hijbul Mujahideen
-
ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం?
ఢిల్లీ: దేశ రాజధానిలో భారీ ఉగ్ర కుట్రను స్పెషల్ పోలీసులు భగ్నం చేశారు. ఈ క్రమంలో మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది జావెద్ అహ్మద్ మట్టూ అరెస్ట్ అయ్యాడు. స్పెషల్ సెల్ పోలీసులు గురువారం ఢిల్లీలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. జావెద్ జమ్ము కశ్మీర్లో ఉంటూ హిజ్బుల్ ముజాహిద్దీన్ తరఫున ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడ్డాడు.జావేద్ నుంచి ఒకపిస్టల్, మ్యాగ్జిన్లు .. దొంగలించిన ఓ కారును రికవరీ చేసుకున్నారు ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్రకు పాల్పడేందుకే జావేద్ వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. జావేద్ ప్రస్తుతం ఏ-ఫ్లస్ ఫ్లస్ లిస్ట్‌లో ఉన్న ఉగ్రవాది. పలు ఉగ్రదాడుల్లో అతని ప్రమేయం ఉంది. జావెద్ మట్టూ.. జమ్ము కశ్మీర్లో పలు ఉగ్రదాడులకు పాల్పడ్డాడు. అందుకే భద్రతా బలగాల మోస్ట్ వాంటెడ్ టాప్ టెన్ లిస్ట్‌లో ఉన్నాడు. అతనిపై రూ.10 లక్షల రివార్డు సైతం ఉంది. సోఫోర్ వాసి అయిన మట్టూ పలుమార్లు పాక్‌కు వెళ్లి వచ్చాడు. కిందటి ఏడాది గణతంత్ర దినోత్సవం నాడు.. అతని సోదరుడు సోఫోర్లో మువ్వన్నెల జెండా ఎగరేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది కూడా. -
కశ్మీర్లో హిజ్బుల్ ఉగ్రవాది ఎన్కౌంటర్
శ్రీనగర్ : పుల్వామా, అనంతనాగ్‌లో సంభవించిన రెండు వేర్వేరు ఎదురుకాల్పుల ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శనివారం ఉదయం పుల్వామా జిల్లా అవంతిపొర ప్రాంతంలోని పంజ్‌గామ్ గ్రామ సమీపంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ప్రాంతంలో ముష్కరులు తలదాచుకున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు.. 130 బెటాలియన్ సీఆర్పీఎఫ్ సిబ్బంది, 55 రాష్ట్రీయ రైఫిల్స్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సాయంతో గాలింపు చేపట్టారు. ఈక్రమంలో ఉగ్రవాదులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఎదురు కాల్పులు చోటు చోసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఒకరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన కమాండర్ షౌకత్ అహ్మద్ దార్గా భావిస్తున్నారు. గతంలో ఔరంగజేబులో జరిగిన కాల్పుల్లో.. అహ్మద్ ఓ జవాన్‌ను హత్య చేశాడు. మరొక ఉగ్రవాది గురించి వివరాలు తెలియరాలేదు. ఎన్కౌంటర్ అనంతరం అధికారులు సంఘటన స్థలం నుంచి ఒక ఏకే - 56 రైఫిల్‌ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఉగ్రవాదులు తలదాచుకున్న ఇంటిని కూడా పేల్చేశారు. -
జమ్మూ పేలుడు : నిందితుడికి హిజ్బుల్ సాయం
శ్రీనగర్ : జమ్మూ బస్‌స్టాండ్‌లోని ఓ బస్సుపై జరిగిన గ్రనేడ్ దాడిలో అరెస్ట్ అయిన అనుమానితుడు యాసిర్ భట్‌కు నిషేధిత ఉగ్ర సంస్థ హిజ్బుల్ ముజహిదిన్ రూ 50,000 ఇచ్చినట్టు వెల్లడైంది. గురువారం జరిగిన ఈ దాడిలో ఇద్దరు మరణించగా, 30 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. కుల్గాం జిల్లాకు చెందిన అనుమానితుడు యాసిర్ భట్‌ను కశ్మీర్లోకి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా జమ్మూ నగరం వెలుపల నాగ్రోటా టో్‌ల్‌ప్లాజా వద్ద అరెస్ట్ చేశారు. నిందితుడి ఆధార్ కార్డు, స్కూల్ రికార్డులను పరిశీలించగా 16 ఏళ్ల మైనర్‌గా వెల్లడైందని పోలీసులు చెబుతున్నారు. తొమ్మిదవ తరగతి చదువుతున్న నిందితుడి తండ్రి వృత్తిరీత్యా పెయింటర్. కాగా యాసిర్ భట్‌ను ఈ దాడికి ప్రేరేపించేందుకు హిజ్బుల్ ముజహిదీన్‌కు చెందిన ముజమిల్ అనే అజ్ఞాత సానుభూతిపరుడు రూ 50,000 చెల్లించడంతో పాటు గ్రనేడ్‌ను సమకూర్చాడని నిందితుడు వెల్లడించినట్టు సమాచారం. వాస్తవంగా గ్రనేడ్ దాడిని ముజమిల్‌కు హిజ్బుల్ జిల్లా కమాండర్ ఫయాజ్ భట్ అప్పగించగా ఈ దాడిని చేపట్టంలో ముజమిల్ విఫలమయ్యాడని నిందితుడు విచారణలో భాగంగా తెలిపినట్టు పోలీసులు వెల్లడించారు. -
కశ్మీర్ బాలికలకు హిజ్బుల్ వార్నింగ్..
శ్రీనగర్ : భద్రతా దళాలను తమను నిలువరించాలని సవాల్ విసిరిన ఉగ్ర సంస్థ హిజ్బుల్ ముజహిదిన్ తాజాగా కశ్మీరీ బాలికలను హెచ్చరించింది. డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్న బాలికలకు ఇదే చివరి హెచ్చరికని, వారు ఈ పని మానుకోవాలి లేదా వారి కాళ్లు తెగనరుకుతామని, అందుకు సిద్ధంగా ఉండాలంటూ పోస్టర్లను విడుదల చేసింది. శ్రీనగర్‌లో ఇటీవల తాము సమావేశమయ్యామని తదుపరి భేటీ ఢిల్లీలో ఉంటుందని హిజ్బుల్ చీఫ్ రియాజ్ నైకూ వెల్లడించినట్టు తెలిసింది. హిజ్బుల్‌లోకి పెద్ద సంఖ్యలో బాలికలు, ఇతరులను రిక్రూట్ చేసుకోవాలని శ్రీనగర్ భేటీలో ఉగ్రసంస్థ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. భారత్‌తో పాటు దాని సంస్థలతో ఎలా పోరు సాగించాలనే కసరత్తుపై తమ భేటీ 47 గంటల పాటు సుదీర్ఘంగా సాగిందని హిజ్బుల్ ప్రతినిధి పేర్కొన్నారని జీ మీడియా వెల్లడించింది. -
ఆర్మీ టు హిజ్బుల్ ముజాహిద్దీన్
కశ్మీర్ : భారత ఆర్మీకి చెందిన ఓ జవాను గత శనివారం నుంచి అదృశ్యమయ్యాడని, బహుశా హిజ్బుల్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థలో చేరి ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. అదృశ్యమైన జవాను, ఉగ్రవాద సంస్థలో చేరినట్లు తెలియజేసేలా ఏకే- 47 పట్టుకుని ఉన్న ఫోటోను హిజ్బుల్ విడుదల చేసింది. ఈ ఫోటో స్థానిక మీడియాలో వైరల్ అవుతోంది. ఉగ్రవాద సంస్థలో చేరినట్లు భావిస్తున్న సిపాయి మీర్ ఇద్రీస్ సుల్తాన్, 12వ జమ్మూ కశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీకి చెందినవాడు. దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని అతని స్వగ్రామానికి చివరిసారిగా ఈ నెల 12న వచ్చినట్లు తెల్సింది. ఏప్రిల్ 14 నుంచి అదృశ్యమయ్యాడు. ఈ విషయం గురించి మీర్ ఇద్రీస్ సుల్తాన్ తండ్రి స్థానిక పోలీసులను సోమవారం ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. మరో ఇద్దరు యువకులతో ఉగ్రవాద సంస్థలో మీర్ సుల్తాన్ చేరినట్లు మీడియాకు పోలీసులు వివరించారు. ఈ విషయాన్ని పోలీసులు కూడా భారత ఆర్మీకి తెలిపారు. ఉగ్ర సంస్థలో చేరిన సుల్తాన్ ఫోన్ రికార్డులు పరిశీలిస్తున్నామని, అలాగే ఉగ్ర సంస్థలతో సుల్తాన్ సంబంధాలపై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. అతను ఉగ్రవాద సంస్థలో చేరినట్లు తమ వద్ద ఎటువంటి ఆధారాలు ప్రస్తుతం తమ వద్ద లేవని, అతను సెలవులో ఉన్నపుడు కశ్మీర్‌కు వెళ్లాడా లేదా అనే సమాచారం కూడా తమ వద్ద లేదని భారత ఆర్మీ పేర్కొంది. ప్రస్తుతం బిహార్‌లోని కటిహర్‌లో మీర్ ఇడ్రీస్ సుల్తాన్ పనిచేస్తున్నాడు. జార్ఖండ్‌కు బదిలీపై వెళ్లాల్సి ఉంది. అయితే అక్కడకు వెళ్లేందుకు ఇష్టపడటంలేదని తెలిపింది. ఆ కారణంతోనే హిజ్బుల్‌లో చేరి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ విడుదల చేసిన చిత్రంలో సుల్తాన్, ఏకే-47 పట్టుకున్నట్లు, అతని వివరాలు గ్రీన్ అక్షరాలలో దానిపై కనపడేటట్లు ఉంది. అలాగే బీఎస్సీ రెండో సంవత్సరం చదివినట్లు ఆ ఫోటో మీద రాసి ఉంది. -
కశ్మీర్లో ఎన్ కౌంటర్
ఇద్దరు ఉగ్రవాదుల హతం శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భద్రతా దళాలు శనివారం జరిపిన ఎన్ కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సోపోర్‌కు చెందిన అమర్గఢ్ గ్రామం సమీపంలో ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఓ వాహనంలో వెళుతున్న ఇద్దరు ఉగ్రవాదుల్ని పోలీసులు గమనించి చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు వారిపై ఓ గ్రెనేడ్‌ను విసరడమేగాక కాల్పులకు దిగారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఉగ్రవాదులు సోపోర్‌లో హింసాత్మక చర్యలకు పన్నాగం పన్నినట్టు సమాచారమందటంతో పోలీసులు, భద్రతా దళాలు అప్రమత్తమై వారిని అడ్డుకున్నట్టు పోలీసు ప్రతినిధి ఒకరు తెలిపారు.