ఎయిరిండియా విమానంలో వృద్ద మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన కేసులో శంకర్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు విచారణ చేపట్టేందుకు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అధికారులు మిశ్రాకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు అతని కోసం దేశ వ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే లుక్ అవుట్ నోటీసులతో పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న మిశ్రా బెంగళూరులో ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ప్రత్యేక బృందాల సాయంతో బెంగళూరుకు చెందిన ఓ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దేశ రాజధానికి తరలించారు.
మిశ్రాను పట్టించిన సోషల్ మీడియా
లుక్ అవుట్ నోటీసులతో బెంగళూరులో తలదాచుకున్న శంకర్ మిశ్రా పోలీసులకు దొరక్కుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. క్రెడిట్ కార్డులను వినియోగించుకున్నాడు. అయితే తన స్నేహితులతో కమ్యూనికేట్ అయ్యేందుకు సోషల్ మీడియాను వినియోగించడంతో అతని ఆచూకీ లభ్యమైంది. సోషల్ మీడియా అకౌంట్స్ ఐపీవో అడ్రస్‌లను ట్రేస్ చేసిన పోలీసులు మిశ్రాను అరెస్ట్ చేశారు. (క్లిక్ చేయండి.. అమెజాన్: భారత్‌లో ఊడిన ఉద్యోగాల సంఖ్య ఇది)
Comments
Please login to add a commentAdd a comment