అని గంగూలీ పేర్కొన్నాడు. ఓ జట్టు పచ్చిక ఉన్న వికెట్‌పై ఆడుతుందా లేదా అని తను నిర్ణయించలేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment