
బ్రిస్టల్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి నుంచి అందుకున్న స్పెషల్ బ్యాట్‌ను పోగుట్టుకున్నానని అఫ్గానిస్తాన్ సంచలనం రషీద్ ఖాన్ తెలిపాడు. ఇటీవల ఐపీఎల్ ఆడిన సమయంలో కోహ్లి దగ్గర నుంచి బ్యాట్‌ను గిఫ్ట్‌గా అందుకున్నానని, అయితే ఆ బ్యాట్‌ను తమ ఆటగాడు అస్గర్ అఫ్గన్ కొట్టేశాడని రషీద్ చెబుతున్నాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా రషీద్ ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తనకు కోహ్లి ఇచ్చిన బ్యాట్ ఎలా పొగొట్టుకున్నాడన్న విషయాన్ని వివరించాడు.
‘నాకు మొదటి నుంచి బ్యాట్స్ సేకరించడం అలవాటు. విరాట్ కోహ్లి, డేవిడ్ వార్నర్, కేఎల్ రాహుల్ లాంటి క్రికెటర్ల దగ్గర నుంచి స్పెషల్ బ్యాట్స్ ని నేను గిఫ్ట్ గా పొందాను. ఈ బ్యాట్స్ తోనే నేను వరల్డ్ కప్ ఆడాలి అనుకుంటున్నాను. ఈ బ్యాట్స్ నాకు ఎక్కువ పరుగులు తీయడానికి ఉపయోగపడతాయి అని భావిస్తున్నాను’ అని చెప్పాడు.
(ఇక్కడ చదవండి: మా కెప్టెన్‌కు బాగా కొవ్వెక్కింది : అక్తర్)
‘ఇటీవల ఐర్లాండ్ తో మ్యాచ్ ఆడుతున్నప్పుడు నేను కోహ్లి ఇచ్చిన బ్యాట్ ఉపయోగించాను. ఆ బ్యాట్ తో నేను ఎక్కువ పరుగులు చేయగలిగాను. నేను ఫోర్ కోసం ప్రయత్నిస్తే... అది సిక్స్ వెళ్లింది. తర్వాత మ్యాచ్ అనంతరం నేను పెవిలియన్ కి వెళ్లాక అప్పటి మా టీం కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ నా బ్యాట్ తనకివ్వమని అడిగాడు. నేను ఇవ్వను అని చెప్పాను. అయినా సరే నా బ్యాగ్‌లో నుంచి తీసుకుని అతని బ్యాగ్‌లో పెట్టుకున్నాడు. ఆ బ్యాట్ చాలా స్పెషల్ వ్యక్తి నుంచి తనకు వచ్చిన గిఫ్ట్ అని, కాబట్టి తిరిగి ఆ బ్యాట్ తనకే వచ్చి చేరుతుందని నమ్ముతున్నాను’ అని చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment