Shankar Mishra
-
విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తికి బెయిల్..
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో తోటి మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రాకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సోమవారం తీర్పు రిజర్వు చేసిన న్యాయస్థానం మంగళవారం ఈమేరకు తీర్పునిచ్చింది. ఢిల్లీ పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టిన సాక్షి చెప్పిన దానికి, ఫిర్యాదు చేసిన మహిళ చెప్పిన దానికి పొంతన లేదని పాటియాలా కోర్టు చెప్పింది. సాక్ష్యాధారాలు సరిగ్గా లేనందున నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. శంకర్ మిశ్రాకు బెయిల్ ఇవ్వొద్దని అతను చేసిన పని వల్ల అంతర్జాతీయంగా భారత్ అపఖ్యాతి పాలైందని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే అది వేరే విషయమని చట్టపరమైన విషయాలు మాత్రమే పరిశీలించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. గతేడాది నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో అశోక్ మిశ్రా వికృత చేష్టలు చేశాడు. ఫుల్లుగా తాగి మహిళపై మూత్ర విసర్జన చేశాడు. బాధితురాలు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. జనవరి 11న మెజిస్టేరియల్ కోర్టు శంకర్ మిశ్రాకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే పాటియాలా కోర్టు మాత్రం బెయిల్ మంజూరు చేసింది. ఈ వ్యవహారంలో ఎయిర్ ఇండియా యాజమాన్యానికి రూ.30లక్షల జరిమానా కూడా విధించింది కేంద్ర పౌరవిమానయాన శాఖ. విమానం పైలట్ ఇంఛార్జ్‌ను కూడా మూడు నెలలు సస్పెండ్ చేసింది. ఎయిర్ ఇండియా విమాన సేవల డైరెక్టర్‌కు రూ.3లక్షల పెనాల్టీ విధించింది. చదవండి: అత్యాచార కేసులో సెషన్స్ కోర్టు కీలక తీర్పు.. ఆశారాం బాపునకు జీవిత ఖైదు -
Urination Case: ఎయిరిండియాకు భారీ షాక్
న్యూఢిల్లీ: ఎయిరిండియా మూత్రవిసర్జన కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ(డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్).. ఎయిర్ ఇండియాకు భారీ షాక్ ఇచ్చింది. ఘటనకుగానూ శుక్రవారం రూ.30 లక్షల పెనాల్టీ ఎయిర్ ఇండియాకు విధించింది. అంతేకాదు.. ఆ సమయంలో విమానంలో ఉన్న పైలట్ ఇన్ కమాండ్ లైసెన్స్‌ను మూడు నెలలపాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు ఎయిర్ ఇండియా డైరెక్టర్ ఇన్ ఫ్లైట్ సర్వీసెస్‌కు రూ.3 లక్షల ఫైన్ విధించింది. ఘటన సమయంలో సరైన స్పందన లేకపోవడం, పైగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం లాంటి పరిణామాల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది డీజీసీఏ. గతేడాది నవంబర్ 26వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. న్యూయార్క్–న్యూఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో బిజినెస్ క్లాస్‌లో 70 ఏళ్ల సహ ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేశాడు శంకర్ మిశ్రా. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రాగా.. దుమారం చెలరేగింది. అప్పటికప్పుడు పార్టీల మధ్య రాజీ కుదరిందనుకుని ఈ వ్యవహారాన్ని వదిలేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించుకుంది. అయితే.. వృద్ధురాలి ఫిర్యాదుతో ఈ ఏడాది జనవరి 4వ తేదీన ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడిని తీవ్రంగా గాలించి అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చాక ఎయిరిండియా నిందితుడు శంకర్ మిశ్రాను నాలుగు నెలలపాటు నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. మద్యం మత్తులో ఈ నేరానికి పాల్పడినందుకు.. తప్పించుకునే ప్రయత్నం చేసినందుకు శంకర్ అరెస్ట్ కాగా, సాక్ష్యులను బెదిరించడం.. తారుమారు చేసే అవకాశం ఉండడంతో బెయిల్‌కు నిరాకరించింది కోర్టు. -
ఎయిర్ ఇండియా ఘటన: పశ్చాత్తాపం లేకుండా ఆరోపణలా!
ఎయిర్ ఇండియా మూత్ర విసర్జన ఘటనలో నిందితుడు శంకర్ మిశ్రా మాటమార్చి బాధితురాలిపైనే సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సదరు వృద్ధ మహిళ ఆ వ్యాఖ్యలకు స్పందించి..అవన్నీ కల్పితాలంటూ కొట్టిపారేసింది. తాను చేసిన అనుచిత పనికి పశ్చాత్తాపం చెందకుండా తనపైనే ఆరోపణలా అంటూ మిశ్రాపై సీరియస్ అయ్యారు. తనకు ఎదురైన భయంకరమైన అనుభవం ఏ వ్యక్తి కూడా అనుభవించకుండా ఉండేలా సంస్థాగత మార్పులు జరిగేలా చూడటమే తన ప్రధాన ఉద్దేశ్యమని చెప్పారు. తాను చేసిన అసహ్యకరమైన పనికి సిగ్గుపడకుండా తనపైన అసత్య ఆరోపణలు చేసి మరింత వేధిస్తున్నాడని వాపోయారు. కాగా నవంబర్ 26న ఎయిర్ ఇండియాలో తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన ఘటన సదరు బాధిత మహిళ ఫిర్యాదుతో చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నిందితుడిని అరెస్టు చేయడం, కోర్టు నోటీసులు జారీ చేయడం తదితరాలు జరిగాయి. అంతేగాదు కోర్టు అతని కస్టడీని నిరాకరించి, బెయిల్ పిటీషన్ని సైతం తిరస్కరించింది. ఐతే కోర్టు నోటీసుల నిమిత్తం విచారణ చేయగా... నిందితుడు మిశ్రా వృద్ధురాలు అనారోగ్య కారణాల రీత్యా ఆమెనే మూత్ర విసర్జన చేసిందని ఆరోపణలు చేశాడు (చదవండి: ఎయిర్ ఇండియా ‘మూత్ర విసర్జన’ ఘటనలో కొత్త కోణం.. ‘నేను అసలు ఆ పని చేయలేదు’) -
ఎయిర్ ఇండియా ‘మూత్ర విసర్జన’ ఘటనలో కొత్త కోణం
ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటనలో కొత్త కోణం వెలుగుచూసింది. మద్యం మత్తులో 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్ మిశ్రా.. తను ఆమె పట్ల ఆ విధంగా ప్రవర్తించలేదని తెలిపాడు. వాస్తవానికి వృద్ధురాలిపై తాను మూత్ర విసర్జన చేయలేదని.. ఆ మహిళే తన సీట్లో మూత్ర విసర్జన చేసుకుందని ఢిల్లీ పాటియాలా కోర్టుకు శుక్రవారం వెల్లడించారు. వృద్ధ మహిళ తనను తానే మూత్ర విసర్జన చేసుకుని తనపై ఆరోపణలు చేస్తోందని ఆరోపించాడు. ఈ మేరకు కోర్టులో మిశ్రా తరపు న్యాయవాది మాట్లాడుతూ.. వృద్ధురాలు తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మూత్ర విసర్జన చేసిందని పేర్కొన్నారు. ఆ మహిళ 30 ఏళ్లుగా భరతనాట్యం నృత్యకారిణి అని, వారికి మూత్ర విసర్జన సమస్య రావడం సహజమేనని కోర్టుకు తెలిపారు. కాగా విచారణ నిమిత్తం శంకర్ మిశ్రాను కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు పాటియాలా హౌస్ కోర్టును కోరారు. దీనిపై స్పందించిన కోర్టు అతనికి బుధవారం నోటీసులు జారీ చేసింది. అంతేగాక మిశ్రా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. కోర్టు నోటీసులపై విచారణ సందర్భంగా మిశ్రా పై వ్యాఖ్యలు చేశాడు. చదవండి: 12 రోజుల్లోనే 5.4 సె.మీ కుంగిపోయిన జోషిమఠ్.. వాళ్లకు ఆర్థిక సాయం అసలేం జరిగిందంటే.. గతేడాది నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో మద్యం మత్తులో శంకర్ మిశ్రా అనే వ్యక్తి సహప్రయాణికురాలికి మూత్ర విసర్జన చేశాడు. ఎయిరిండియాకు మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు జనవరి 4న మిశ్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మిశ్రా పరారీలో ఉన్నాడు. దీంతో పోలీసులు అతనిపై లుకౌట్ పోలీసులు జారీ చేసిన తర్వాత నిందితుడిని బెంగళూరులో అరెస్టు చేశారు.ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ ఇంఇయాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది, ఈ చర్య అనంతరం మిశ్రాను ఉద్యోగంలో నుంచి తీసేశారు. మిశ్రాను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ శనివారం కోర్టు ఆదేశించింది. -
ఎయిరిండియాకు భారీ షాక్
ఎయిరిండియాకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) షాక్ ఇచ్చింది. ఎయిరిండియా విమానాల్లో ఇటీవల జరిగిన ఘటనలపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 26న మద్యం మత్తులో ఉన్న శంకర్ మిశ్రా ఎయిరిండియా న్యూయార్క్ - ఢిల్లీ విమాన ప్రయాణంలో వృద్ద మహిళపై మూత్రం పోయడం కలకలం రేపింది. దీంతో ఎయిరిండియాపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజా డీజీసీఏ ఎయిరిండియాకు పంపిన నోటీసుల్లో.. నవంబర్ 26న శంకర్ మిశ్రా మహిళపై మూత్రం పోశాడు. డిసెంబరు 6న పారిస్ - న్యూఢిల్లీ విమానంలో మద్యం సేవించిన ప్రయాణికుడు ఖాళీగా ఉన్న సీటు, మహిళా దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడు. మరొకరు మద్యం సేవించి లావేటరీ(ఫ్లైట్ బాత్రూం)లో సిగరెట్ తాగుతూ పట్టుబడ్డాడు. ఈ ఘటనలపై ఎయిరిండియా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ రెండు ఘటనలపై డీజీసీఏ నోటీసులు జారీ చేసింది. జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఆలస్యంగా స్పందించడంపై మండిపడింది. ఈ రెండు వేర్వేరు ఘటనలపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేసింది. పారిస్ విమానంలో జరిగిన ఘటనలపై డీజీసీఏ నివేదిక కోరిన తర్వాత మాత్రమే ఏం జరిగిందో చెప్పింది. అంతే తప్పా వెంటనే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది. ఇలాంటి ప్రమాదకరమైన ఘటనలు జరిగినప్పుడు విమానయాన సంస్థ ఏదైనా సంఘటనను 12 గంటల్లోగా నివేదించడమే కాకుండా, వాటిని అంతర్గత కమిటీకి కూడా పంపాలని డీజీసీఏ తెలిపింది. కమిటీలో రిటైర్డ్ జిల్లా, సెషన్స్ జడ్జి ఛైర్మన్‌గా ఉండాలి. వేరొక షెడ్యూల్డ్ ఎయిర్‌లైన్‌కు చెందిన ప్రతినిధి సభ్యుడు, ప్రయాణీకుల సంఘం లేదా వినియోగదారుల సంఘం నుండి ప్రతినిధి లేదా వినియోగదారు వివాద పరిష్కార ఫోరమ్‌కు చెందిన రిటైర్డ్ అధికారి సభ్యులుగా ఉండాలని స్పష్టం చేసింది. కానీ అవేం చేయకుండా ఎయిరిండియా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడంపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులపై వివరణ ఇవ్వాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. చదవండి👉 వాట్సాప్ చాట్ విడుదల, మూత్ర విసర్జన ఘటనలో శంకర్ మిశ్రాను ఇరికించారా? -
Urination incident: ‘ఎయిరిండియా’ నిందితుని అరెస్టు
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఘటనలో నిందితుడు శంకర్ మిశ్రాకు ఢిల్లీ న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానంలో నవంబర్ 26వ తేదీన ఈ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే పోలీసు విచారణకు సహకరించడం లేదని తెలుస్తోందని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అనామిక పేర్కొన్నారు. ఘటన సమయంలో విమాన సిబ్బంది, కొందరు ప్రయాణికులు నిందితుడిని గుర్తించాల్సి ఉన్నందున శంకర్ మిశ్రాను మూడు రోజుల కస్టడీకి అప్పగించాలన్న పోలీసుల వినతిని మేజిస్ట్రేట్ తోసిపుచ్చారు. ప్రజల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయనే కారణంతో కస్టడీకి కోరడం తగదన్నారు. నిందితుడి పరోక్షంలో విమాన ప్రయాణికులు, సిబ్బంది వాంగ్మూలం నమోదు చేస్తే సరిపోతుందన్నారు. ఢిల్లీ నుంచి బెంగళూరుకు.. అంతకుముందు మిశ్రా కోసం ఢిల్లీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మొబైల్ ఫోన్ చివరి లొకేషన్ జనవరి 3న బెంగళూరుగా చూపించింది. స్నేహితులతో సోషల్ మీడియా ద్వారా అతను టచ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. శుక్రవారం రాత్రి బెంగళూరు మహదేవపురలోని చిన్నప్ప లేఔట్లో అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు. బాధితురాలిని ఇబ్బందులకు గురిచేశారు ఈ ఘటనలో ఎయిరిండియా సిబ్బంది బాధ్యతా రాహిత్యాన్ని బాధితురాలి పక్క సీట్లో ప్రయాణించిన డాక్టర్ సుగతా భట్టాచార్య వెల్లడించారు. ‘‘మిశ్రా నిర్వాకానికి బాధితురాలి దుస్తులు, సీటు పూర్తిగా తడిచి దుర్వాసన వెదజల్లుతున్నా మరో సీటు కేటాయించకుండా పైలట్ ఆమెను రెండు గంటలపాటు ఇబ్బందిపెట్టారు. ఫస్ట్‌క్లాస్‌లో నాలుగు సీట్లు ఖాళీగా ఉన్నా వెంటనే సిబ్బంది సీటివ్వలేదు. ఆ ఘటనతో మేమంతా షాకయ్యాం’’ అంటూ లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బా ధితురాలికి ఎయిరిండియా సీఈవో కాంప్‌బెల్ వి ల్సన్ క్షమాపణలు చెప్పారు. ‘‘సిబ్బంది సరిగా వ్య వహరించాల్సింది. పైలట్‌తో పాటు నలుగురికి షో కాజ్ నోటీసులిచ్చాం. విమానంలో ప్రయాణికులకు మందు సరఫరా చేయడాన్ని సమీక్షిస్తాం’’అన్నారు. -
శంకర్ మిశ్రాను పట్టించిన సోషల్ మీడియా.. బెంగళూరులో అరెస్ట్
ఎయిరిండియా విమానంలో వృద్ద మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన కేసులో శంకర్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు విచారణ చేపట్టేందుకు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అధికారులు మిశ్రాకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు అతని కోసం దేశ వ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే లుక్ అవుట్ నోటీసులతో పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న మిశ్రా బెంగళూరులో ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ప్రత్యేక బృందాల సాయంతో బెంగళూరుకు చెందిన ఓ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దేశ రాజధానికి తరలించారు. మిశ్రాను పట్టించిన సోషల్ మీడియా లుక్ అవుట్ నోటీసులతో బెంగళూరులో తలదాచుకున్న శంకర్ మిశ్రా పోలీసులకు దొరక్కుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. క్రెడిట్ కార్డులను వినియోగించుకున్నాడు. అయితే తన స్నేహితులతో కమ్యూనికేట్ అయ్యేందుకు సోషల్ మీడియాను వినియోగించడంతో అతని ఆచూకీ లభ్యమైంది. సోషల్ మీడియా అకౌంట్స్ ఐపీవో అడ్రస్‌లను ట్రేస్ చేసిన పోలీసులు మిశ్రాను అరెస్ట్ చేశారు. (క్లిక్ చేయండి.. అమెజాన్: భారత్‌లో ఊడిన ఉద్యోగాల సంఖ్య ఇది) -
వాట్సాప్ చాట్ విడుదల, మూత్ర విసర్జన ఘటనలో శంకర్ మిశ్రాను ఇరికించారా?
ఎయిరిండియా విమానంలో మహిళపై మూత్రవిసర్జన చేసిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అధికారులు శంకర్ మిశ్రాపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో అతని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరోవైపు ఎయిరిండియా విమానం చెల్లించే నష్టపరిహారం కోసమే సదరు వృద్ధ మహిళ ఇలా చేస్తున్నట్లు మిశ్రా ఆరోపిస్తున్నారు. అందుకు ఆధారాలు ఉన్నాయంటూ శంకర్ మిశ్రా - వృద్ధ మహిళ మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌ను మిశ్రా తరుపు వాదిస్తున్న లాయర్లు విడుదల చేశారు. అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ కంపెనీ వెల్స్ ఫార్గోలో శంకర్ మిశ్రా చాప్టర్ వైస్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే విదేశాల్లో స్థిరపడ్డ మిశ్రా భారత్‌కు వచ్చేందుకు న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఎక్కాడు. అప్పటికే పూటుగా మద్యం సేవించి ఉన్న మిశ్రా విచక్షణ కోల్పోయి పక్కసీట్లో ఉన్న వృద్ధ మహిళ దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడు. అనంతరం తాను చేసింది క్షమించరాని నేరమని, పోలీసులకు ఫిర్యాదు చేయొద్దంటూ బాధితురాల్ని వేడుకున్నాడు. ఇద్దరి మధ్య సయోధ్య కుదరడంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. డబ్బుల కోసమే ఇదంతా కానీ జనవరి 4న ఎయిరిండియా సంస్థ మిశ్రాపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పీ-గేట్ వ్యవహారంలో శంకర్ మిశ్రా సైతం తన లాయర్లు ఇషానీ శర్మ, అక్షత్ బాజ్‌పాయ్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. శంకర్ మిశ్రా - మహిళ మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌ను బహిర్ఘతం చేశారు. ఆ వాట్సాప్ చాట్ వివరాల మేరకు.. నవంబర్ 28న నిందితుడు బాధితురాల్ని బట్టలు, ఇతర బ్యాగ్‌లను శుభ్రం చేసి నవంబర్ 30న డెలివరీ చేసినట్లు చెప్పారు. అంతేకాదు సదరు మహిళ ప్రయాణికురాలు మిశ్రా మూత్ర విసర్జన చేశాడనే కారణం కాదని, కేవలం ఎయిరిండియా ఎయిర్‌లైన్ చెల్లించే నష్టపరిహారం కోసమే డిసెంబర్ 20న ఫిర్యాదు చేసినట్లు మిశ్రా లాయర్లు ఆరోపిస్తున్నారు. డబ్బు కూడా పంపించాడు తాను చేసిన తప్పును సరిద్దిద్దుకునేందుకు..మహిళ కోరినట్లుగా అంటే నవంబర్ 28న మిశ్రా పేటీఎమ్ ద్వారా డబ్బు చెల్లించాడు. అయితే దాదాపు నెల రోజుల తర్వాత డిసెంబర్ 19న ఆ మహిళ కుమార్తె డబ్బును తిరిగి ఇచ్చిందని లాయర్లు పేర్కొన్నారు. ఎయిరిండియా క్యాబిన్ సిబ్బంది సమర్పించిన వాంగ్మూలాల్లో కూడా ఇద్దరి మధ్య రాజీ కుదిరిందన్న విషయాన్ని ధృవీకరించినట్లు గుర్తు చేశారు. నా ఇష్టానికి విరుద్దంగా మూత్ర విసర్జన సంఘటన తర్వాత ఎయిరిండియా సిబ్బంది మిశ్రాను తన వద్దు తీసుకువచ్చారని విమానయాన సంస్థకు చేసిన ఫిర్యాదులో బాధితురాలు తెలిపింది. శంకర్ మిశ్రాను ల్యాండింగ్‌లో వెంటనే అరెస్టు చేయాలని తాను డిమాండ్ చేసినప్పటికీ, అతనితో క్షమాపణలు చెప్పించేలా క్రూ సిబ్బంది నా ఇష్టానికి విరుద్ధంగా అతనిని నా వద్దకు తీసుకొచ్చారని మహిళ ఫిర్యాదులో రాసింది. ఏడ్చాడు.. ప్రాధేయ పడ్డాడు మూత్ర విసర్జన చేసిన వెంటనే మిశ్రా పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని కాళ్లపై పడ్డాడు. మీరు చేసింది క్షమించరాని నేరం అని మిశ్రాను అనడంతో ఏడుస్తూ ప్రాధేయపడ్డాడని, మిశ్రా చర్యతో షాక్ గురైనట్లు ఎయిరిండియాకు చేసిన ఫిర్యాదులో వెల్లడించింది. అతనిని అరెస్టు చేయాలని పట్టుబట్టడం, విమర్శలు చేయడం నాకు కష్టంగా అనిపించిందని తెలిపింది. ఇక ఆమె షూస్, డ్రైక్లీనింగ్ కోసం డబ్బులు తీసుకునేలా ఎయిర్‌లైన్ సిబ్బంది ఆమె ఫోన్ నంబర్‌ను శంకర్ మిశ్రాకు పంపింది. మిశ్రాకు ఇచ్చే డబ్బుల్ని సైతం తిరిగి వద్దని చెప్పినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.