సాక్షి, హైదరాబాద్: ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) రీసెర్చ్ విభాగం కార్యదర్శిగా హైదరాబాద్‌కు చెందిన ఆమేర్‌జావెద్‌ను నియమించారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆమోదం మేరకు ఏఐసీసీ రీసెర్చ్ విభాగాన్ని ప్రకటిస్తూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇందులో కార్యదర్శిగా జావెద్‌ను నియమిస్తున్నట్టు పేర్కొన్నారు. జావెద్ గతంలో ఆంధ్రప్రదేశ్ ఎన్‌ఎస్‌యూఐ నాయకుడిగా పనిచేశారు. ప్రస్తుతం కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, బిహార్, పశ్చిమబెంగాల్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాల ఎన్‌ఎస్‌యూఐ ఇన్‌చార్జిగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment