
శ్రీనగర్ : భద్రతా దళాలను తమను నిలువరించాలని సవాల్ విసిరిన ఉగ్ర సంస్థ హిజ్బుల్ ముజహిదిన్ తాజాగా కశ్మీరీ బాలికలను హెచ్చరించింది. డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్న బాలికలకు ఇదే చివరి హెచ్చరికని, వారు ఈ పని మానుకోవాలి లేదా వారి కాళ్లు తెగనరుకుతామని, అందుకు సిద్ధంగా ఉండాలంటూ పోస్టర్లను విడుదల చేసింది.
శ్రీనగర్‌లో ఇటీవల తాము సమావేశమయ్యామని తదుపరి భేటీ ఢిల్లీలో ఉంటుందని హిజ్బుల్ చీఫ్ రియాజ్ నైకూ వెల్లడించినట్టు తెలిసింది. హిజ్బుల్‌లోకి పెద్ద సంఖ్యలో బాలికలు, ఇతరులను రిక్రూట్ చేసుకోవాలని శ్రీనగర్ భేటీలో ఉగ్రసంస్థ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. భారత్‌తో పాటు దాని సంస్థలతో ఎలా పోరు సాగించాలనే కసరత్తుపై తమ భేటీ 47 గంటల పాటు సుదీర్ఘంగా సాగిందని హిజ్బుల్ ప్రతినిధి పేర్కొన్నారని జీ మీడియా వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment