ఆ అవార్డు అఫ్గాన్‌కే: ఐసీసీ | Rashid And Shahzad Dancing to Salman Khan Song | Sakshi
Sakshi News home page

ఆ అవార్డు అఫ్గాన్‌కే: ఐసీసీ

Published Wed, Jun 5 2019 5:22 PM | Last Updated on Wed, Jun 5 2019 5:36 PM

Rashid And Shahzad Dancing to Salman Khan Song - Sakshi

హైదరాబాద్‌: క్రికెట్‌లో వినోదానికి మారుపేరు వెస్టిండీస్‌ జట్టు. వికెట్‌ తీసినా, సిక్సర్‌ కొట్టిన, సెంచరీ చేసినా కరేబియన్‌ ఆటగాళ్లు చేసే సందడి అంతా ఇంతా కాదు. ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్‌ తీసిన ఆనందంలో విండీస్‌ బౌలర్‌ ఓష్నే థామస్ అంపైర్‌కు సెల్యూట్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా పసికూన అఫ్గానిస్తాన్‌ కూడా విండీస్ బాటలోనే నడుస్తుంది. ఆటతోనే కాకుండా అభిమానులకు తమదైన రీతిలో వినోదాన్ని పంచుతున్నారు అఫ్గాన్‌ ఆటగాళ్లు. 


తాజాగా అఫ్గాన్‌ ఆటగాళ్లు డ్యాన్స్‌ చేస్తున్న వీడియోనే ఐసీసీ తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఈ వీడియోలో ఓవర్‌వెయిట్‌ బ్యాట్స్‌మన్‌ మొహమ్మద్‌ షహజాద్‌తో పాటు యువ స్పిన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌లు బాలీవుడ్‌ పాటకు డ్యాన్స్‌ చేస్తున్నారు. చాలా సరదాగా ఉన్న ఈ వీడియోనే ఐసీసీ షేర్‌ చేస్తూ.. ఒకవేళ ప్రపంచకప్‌లో అత్యంత వినోదాత్మక జట్టు అవార్డు ఇవ్వాల్సివస్తే అది అఫ్గాన్‌కే దక్కుతుందని కామెంట్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఐసీసీ షేర్‌ చేసిన ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement