తాతయ్య స్టెప్పులకు యువతులు ‘ఫిదా’ | Mind Blowing Dance By Grandpa In Mumbai | Sakshi
Sakshi News home page

Published Mon, May 28 2018 8:27 PM | Last Updated on Mon, May 28 2018 8:56 PM

Mind Blowing Dance By Grandpa In Mumbai - Sakshi

స్టెప్పులు వేస్తున్న తాత

సాక్షి, ముంబై: వయసు..! అవును ఈ విషయం గుర్తుకు రాగానే అందరి గుండెల్లో గుబులు మొదలవుతుంది. కానీ, ముసలితనం నా శరీరానికే. నాకు కాదు అన్నట్టు ఓ తాత తన డ్యాన్స్‌తో చెలరేగి పోయారు. ఓ పెళ్లి వేడుకలో యువతీ, యువకులకు ధీటుగా స్టెప్పులు వేసి వారికి సవాల్‌ విసిరారు. రేపన్నది లేదన్నట్టు, దొరికిన ఈ క్షణంలో సాధ్యమైనంత ఆనందాన్ని జుర్రాలి అన్నట్టు ఆయన తన్మయత్వంతో ఊగిపోయారు.

డ్యాన్స్‌ చేయడానికి అడ్డొస్తున్నాయని నడక సాగించేందుకు సహాయపడే తన చేతి కర్రలను విసిరి పడేశారు. ఎంతో కళాత్మకంగా నృత్యం చేస్తున్న ఆ వృద్ధున్ని చూసి మరో ఇద్దరు యువతులు తనకు జతయ్యారు. వారి చేతులు పట్టుకొని తాతయ్య అందంగా వేసిన స్టెప్పులకు అక్కడున్న జనం ముచ్చటపడ్డారు. ఆయన నాట్య విన్యాసాల్ని ఎడ్గార్డ్‌ అనే వ్యక్తి వీడియోలో బంధించి ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో వైరల్‌ అయింది. కొన్ని నెలల క్రితం చోటు చేసుకున్న ఈ సరదా విన్యాసం ఇప్పడు మళ్లీ ట్రెండ్‌ అవుతుండడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement