కాబూల్ : అఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు ఆ దేశ సెలక్షన్ కమిటీ పదోన్నతి కల్పించింది. ఇంగ్లండ్-వేల్స్ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌లో పాల్గొనబోయే అఫ్గాన్ జట్టుకు రషీద్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ప్రస్తుతం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున రషీద్ ఖాన్ అదరగొడుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం సమావేశమైన ఆఫ్గాన్ సెలక్షన్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మూడు ఫార్మట్‌లకు వేర్వేరు సారథులు ఉండాలని బోర్డు నిర్ణయించింది. అంతే కాకుండా ప్రపంచకప్‌లో పాల్గొనబోయే అఫ్గాన్ జట్టుకు ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న అస్గర్‌పై వేటు వేసి.. అతడి స్థానంలో గుల్బాదిన్ నైబ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది.
ఇక ఇప్పటికే అఫ్గాన్ టీ20 జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న రషీద్ ఖాన్‌ను కొనసాగించింది. టెస్టులకు రహమ్‌త్ షాను కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ప్రపంచకప్‌కు సన్నాహకంలో భాగంగా అఫ్గాన్ జట్టు ఐర్లాండ్, స్కాట్లాండ్, పాకిస్తాన్, ఇంగ్లండ్‌లతో సిరీస్‌లు ఆడనుంది. ఇక ప్రపంచకప్ తొలి పోరులో ఆస్ట్రేలియాతో జూన్1న తలపడనుంది. తొలి సారి ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొననుండటంతో అఫ్గాన్ ఆటగాళ్లు, అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment