పాకిస్తాన్ క్రికెట్‌లో మరోసారి ముసలం నెలకొంది. పాక్ టెస్ట్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి జాసన్ గిలెస్పీ తప్పుకున్నాడు. బోర్డుతో విబేధాల కారణంగానే ఆసీస్ దిగ్గజం ఈ సంచలనం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గిలెస్పీ స్ధానాన్ని 24 గంటల వ్యవధిలోనే పాక్ క్రికెట్ బోర్డు భర్తీ చేసింది.
తమ రెడ్ బాల్ క్రికెట్ జట్టు తత్కాలిక హెడ్ కోచ్‌గా జావేద్‌ను పీసీబీ నియమించింది. "దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నుంచి పాక్ రెడ్ బాల్ క్రికెట్ జట్టు హెడ్‌కోచ్‌గా జావెద్ తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడని" పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ పర్యటలో భాగంగా ఆతిథ్య జట్టుతో పాక్ మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది.
అదే కారణమా?
కాగా హెడ్ కోచ్ గ్యారీ గ్యారీ కిరస్టెన్ వైదొలిగిన అనంతరం హెడ్ కోచ్‌గా జాసన్ గిలెస్పీని పీసీబీ నియమించింది. అయితే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో కోచింగ్ బృందం నుంచి అసిస్టెంట్ కోచ్ టిమ్ నీల్సన్‌ను పీసీబీ తప్పించింది. అతడి కాంట్రాక్ట్‌ను పొడిగించేందుకు పీసీబీ సముఖత చూపలేదు.
ఈ క్రమంలో పీసీబీ నిర్ణయంపై గిలెస్పీ అసహనం వ్యక్తం చేశాడని, అందుకే తన పదవికి రాజీనామా చేశాడని పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. కాగా గిలెస్పీ-నీల్సన్ నేతృత్వంలోనే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను పాక్ సొంతం చేసుకుంది.
చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు
Comments
Please login to add a commentAdd a comment