ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం? | Delhi Special Police Arrested Terrorist Javed Ahmed Mattu, Know Who Is He - Sakshi
Sakshi News home page

మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాది జావేద్‌ అరెస్ట్‌.. ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం?

Published Thu, Jan 4 2024 6:30 PM | Last Updated on Thu, Jan 4 2024 7:05 PM

Delhi Special Police Arrest Javed Mattu - Sakshi

ఢిల్లీ: దేశ రాజధానిలో భారీ ఉగ్ర కుట్రను స్పెషల్‌ పోలీసులు భగ్నం చేశారు. ఈ క్రమంలో మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాది జావెద్‌ అహ్మద్‌ మట్టూ అరెస్ట్‌ అయ్యాడు. స్పెషల్‌ సెల్‌ పోలీసులు గురువారం ఢిల్లీలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. జావెద్‌ జమ్ము కశ్మీర్‌లో ఉంటూ హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ తరఫున ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడ్డాడు.జావేద్‌ నుంచి ఒకపిస్టల్‌, మ్యాగ్జిన్లు .. దొంగలించిన ఓ కారును రికవరీ చేసుకున్నారు ఢిల్లీ పోలీసులు.

ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్రకు పాల్పడేందుకే జావేద్‌ వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. జావేద్‌ ప్రస్తుతం ఏ-ఫ్లస్‌ ఫ్లస్‌ లిస్ట్‌లో ఉన్న ఉగ్రవాది. పలు ఉగ్రదాడుల్లో అతని ప్రమేయం ఉంది.  జావెద్‌ మట్టూ.. జమ్ము కశ్మీర్‌లో పలు ఉగ్రదాడులకు పాల్పడ్డాడు. అందుకే భద్రతా బలగాల మోస్ట్‌ వాంటెడ్‌ టాప్‌ టెన్‌ లిస్ట్‌లో ఉన్నాడు. అతనిపై రూ.10 లక్షల రివార్డు సైతం ఉంది. 

సోఫోర్ వాసి అయిన మట్టూ పలుమార్లు పాక్‌కు వెళ్లి వచ్చాడు. కిందటి ఏడాది గణతంత్ర దినోత్సవం నాడు.. అతని సోదరుడు సోఫోర్‌లో మువ్వన్నెల జెండా ఎగరేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది కూడా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement