javed
-
సంగీత ప్రియులను అలరించనున్న ‘జావేద్ అలీ’
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ సింగర్ జావేద్ అలీ తన స్వరాలతో నగరవాసులను మంత్రముగ్ధులను చేయనున్నారు. వరల్డ్ మ్యూజిక్ డే ఫెస్టివల్లో భాగంగా ఈనెల 21న నగరంలోని ప్రిజంలో జావేద్ అలీ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌ను నిర్వహించనున్నారు. హంగామా డిజిటల్ మీడియా ఎంటర్టైన్మెంట్, స్కిల్బాక్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మ్యూజిక్ షో రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుందని హంగామా డిజిటల్ మీడియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సౌమిని పాల్ తెలిపారు. జోధా అక్బర్ ఫేమ్ ’జాష్్న–ఈ–బహారా’, పుష్ప...’శ్రీవల్లి’, బజరంగీ భాయిజాన్లోని ’తు జో మిలా’ వంటి హిట్ సాంగ్స్‌తో సంగీత ప్రియులను సమ్మోహనం పరచనున్నారని, కాన్సర్ట్ టికెట్లు స్కిల్బాక్స్లో అందుబాటులో ఉన్నాయని సౌమిని అన్నారు. ఈ కాన్సర్ట్‌కు సంబంధించి.. ‘ప్రత్యక్ష ప్రదర్శన ఎప్పుడూ థ్రిల్లింగ్‌గా ఉంటుందని, హైదరాబాదీ అభిమానులను అలరించడానికి ఇదొక మంచి అవకాశమని’ సింగర్ జావేద్ అలీ ఓ ప్రకటనలో తెలిపారు. అద్భుతమైన మ్యూజిక్ నైట్ కోసం తానూ ఎదురు చూస్తున్నానని అందులో వెల్లడించారు. -
Shoaib Malik-Sana Javed Wedding: షోయబ్ మాలిక్‌తో పెళ్లి.. పాకిస్తాన్ బ్యూటీకి సైతం ఇది రెండో పెళ్లే (ఫొటోలు)
-
Shoaib Malik-Sana Javed: మరో పెళ్లి చేసుకున్న పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్.. సానియాతో బంధానికి స్వస్తి (ఫొటోలు)
-
ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం?
ఢిల్లీ: దేశ రాజధానిలో భారీ ఉగ్ర కుట్రను స్పెషల్ పోలీసులు భగ్నం చేశారు. ఈ క్రమంలో మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది జావెద్ అహ్మద్ మట్టూ అరెస్ట్ అయ్యాడు. స్పెషల్ సెల్ పోలీసులు గురువారం ఢిల్లీలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. జావెద్ జమ్ము కశ్మీర్లో ఉంటూ హిజ్బుల్ ముజాహిద్దీన్ తరఫున ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడ్డాడు.జావేద్ నుంచి ఒకపిస్టల్, మ్యాగ్జిన్లు .. దొంగలించిన ఓ కారును రికవరీ చేసుకున్నారు ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్రకు పాల్పడేందుకే జావేద్ వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. జావేద్ ప్రస్తుతం ఏ-ఫ్లస్ ఫ్లస్ లిస్ట్‌లో ఉన్న ఉగ్రవాది. పలు ఉగ్రదాడుల్లో అతని ప్రమేయం ఉంది. జావెద్ మట్టూ.. జమ్ము కశ్మీర్లో పలు ఉగ్రదాడులకు పాల్పడ్డాడు. అందుకే భద్రతా బలగాల మోస్ట్ వాంటెడ్ టాప్ టెన్ లిస్ట్‌లో ఉన్నాడు. అతనిపై రూ.10 లక్షల రివార్డు సైతం ఉంది. సోఫోర్ వాసి అయిన మట్టూ పలుమార్లు పాక్‌కు వెళ్లి వచ్చాడు. కిందటి ఏడాది గణతంత్ర దినోత్సవం నాడు.. అతని సోదరుడు సోఫోర్లో మువ్వన్నెల జెండా ఎగరేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది కూడా. -
Javed Khatri: మురికివాడలో పుట్టి.. సొంతంగా కంపెనీ.. 14.7 కోట్లకు డీల్!
డిగ్రీ పట్టా చేతిలో పడగానే ఉద్యోగం వెదుక్కుంటారు చాలామంది. జావెద్ అలా చేసి ఉంటే...అందరిలాగే ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడేమో. కాని ఈ కుర్రాడు కంపెనీ మొదలుపెట్టాడు. బంపర్‌హిట్ కొట్టి ‘భలే’ అనిపించుకున్నాడు... ముంబైలోని మురికివాడలో పుట్టి పెరిగాడు జావెద్ ఉస్మాన్ ఖాత్రీ. నాన్న కార్పెంటర్. అమ్మ గృహిణి. జావెద్ కంప్యూటర్ సైన్స్‌లో పట్టా పుచ్చుకున్న రోజు ఆ ఇంటివాళ్ల ఆనందం అంబరాన్ని తాకింది. ఈ సంతోషాన్ని రెట్టింపు చేసింది...కస్టర్డ్. చదువు పూర్తయిన తరువాత జావెద్ తన స్కూల్ఫ్రెండ్స్ ఇద్దరితో కలిసి ముంబై కేంద్రంగా ‘కస్టర్డ్’ పేరుతో ప్రాడక్ట్ డిజైన్ అండ్ టెక్నాలజీ కంపెనీ మొదలు పెట్టాడు. దీనికి తానే సీయివో. ఈ కంపెనీ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, వెబ్అప్లికేషన్ డెవలప్మెంట్, మొబైల్ డిజైన్, ఏఆర్,వీఆర్,యుఎక్స్ డిజైన్....మొదలైన విభాగాల్లో పనిచేస్తూ మంచిపేరు తెచ్చుకుంది. ‘పుస్తకం హస్తభూషణం’ అంటారు. బెన్ హరోవిజ్ రాసిన ‘ది హర్డ్ థింగ్స్ ఎబౌట్ హార్డ్థింగ్స్’ పుస్తకం తన చేతికి ‘భూషణం’ అయిందో లేదోగానీ తనను చేయిపట్టి నడిపించింది. ఈ పుస్తకంలో ఎన్నో మాటలు తనకు సక్సెస్రూట్ని చూపించాయి. వాటిలో కొన్ని... ‘వ్యాపారంలో అతి ముఖ్యమైన పాఠం....పోరాటానికి భయపడి పారిపోవడం కాదు. దాన్ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం’ ‘ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనే ఉత్సాహం కంటే, అది ఏ టైమ్‌లో ఎప్పుడు స్టార్ట్ చేయాలనే ఆలోచన ముఖ్యం’ ‘నీకు రెండు రకాల స్నేహితులు అవసరం. నువ్వు సంతోషంలో ఉన్నప్పుడు ఆ సంతోషం తమదే అనుకునేవారు. రెండోరకం...నువ్వు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక్క ఫోన్‌కాల్‌తో నీ ముందు ఉండేవారు’ ‘కొన్ని సమయాల్లో సంస్థలకు కావాల్సింది సమస్యకు పరిష్కారం కాదు. ఆ సమస్య పట్ల స్పష్టత’ ‘మీరు చేయగలిగిన వాటిపై జీరో సమయాన్ని కేటాయించండి. మీరు చేయదలిచిన వాటిపై ఎక్కువ సమయం కేటాయించండి’ ‘మనల్ని మనం ప్రశ్నించుకునేది ఒకటే...నేను ఏంచేయకూడదు అని’ ∙∙∙ ఎలక్ట్రిక్ టూ–వీలర్ మోబిలిటీ ప్లాట్పామ్ ‘ఇ–బైక్ గో’ కస్టర్డ్ కంపెనీని 14.7 కోట్లతో సొంతం చేసుకుంది. దీని ద్వారా డెలివరీ దిగ్గజాలు అమెజాన్,ఫ్లిప్‌కార్ట్, బిగ్ బాస్కెట్...మొదలైన వాటితో కలిసి పనిచేయడానికి వీలవుతుంది. ఈ నేపథ్యంలో ఎఫ్ఎంఎస్(ఫ్లిట్ మేనెజ్మెంట్ సిస్టమ్) నిర్మాణానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇ– బైక్‌గో. పెట్రోల్ ఆధారిత టూ–వీలర్స్‌తో పోల్చితే ఎలక్ట్రిక్ వాహనాలు తక్కువ అమ్మకం కావడానికి గల కారణాలలో ఒకటి...అవి ఐఓపీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్)తో కనెక్ట్ కాకపోవడం. ‘కస్టర్డ్’ అందించిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇ–బైక్‌గో తమ ఎలక్ట్రిక్ వాహనాలను స్మార్ట్ కనెక్టింగ్ వెహికిల్స్‌గా మారుస్తుంది. ఈ టెక్నాజీతో వాహనాల బాగోగులు (వెహికిల్ హెల్త్)ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి వీలవుతుంది. భవిష్యత్‌లో పర్యావరణహితమైన సాంకేతిక పరికరాలపై దృష్టి పెట్టడానికి రెడీ అవుతున్నాడు జావెద్. ‘భూగోళాన్ని రక్షించుకుందాం...నినాదంతో అడుగులు వేస్తున్న బృందం మాది. మేము రాసే ప్రతి కోడ్, మేము డిజైన్ చేసే ప్రతి పిక్సెల్, ఫీచర్....గ్రీన్ఫ్యూచర్ కోసమే’ అంటున్నాడు 28 సంవత్సరాల జావెద్ ఖాత్రీ. చదవండి: Thati Munjalu Health Benefits: తాటిముంజెలు ఎక్కువగా తింటున్నారా.. ఇందులో 80 శాతానికి పైగా! -
కూతురిని చదివించలేని దీనస్థితిలో నటుడు
Actor Javed Haider: కరోనా వల్ల అన్ని రంగాలు కుదేలైపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో షూటింగ్‌లకు సడన్ బ్రేక్ పడటంతో చాలామంది నటీనటులు రోడ్డునపడ్డారు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక కొందరు ఆత్మహత్యకు సైతం పాల్పడ్డారు. మరికొందరు తిరిగి షూటింగులు ఎప్పుడు మొదలవుతాయా? ఎప్పుడు అవకాశాలిస్తారా? అని ఎదురు చూపులతోనే కాలం వెళ్లదీశారు. నటుడు జావేద్ హైదర్ కూడా ఈ కోవలోకే వస్తాడు. ప్రస్తుతం అతడు చేతిలో చిల్లిగవ్వ లేక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. కన్నకూతురిని చదివించలేని దయనీయస్థితిలో ఉన్నాడు. తాజాగా జావేద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఇబ్బందుల గురించి ప్రస్తావించాడు. ఎనిమిదో తరగతి చదివే తన కూతురికి స్కూలు ఫీజు కూడా కట్టలేని దుస్థితిలో ఉన్నానన్నాడు. తన కూతురికి ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయని, దీనికోసం నెలకు రూ.2,500 కట్టాల్సి ఉందన్న జావేద్ మూడు నెలలుగా ఫీజు చెల్లించకపోవడంతో ఆమెను ఆన్లైన్ క్లాసుల నుంచి అర్ధాంతరంగా తొలగించారని వాపోయాడు. అప్పుడు ఆమె స్కూలుకు వెళ్లి మేనేజ్మెంట్తో మాట్లాడినప్పటికీ వారు సానుకూలంగా స్పందించలేదన్నాడు. ఎలాగోలా డబ్బులు తీసుకొచ్చి ఫీజు చెల్లించిన తర్వాతే తన కూతురిని క్లాసులకు అనుమతించారని తెలిపాడు. ఇక ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులను డబ్బు కోసం ప్రాధేయపడటం తనలాంటి వాళ్లకు సిగ్గుచేటుగా అనిపిస్తుందని జావేద్ చెప్పుకొచ్చాడు. ఒకసారి డబ్బు కోసం చేయి చాచారంటే వాళ్లను అందరూ చులకనగా చూస్తారని, ముఖ్యంగా చిత్రపరిశ్రమలో ఆర్థిక సాయం ఆశించినవారికి అవకాశాలివ్వడానికి అస్సలు ఇష్టపడరని చెప్పాడు. అందుకే ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు స్నేహితులను అడగడమో లేదా భార్య నగలను, ఇంటిని తాకట్టు పెట్టడమో చేయక తప్పదని పేర్కొన్నాడు. కాగా జావేద్ హైదర్ 1973లో వచ్చిన యాడోన్ కీ బారత్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభించాడు. అనంతరం ఎన్నో బాలీవుడ్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. -
కాంగ్రెస్ అడ్డా.. ఎగిరేది ఏ జెండా
బిహార్‌లో ముస్లింలు అత్యధికంగా ఉన్న ఏకైక నియోజకవర్గం కిషన్‌గంజ్. ఇక్కడి ఓటర్లలో 60–70 శాతం ముస్లింలే. అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించేది కూడా వారే కావడంతో ఈసారి ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, జేడీయూ తమ అభ్యర్థులుగా ముస్లింలను నిలబెట్టాయి. మరోవైపు అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని ఎంఐఎం కూడా ఈసారి బరిలో అభ్యర్థిని దింపింది. దీంతో ఇక్కడ ముక్కోణపు పోటీ అది కూడా ముస్లింల మధ్యే జరుగుతోంది. కిషన్‌గంజ్ లోక్‌సభ స్థానానికి మొత్తం 14 మంది పోటీ పడుతోంటే వారిలో ఎనమండుగురు ముస్లింలే కావడం గమనార్హం. బిహార్‌లోని 40 లోక్‌సభ స్థానాల్లో ప్రత్యేకమైన ఈ కిషన్‌గంజ్ నియోజకవర్గం పరిధిలో ఆరు అసెంబ్లీ స్థానాలు(బహదూర్‌గంజ్, ఠాకూర్ గంజ్, కిషన్‌గంజ్, కొచదమన్, అమౌర్, బైసీ) ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున డాక్టర్ జావేద్, జేడీయూ అభ్యర్థిగా మహ్మద్ అష్రఫ్, ఎంఐఎం నుంచి అక్తరుల్ హక్ ఇమామ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఇంత వరకు ఒకే ఒక్కసారి ముస్లిమేతర అభ్యర్థి లఖన్‌లాల్ కపూర్ (1967) గెలిచారు. ఏప్రిల్ 18న ఇక్కడ పోలింగ్ జరగనుంది. ‘హస్తం’ పట్టు నిలిచేనా? కిషన్‌గంజ్ కాంగ్రెస్ అడ్డాగా పేరొందింది. 1957 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఏడుసార్లు విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ అస్రరుల్ హక్ బీజేపీ అభ్యర్థి దిలీప్ కుమార్ జైస్వాల్‌పై లక్షా 94 వేల ఓట్ల రికార్డు ఆధిక్యతతో గెలిచారు. 2009లో కూడా అస్రరుల్ హక్ 90 వేలకుపైగా మెజారిటీతో గెలిచారు. హక్ గతేడాది డిసెంబర్లో గుండెపోటుతో కన్నుమూయడంతో కాంగ్రెస్ ఈసారి కిషన్‌గంజ్ ఎమ్మెల్యే జావేద్‌కు టికెట్ ఇచ్చింది. ఈ నియోజకవర్గం సంప్రదాయకంగా తమదే కాబట్టి ఈసారి కూడా తానే గెలుస్తానని కాంగ్రెస్ అభ్యర్థి జావేద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి ఉత్తరాది అసెంబ్లీ ఎన్నికల విజయాలతో ఉత్తేజం పొందిన పార్టీ శ్రేణులు నియోజకవర్గంలో సత్తా చాటేందుకు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాయి. ఎన్నికల బరిలో ఎంఐఎం ఒవైసీ నాయకత్వంలోని ఎంఐఎం రాష్ట్రంలో తొలిసారిగా ఎన్నికల్లో పోటీకి దిగుతోంది. ఎంఐఎం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అక్తరుల్ ఇమామ్ ఇక్కడ పోటీకి దిగడంతో ముక్కోణపు పోటీ అనివార్యమైంది. సీమాంచల్ ఒవైసీగా పేరు పొందిన అక్తరుల్ ఇమామ్‌కు నియోజకవర్గంలో మంచి పలుకుబడి ఉంది. బీజేపీ, కాంగ్రెస్ ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, తమ సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఆయన ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో ముస్లిం పెద్దలుగా పరిగణించే అస్రరుల్ హక్, మహ్మద్ తస్లిముద్దీన్ మరణించడంతో ఆ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు ఎంఐఎం బరిలో దిగింది. ఇమామ్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన తస్లిముద్దీన్ ఆయనను తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు. కాగా, ఎంఐఎం పోటీ వల్ల ముస్లింల ఓట్లు చీలిపోతాయని అది ఎన్డీఏ (జేడీయూ)కి లాభించే అవకాశం ఉందని స్థానిక ముస్లిం నేతలు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధిపైనే జేడీయూ ఆశలు రాష్ట్రీయ జనతాదళ్ కూడా గెలుపుపై ధీమాతో ఉంది. ఆర్జేడీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మహ్మద్ తస్లిముద్దీన్ గతంలో మూడుసార్లు(1996, 98, 2004) ఇక్కడి నుంచి గెలిచారు. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంచల్ ప్రాంతంలో (కిషన్‌గంజ్ నియోజకవర్గం ఈ ప్రాంతంలోనే ఉంది) ఉన్న 30 శాసనసభ సీట్లలో 13 అసెంబ్లీ స్థానాలు జేడీయూ గెలుచుకుంటే ఐదు బీజేపీకి దక్కాయి. ఆ ఎన్నికల్లో ఆర్జేడీ కాంగ్రెస్‌తో జతకట్టింది. ఇప్పుడది ఎన్డీఏలో ఉంది. ఈ లెక్కలను బట్టి చూస్తే నియోజకవర్గంలో మొత్తం మీద ఎన్డీఏకే పరిస్థితులు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని ఎన్నికల పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తమ హయాంలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమకు విజయాన్నందిస్తాయని జేడీయూ అభ్యర్థి అంటున్నారు. కానరాని సందడి కిషన్‌గంజ్ నియోజకవర్గం ఉన్న సీమాంచల్ ప్రాంతం భూటాన్, నేపాల్, పశ్చిమ బెంగాల్‌కు సరిహద్దులో ఉంది. దేశంలో అతి పేద జిల్లాగా గుర్తింపు పొందిన కిషన్‌గంజ్‌లో నిరుద్యోగం కీలక సమస్య. పట్టా పుచ్చుకున్న చాలామంది ఉద్యోగాల్లేక పొలం పనులు చేసుకుంటున్నారు. ‘మమ్మల్ని బాగుచేసే వారెవరూ లేరు. ఎవరొచ్చినా మా దరిద్రం తీరదు. మాకు ఉద్యోగాలు రావు. ఇక రైతుల గురించి పట్టించుకునే నాథుడే లేడు’ అనేది ఇక్కడి సామాన్య జనాభిప్రాయం. అందుకే పోలింగ్ దగ్గర పడుతున్నా నియోజకవర్గంలో ఎన్నికల హడావుడి కనిపించడం లేదు. -
ఏఐసీసీ ‘రీసెర్చ్’ కార్యదర్శిగా ఆమేర్ జావెద్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) రీసెర్చ్ విభాగం కార్యదర్శిగా హైదరాబాద్‌కు చెందిన ఆమేర్జావెద్ను నియమించారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆమోదం మేరకు ఏఐసీసీ రీసెర్చ్ విభాగాన్ని ప్రకటిస్తూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో కార్యదర్శిగా జావెద్‌ను నియమిస్తున్నట్టు పేర్కొన్నారు. జావెద్ గతంలో ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యూఐ నాయకుడిగా పనిచేశారు. ప్రస్తుతం కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, బిహార్, పశ్చిమబెంగాల్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాల ఎన్ఎస్యూఐ ఇన్చార్జిగా ఉన్నారు. -
టీవీ నటి కిరాతకం
బెంగళూరు : టీవీ సీరియళ్లకు ఏమాత్రం తీసిపోని కథ ఇది. బుల్లితెరపై నటిస్తున్న ఒక మహిళ సీరియళ్లలోని కుట్రలనే ఒంటబట్టించుకుంది. సహచరునితో అక్రమ సంబంధం పెట్టుకుని, ఆనందానికి అడ్డుగా ఉన్నాడని భర్తను పరలోకాలకు పంపించింది. ఆ మహిళను, ఆమె ప్రియుడిని నిన్న యశ్వంతపుర పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. హతుడు తుమకూరు నగరానికి చెందిన సతీష్ (36). అతని భార్య, టీవీ నటి కల్పన (27), ప్రియుడు జావేద్‌ను అరెస్టు చేశారు. సతీష నగరంలో ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో సూపర్వైజర్. భార్య కల్పన, ఇద్దరు పిల్లలతో కలిసి యశ్వంతపురలోని సుబేదార్ పాళ్యలో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా కల్పన కన్నడ సీరియల్స్‌లో నటిస్తోంది. అక్కడే పరిచయమైన జావేద్‌తో అక్రమ సంబంధం కొనసాగుతోంది. దీనిపై సతీష్ ఆమెను పలుమార్లు మందలించాడు. దాంతో ప్రియుడితో కలిసి భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. 25వ తేదిన రాత్రి భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. తిన్న వెంటనే సతీష్ మత్తులో పడిపోయాడు. ప్రియుడు జావేద్‌ను పిలిపించి ఇద్దరూ కలిసి సతీష్‌ను సుత్తితో తలపైన కొట్టిచంపారు. తన భర్తను ఎవరో వచ్చి హత్య చేశారని విలపించింది. పోలీసులు అనుమానంతో కల్పనను అదుపులోకి తీసుకుని విచారించగా, సోమవారం అసలు విషయం బయట పెట్టింది. దాంతో పోలీసుల ఈ జంటకు బేడీలు తగిలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
షహబుద్దీన్ విడుదల సమయంలో వాళ్లిద్దరూ..
జర్నలిస్టు రంజన్ హత్య కేసులో అనుమానితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు.. ఆర్జేడీ మాజీ నేత షహబుద్దీన్ విడుదల సమయంలో జైలుకు రావడం ఇప్పుడు బీహార్ లో సంచలనం సృష్టిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిందుస్తాన్ జర్నలిస్టు రంజన్ హత్య కేసులో నిందితులుగా ఉన్న మహమ్మద్ కైఫ్ అలియాస్ బంటి, మహమ్మద్ జావేద్ లు పరారీలో ఉన్నారు. షహబుద్దీన్ విడుదల సందర్భంగా ఆయన పక్కనే నిందితులు ఇద్దరూ ఉన్నట్లు మీడియా చానెళ్లలో కనిపించిన విజువల్స్ షాక్ కు గురిచేస్తున్నాయి. స్థానిక రాజకీయ నాయకులు చేస్తున్న అరాచకాలను జర్నలిస్టు రంజన్ ఎండగట్టినట్లు సమాచారం. దీంతో సంఘ విద్రోహశక్తులు ఆయన్ను బెదిరించాయని, మాట వినకపోవడంతో ఈ ఏడాది మేలో ఆయన్ను చంపేసినట్లు తెలిసింది. షహబుద్దీన్ కు పట్టుకలిగిన ప్రాంతమైన శివన్ లో జరుగుతున్న అరాచకాలపై కూడా రంజన్ ఆర్టికల్స్ రాసినట్లు తెలిసింది. షహబుద్దీన్ పై 40 క్రిమినల్ కేసులున్నాయి. దశాబ్దం కాలంగా జైలు జీవితం అనుభవించిన షహబుద్దీన్ పాట్నా హైకోర్టు బెయిలు మంజూరు చేయడంతో గత శనివారం బయటకు వచ్చారు. కైఫ్, జావేద్ లకు సంబంధించిన ఫోటో గ్రాఫ్, వీడియోలను సేకరించినట్లు పోలీసులు తెలిపారు. వీరి కోసం పోలీసులు గాలింపుచర్యలు చేపట్టినట్లు చెప్పారు. విడుదల సమయంలో కైఫ్, జావేద్ లు జైలుకు రావడంపై షహబుద్దీన్ ను విచారిస్తామని శివన్ ఎస్పీ తెలిపారు. తన భర్తను చంపిన వ్యక్తి విజువల్స్ మీడియాలో రావడంపై రంజన్ భార్య స్పందించారు. షహబుద్దీన్ తో బంటి కనిపించడం కన్నా ఆధారాలు మరేం కావాలని పోలీసులను ప్రశ్నించారు?. తాను ఇప్పటికే భయాందోళనల్లో బతుకుతున్నానని, ఇప్పుడు తన పిల్లలకు ఎలాంటి హాని జరుగుతుందేమోనని భయంగా ఉందని వాపోయారు. -
కక్షగట్టి మహిళపై కత్తితో దాడి
యాకుత్‌పురా: పాత గొడవల నేపథ్యంలో ఒంటరిగా ఉంటున్న మహిళపై ఓ యువకుడు కత్తితో దాడికి పాల్పడిన సంఘటన సోమవారం చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నారాయణ్‌బాగ్ ప్రాంతానికి చెందిన షౌకత్ అలీ, ఫరీదా బేగం (50) దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలున్నారు. కొన్ని నెలల క్రితం షౌకత్ అలీ చనిపోవడంతో ఫరీదా బేగం ఇద్దరు కూతుళ్ల వివాహం అనంతరం నారాయణ్‌బాగ్‌లోని రెహమాన్‌కు చెందిన ఇంట్లో అద్దెకుంటూ స్థానికంగా ఇళ్లలో పని చేసుకుంటూ జీవిస్తోంది. కాగా, ఫరీదా బేగం ఉంటున్న అద్దె ఇంటి పక్క గదిలో జావేద్ (22) కుటుంబం నివసిస్తోంది. ఫరీదా బేగం, జావేద్ కుటుంబాల మధ్య నీటి సమస్యపై పలుమార్లు గొడవలు తలెత్తడంతో ఇంటి యజమాని కొన్ని నెలల క్రితం జావేద్‌ను ఇల్లు ఖాళీ చేయించాడు. అందుకు కారణమైన ఫరీదాబేగంపై కక్షగట్టిన జావేద్ ఆదివారం అర్ధరాత్రి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆమె గొంతు కొసేందుకు యత్నించగా ఫరీదా ప్రతిఘటించి అరవడంతో గాయపరిచి పరారయ్యాడు. గాయాలపాలైన ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారని ఇన్స్పెక్టర్ ప్రకాశ్ రెడ్డి, ఎస్సై లక్ష్మయ్యలు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుని కోసం గాలిస్తున్నారు. -
డాన్
ట్రెండ్ సెట్టర్ కొన్ని సూపర్‌హిట్స్ విశేషాలు సరదాగా ఉంటాయి. డాన్ స్క్రిప్ట్‌ని సలీమ్ జావెద్ రాశాక దానిని దేవ్ ఆనంద్, ధర్మేంద్ర రిజెక్ట్ చేస్తే పనికి రాదేమోనని రచయితలు పక్కన పడేశారు. అప్పుడే ఇండ్రస్ట్రీలో నారిమన్ అనే కెమెరామెన్ సొంత సినిమా తీసి అప్పుల్లో పడ్డాడు. అతడికి మంచి పేరుంది. పైగా అమితాబ్, జీనత్ అమన్‌కు స్నేహితుడు. మనోజ్ కుమార్ దగ్గర శిష్యుడిగా పని చేసిన చంద్ర బారట్కు కూడా స్నేహితుడే. కష్టాల్లో ఉన్న నారిమన్‌ను గట్టెక్కిద్దామని ముగ్గురూ నిశ్చయించుకుని కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. సలీమ్ జావెద్‌ను అడిగితే మా దగ్గర ఒక సన్నాసి స్క్రిప్ట్ ఉంది కావాలంటే పట్టుకుపోండి అని ఉదారంగా ఇచ్చేశారు. అప్పటికే గాడ్ ఫాదర్ రిలీజ్ అయ్యి డాన్ వంటి మాటలు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాయి. అలా ‘డాన్’ అనే టైటిల్ రిజిస్టర్ అయ్యి ఆ తర్వాత విడుదలయ్యి సంచలనం సృష్టించింది. అంతవరకూ ఠాకూర్లు ఏలుతున్న బాలీవుడ్లో ఆ తర్వాత డాన్లు రంగ ప్రవేశం చేశారు. అక్కణ్ణుంచి తెలుగులోకి కూడా డెన్లూ డాన్లు వచ్చేశారు. డాన్‌కు జరిగినన్ని రీమేక్‌కు మరే సినిమాకు జరగలేదు. తెలుగు తమిళం హిందీ భాషల్లో దాదాపు ఆరేడు సార్లు ఈ సినిమా రీమేక్ అయ్యింది. ఎన్టీఆర్ వంటి హీరో ఈ స్క్రిప్ట్ అంగీకరించి ‘యుగంధర్’ పేరుతో నటించారంటే ఊహించుకోవచ్చు. దీనికి ఇళయరాజా సంగీతం ఇవ్వడం ఒక విశేషం అయితే ఇందులోని ‘నా పరువం నీ కోసం’ పాట హిందీలోని ‘ఏ మేర దిల్ ప్యార్ కా దీవానా’ పాటకు దీటుగా నిలవడం మరో విశేషం. -
విదేశాలకు బయలుదేరి కానరాని లోకాలకు
మెదక్ (చేగుంట): మెరుగైన జీవితం గడపాలంటే డబ్బు సంపాదించాలనుకున్న వ్యక్తి దానికోసం విదేశాలకు వెళ్లడమే సరైన మార్గం అనుకున్నాడు. అనుకున్నదే తడువు అన్ని ఏర్పాట్లు చేసుకొని సౌదీకి బయలుదేరిన వ్యక్తిని మృత్యువు లారీ రూపంలో వెంటాడింది. ఈ సంఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట గేటు వద్ద గురువారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. వివరాలు.. కరీనంగర్ జిల్లా కోరుట్లకు చెందిన జావేద్(34) సౌదీ వెళ్లడానికి తవేరా వాహనంలో శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరాడు. అతన్ని సాగనంపడానికి అతనితో పాటు కుటుంబసభ్యులు కూడా బయలుదేరారు. ఈరోజు తెల్లవారుజామున వాహనం మాసాయిపేట వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న లారీ, తవేరాను ఢీకొట్టింది. దీంతో జావేద్ అక్కడికక్కడే మృతిచెందగా.. అతని కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు.