most wanted terrorist
-
ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం?
ఢిల్లీ: దేశ రాజధానిలో భారీ ఉగ్ర కుట్రను స్పెషల్ పోలీసులు భగ్నం చేశారు. ఈ క్రమంలో మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది జావెద్ అహ్మద్ మట్టూ అరెస్ట్ అయ్యాడు. స్పెషల్ సెల్ పోలీసులు గురువారం ఢిల్లీలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. జావెద్ జమ్ము కశ్మీర్లో ఉంటూ హిజ్బుల్ ముజాహిద్దీన్ తరఫున ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడ్డాడు.జావేద్ నుంచి ఒకపిస్టల్, మ్యాగ్జిన్లు .. దొంగలించిన ఓ కారును రికవరీ చేసుకున్నారు ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్రకు పాల్పడేందుకే జావేద్ వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. జావేద్ ప్రస్తుతం ఏ-ఫ్లస్ ఫ్లస్ లిస్ట్‌లో ఉన్న ఉగ్రవాది. పలు ఉగ్రదాడుల్లో అతని ప్రమేయం ఉంది. జావెద్ మట్టూ.. జమ్ము కశ్మీర్లో పలు ఉగ్రదాడులకు పాల్పడ్డాడు. అందుకే భద్రతా బలగాల మోస్ట్ వాంటెడ్ టాప్ టెన్ లిస్ట్‌లో ఉన్నాడు. అతనిపై రూ.10 లక్షల రివార్డు సైతం ఉంది. సోఫోర్ వాసి అయిన మట్టూ పలుమార్లు పాక్‌కు వెళ్లి వచ్చాడు. కిందటి ఏడాది గణతంత్ర దినోత్సవం నాడు.. అతని సోదరుడు సోఫోర్లో మువ్వన్నెల జెండా ఎగరేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది కూడా. -
పఠాన్‌కోట్ దాడి సూత్రదారి, ఉగ్రవాది లతీఫ్ పాకిస్థాన్‌లో హతం
భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, పఠాన్ కోట్ ఉగ్రదాడి సూత్రధారి జైషే మహ్మద్ టాప్ కమాండర్ షాహిద్ లతీఫ్ పాకిస్థాన్‌లో హత్యకు గురయ్యాడు. పంజాబ్‌లోని సియాల్ కోట్లో బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను కాల్చి చంపారు. నూర్ మదీనా మసీద్‌లో ఫజర్ ప్రార్థన అనంతరం బయటకు రాగా.. బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు లతీఫ్‌తోపాటు మరో ఇద్దరు సహచరులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో లతీఫ్తోపాట మరో ఉగ్రవాది అక్కడికక్కడే మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం కాల్పులు జరిపిన అగంతకులు సంఘటన స్థలం నుంచి పారిపోయారు. ఈ దాడిపై పాక్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పఠాన్ కోట్ దాడి వ్యూహకర్త షామిద్ లతీఫ్(41) ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు లాంచింగ్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు. 2016 జనవరి 2న జరిగిన పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడికికి మాస్టర్‌మైండ్ లతీఫే. ఈ దాడిలో తొమ్మిది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే పఠాన్‌కోట్‌లో బాంబు పేలుడు జరిగి మరో అధికారి మరణించారు. తరువాత ఈ దాడికి పాల్పడిన అయిదుగురు ముష్కరులను భారత బలగాలు మట్టుబెట్టాయి. అయితే ఈ పేలుళ్లకు సూత్రధాని షాహిద్ లతీఫ్ అంటూ అప్పట్లో దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. అతడు పాక్‌లోని సియాల్కోట్ నుంచే ఈ దాడికి పథకం వేసి.. ఐదుగురు ఉగ్రవాదులను పఠాన్‌కోట్‌పై దాడికి పంపినట్లు దర్యాప్తు నివేదికలో తేలింది. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ లతీఫ్‌ను మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఇక ఇటీవల పాక్‌లో వరుసగా జరుగుతున్న ఉగ్రవాదుల హత్యలు ఆ దేశాన్ని కలవరపెడుతున్నాయి. ఈ ఏడాదిలో వేర్వేరు ఉగ్రవాద సంస్థలకు చెందిన అయిదుగురు టాప్ కమాండర్లు గుర్తుతెలియని వ్యక్తుల కాల్పుల్లో మరణించారు. లతీఫ్‌ను 1994 నవంబర్ ఉగ్రవాదం, చట్ట విరుద్ధ కార్యాకలాపాల నివారణ చట్టం (UAPA)ప్రకారం జమ్మూకశ్మీర్‌లో అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 16 ఏళ్ల పాటు మసూద్ అజార్‌తో కలిసి కోట్ బల్వాల్లోని జైలులో శిక్షననుభవించాడు. అనంతరం 2010లో వాఘా ద్వారా పాకిస్థాన్‌కు అప్పగించారు. 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను హైజాక్ చేసిన కేసులో లతీఫ్ నిందితుడిగా ఉన్నాడు. చదవండి: యూదుల ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది? జనాభా ఎంత? -
ఢిల్లీలో మోస్ట్ వాంటెడ్ ఐసిస్ ఉగ్రవాది అరెస్ట్
న్యూడిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అనుమానిత ఐఎస్ఐఎస్ ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐసిస్ టెర్రరిస్ట్ మహమ్మద్ షానవాజ్ అలియాస్ సైఫీ ఉజామాతోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం సోమవారం అరెస్టు చేసింది. కాగా సైఫీ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లిస్ట్‌లో ఉన్నారు. అతని వివరాలు వెల్లడించిన వారికి మూడు లక్షల రివార్డు కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అనుమానిత ఉగ్రవాదులు దేశ రాజధానిలో ఉగ్రదాడికి ప్లాన్ చేసినట్లు పక్కా సమాచారం రావడంతో ఇతడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన షానవాజ్ పూణె ఐసిస్ మాడ్యుల్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. ఇతడు ఢిల్లీకి చెందిన వాడు కాగా పూణె పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. ఢిల్లీలో తలదాచుకున్నట్లు తెలియడంతో చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఐఈడీ తయారీకి ఉపయోగించే ద్రవ రసాయనంతో సహా పలు పేలుడు సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐసిస్ అనుమానితులుగా అరెస్టు చేసిన ఇద్దరు వ్యక్తులతో కలిసి షానవాజ్‌ను ప్రస్తతం పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో ఐసిస్ ఉగ్రవాదుల గురించి మరిన్ని విషయాలు తెలియనున్నాయి. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు, ఎన్ఐఏ అధికారులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. కాగా దేశంలోని అనేక టెర్రర్ మాడ్యూల్స్‌ను అణిచివేసేందుకు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఎన్ఐఏ అధికారులతో కలిసి పనిచేస్తోంది. షానవాజ్‌తో పాటు మరో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులైన రిజ్వాన్ అబ్దుల్ హాజీ అలీ, అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలియాస్ డయాపర్వాలా, తల్హా లియాకత్ ఖాన్ గురించి సమాచారం ఇస్తే ఒక్కొక్కరికి రూ.3 లక్షల నగదు బహుమతిని ఇటీవలె ఎన్ఐఏ ప్రకటించింది. మహారాష్ట్రలోని పూణెలో ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్కు చెందిన మాడ్యూల్తో ఈ నలుగురికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. చదవండి: భారత్‌లో అఫ్గాన్ ఎంబసీ మూసివేత -
అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను భారత్‌కు అప్పగిస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌లు భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌లు. వీరిద్దరు పాకిస్థాన్‌లో తలదాచుకున్నారని ప్రపంచానికి తెలిసిన విషయమే. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటర్‌పోల్ అసెంబ్లీ సమావేశంలో వీరిద్దరి గురించి ఓ ప్రశ్న పాకిస్థాన్ హోంల్యాండ్ ఉన్నతాధిరి మోహ్సిన్ భట్‌కు ఎదురైంది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అయిన దావూద్ ఇబ్రహీం, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌లను భారత్‌కు అప్పగిస్తారా? అని ఏఎన్ఐ వార్తా సంస్థ ప్రతినిధి భట్‌ను అడిగారు. అయితే ఆయన మాత్రం సమాధానాన్ని దాటవేశారు. ఈ విషయం స్పందించేందుకు నిరాకరించారు. ఒక్కమాట కూడా మాట్లాడుకుండా మౌనం వహించారు. ఢిల్లీలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు నాలుగు రోజులపాటు జరుగుతున్న ఇంటర్‌పోల్ అసెంబ్లీ సమావేశానికి 195 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఆయా దేశాల మంత్రులు, సెక్యూరిటీ ఉన్నతాధికారులు వచ్చారు. పాక్ నుంచి ఆ దేశ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ) డెరక్టర్ జనరల్ మోహ్సిన్ భట్‌తో పాటు మరో అధికారి వచ్చారు. #WATCH | Pakistan's director-general of the Federal Investigation Agency (FIA) Mohsin Butt, attending the Interpol conference in Delhi, refuses to answer when asked if they will handover underworld don Dawood Ibrahim & Lashkar-e-Taiba chief Hafiz Saeed to India. pic.twitter.com/GRKQWvPNA1 — ANI (@ANI) October 18, 2022 ఇంటర్‌పోల్ అసెంబ్లీ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఈ సమావేశానికి భారత్ ఆతిథ్యమిస్తోంది. చివరిసారిగా 1997లో భారత్‌లో ఈ కార్యక్రమం జరిగింది. చదవండి: మైనారిటీలో రాజస్థాన్ సర్కార్.. త్వరలో విశ్వాసపరీక్ష! -
అల్ కాయిదా నంబర్ 2 హతం
వాషింగ్టన్: అంతర్జాతీయ ఉగ్ర సంస్థ అల్‌కాయిదాను అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చావుదెబ్బ కొట్టాయి. అల్‌కాయిదాలో నంబర్–2గా చెలామణి అవుతున్న అబూ మొహమ్మద్ అల్–మాస్రీని ఈ ఏడాది ఆగస్టులో హతమార్చాయి. రహస్యంగా జరిగిన ఈ జాయింట్ ఆపరేషన్ వివరాలను తాజాగా నలుగురు అమెరికా అధికారులు వెల్లడించారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో దాక్కున్న అల్–మాస్రీ జాడను తొలుత అమెరికా కనిపెట్టింది. ఈ సమాచారాన్ని ఇజ్రాయెల్‌కు చేరవేసింది. దీంతో ఇజ్రాయెల్ నిఘా సంస్థకు చెందిన కిడోన్ దళం రంగంలోకి దిగింది. టెహ్రాన్‌లో నక్కిన అల్ మాస్రీని విజయవంతంగా మట్టుబెట్టింది. ఆగస్టు 7న పూర్తయిన ఈ ఆపరేషన్‌లో మాస్రీ కూతురు మరియం కూడా చనిపోయింది. మరియం మరెవరో కాదు బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్‌లాడెన్ భార్యే. హమ్జాను అమెరికా దళాలు పాక్–అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో ఉండగా గత ఏడాది హతమార్చాయి. 1998లో కెన్యా, టాంజానియాలోని అమెరికా రాయబార కార్యాలయాలపై జరిగిన బాంబు దాడుల్లో అల్–మాస్రీ కీలకపాత్ర పోషించాడు. అప్పటినుంచి అమెరికా నిఘా సంస్థ ఎఫ్‌బీఐ అతడిని మోస్ట్‌వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఇప్పటికే అల్‌కాయిదా చీఫ్ అల్ జవహరీ జాడ గత కొన్ని నెలలుగా తెలియడం లేదు. -
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల కోసం వేట
కశ్మీర్ : మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు, హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ రియాజ్ నైకూను మే 6న భారత బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. దీంతో హిజ్బుల్ కొత్త కమాండర్‌గా సైఫుల్లాను నియమించారు. దీని గురించి సమాచారం అందుకున్న భారత సైనికులు సైఫుల్లాతో పాటు కశ్మీర్లో కరడుగట్టిన ఉగ్రవాదులుగా పేరొందిన 10 మందిని హతం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆపరేషన్ చేపట్టారు. కాగా అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌లో జమ్ము కశ్మీర్లో 28 ఉగ్రవాదులను సైన్యం మట్టికరిపించింది. అలాగే ఎల్వోసీ వద్ద ఇప్పటివరకు 64 మంది ముష్కరులను హతం చేసింది. 2018లో 215, 2019లో 152 మంది ఉగ్రవాదులను భారత సైనికులు చంపేశారు. ఇదిలా వుండగా తాజాగా కశ్మీర్ లోయలో టాప్ టెన్ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు అధికారులు సంసిద్ధమయ్యారు. (కశ్మీర్లో 64 మంది ఉగ్రవాదుల ఏరివేత) టాప్ టెన్ ఉగ్రవాదులు: వారు పని చేసే సంస్థలు ► సైఫుల్లా (కోడ్ నేమ్: ఘజీ హైదర్ లేదా డాక్టర్ సాహిబ్)- హిజ్బుల్ ముజాహిద్దీన్ ► మహ్మద్ అష్రఫ్ ఖాన్ (కోడ్ నేమ్: అష్రఫ్ మాల్వీ, మాన్సూర్ ఉల్ ఇస్లాం) - హిజ్బుల్ ముజాహిద్దీన్ ► జునైద్ సెహ్రి- హిజ్బుల్ ముజాహిద్దీన్ ► మహ్మద్ అబ్బాస్ షైఖ్ (కోడ్ నేమ్: తురబీ మాల్వీ) - హిజ్బుల్ ముజాహిద్దీన్ ► జాహిద్ జర్గార్ - జైషే మహమ్మద్ ► షాకుర్- లెట్ ► ఫైసల్ భాయ్ - జైషే మహమ్మద్, ఏ ప్లస్ ప్లస్ కేటగిరీలో ఉన్న కరుడుగట్టిన ఉగ్రవాది ► షేరజ్ ఎల్ లోన్ (కోడ్ నేమ్: మాల్వీ) ► సలీమ్ పరాయ్ - జైషే మహమ్మద్ ► ఓవైస్ ముల్లిక్ - లెట్ -
సర్జికల్ స్ట్రైక్ 2 : మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు యూసఫ్ అజర్ హతం
-
మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది హతం
శ్రీనగర్: కశ్మీర్లో లష్కరేతోయిబా కార్యకలాపాలకు సూత్రధారిగా ఉన్న మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది మెహ్రాజుద్దీన్ బంగ్రూ సహా ముగ్గురిని భద్రతాబలగాలు బుధవారం మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల కదలికలపై పక్కా సమాచారం అందుకున్న సీఆర్పీఎఫ్, పోలీసుల సంయుక్త బృందం బుధవారం తెల్లవారుజామున శ్రీనగర్‌లోని ఫతేహ్‌కదల్ ప్రాంతంలో ఉగ్రమూకలు నక్కిన ఇంటిని చుట్టుముట్టింది. అనంతరం ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించగా ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ సందర్భంగా ఉగ్రమూకల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ కమల్ కిశోర్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇక ఎన్కౌంటర్లో మెహ్రాజుద్దీన్ బంగ్రూతో పాటు ఫహద్ వజా, రయీస్ అబ్దుల్లాలను బలగాలు మట్టుబెట్టాయి. ఈ విషయమై కశ్మీర్ పోలీస్‌శాఖ ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ) స్వయం ప్రకాశ్ పానీ మాట్లాడుతూ.. శ్రీనగర్‌లో జరిగిన పలు ఉగ్రదాడులు, ఆయుధాల దొంగతనం, బ్యాంకుల లూటీతో పాటు లష్కరేకు దాడులకు బంగ్రూ కీలక సూత్రధారిగా వ్యవహరించాడని తెలిపారు. -
ఏ-1ఎక్కడ?
►రియాజ్ భత్కల్ నేతృత్వంలోనే సాగిన ‘రెండు ఆపరేషన్స్’ ►ఇప్పటికీ చిక్కని ప్రధాన నిందితుడు ►దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో శిక్షలు ఖరారు ►2008 నుంచి పాకిస్థాన్‌లో తలదాచుకున్న ఉగ్రవాది రియాజ్ భత్కల్... 2007 నాటి గోకుల్ చాట్, లుంబినీపార్క్ , 2013 నాటి దిల్సుఖ్నగర్ పేలుళ్లకు సూత్రధారిగా, ఈ కేసుల్లో ప్రధాన నిందితుడిగా (ఏ–1) ఉన్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లో నమోదైన విధ్వంసాల కేసుల్లో ఇతని పేరు ప్రముఖంగా ఉంది. ఉగ్రవాదం ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం సైతం నిర్వహించాడు. దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసు విచారణ పూర్తయి దోషులకు శిక్ష సైతం పడింది. 2007 నాటి జంట పేలుళ్ల కేసు విచారణ దశలో ఉంది. ఇప్పటికీ ఏ–1 చిక్కలేదు. అసలు ఎవరీ రియాజ్, ఉగ్రవాదిగా ఎలా మారాడు? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.. సాక్షి, సిటీబ్యూరో: రియాజ్ భత్కల్ అసలు పేరు రియాజ్ అహ్మద్ షహబంద్రి. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా భత్కల్ గ్రామంలో 1976 మే 19న పుట్టాడు. ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు, స్మగ్లింగ్ వ్యవహారాలు ఎక్కువ. ఆ ప్రభావంతోనే నేరబాట పట్టాడు. వీరి కుటుంబం కొన్నాళ్ల పాటు మహారాష్ట్రలోని ముంబైలో నివసించింది. ఇతనికి ఆదినుంచీ డబ్బుపైన ఆశ ఎక్కువే. ఆ యావలోనే నేరబాట పట్టి ముంబై గ్యాంగ్‌స్టర్ ఫజల్–ఉర్–రెహ్మాన్ ముఠాలో చేరాడు. బెదిరింపులు, కిడ్నాప్‌లు తదితర వ్యవహారాల ద్వారా డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. ఈ మేరకు ఇతనిపై కోల్‌కతా, ముంబయి, కర్ణాటకల్లో అనేక కేసులు నమోదైనా... ఒక్కసారీ అరెస్టు కాలేదు. ఈ గ్యాంగు నుంచి బయటకు వచ్చిన తరవాత కుర్లా ప్రాంతంలో ‘ఆర్ఎన్’ పేరుతో కొత్తముఠా కట్టి కొంతకాలం వ్యవహారాలు సాగించాడు. అక్కడ ఉండగా స్థానికంగా ఓ ప్రార్థన స్థలంతో పాటు ప్రత్యేక కార్యక్రమాలకు తరచు వెళ్లేవాడు. ఆ ప్రోద్బలంతో నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)లో కొంతకాలం పని చేశాడు. అప్పడికే ఇతని అన్న ఇక్బాల్ భత్కల్ పాక్ ప్రేరేపిత లష్కరేతోయిబాతో సంబంధాలు పెట్టుకోవడంతో అతని ద్వారా ఉగ్రవాదం వైపు మళ్లారు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, రెండో కమాండ్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నాడు. ఆసిఫ్ రజా కమెండో ఫోర్స్ పేరుతో ఉగ్రవాద సంస్థను ప్రారంభించిన కోల్‌కతా వాసి అమీర్ రజాఖాన్ నుంచి అందే ఆదేశాల ప్రకారం చేపట్టాల్సిన విధ్వంసాలకు పేలుడు పదార్థాలు, మనుషులు, డబ్బు ఏర్పాటు చేస్తుంటాడు. ధనార్జన కోసం రియల్టర్ అవతారం... జిహాద్ పేరుతో యువకులను ఉగ్రవాదం వైపు నడిపించి వారి భవితను భత్కల్ బుగ్గిపాలు చేశాడు. తాను మాత్రం ఉగ్రవాదం పేరు చెప్పి వసూలు చేసిన నిధులను భారీగా దారిమళ్లించి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించాడు. మరిన్ని నిధుల కోసం పూణేకు చెందిన వ్యాపారులను కిడ్నాప్ చేయాలని కుట్రపన్నాడు. విధ్వంసాలకు శిక్షణ, పేలుడు పదార్థాలు కొనుగోలు, ఆయుధాల సేకరణ పేరుతో కొన్ని విదేశీ సంస్థల నుంచి హవాలా ద్వారా భారీగా నిధులు సమీకరించాడు. అయితే వాటిని తన సొంత ‘ఖాతా’ల్లోకి మార్చుకుంటూ మంగుళూరు సమీపంలోని థోయ్యత్తు, ఉల్లాల్ పరిసరాల్లో భారీగా రియల్ ఎస్టేట్ వెంచర్లు నిర్వహించాడు. హైదరాబాద్, జైపూర్, బెంగళూరు, అహ్మదాబాద్ పేలుళ్ల నిమిత్తం అంటూ విదేశీ సంస్థల నుంచి రూ.లక్షల్లో నిధులు సమీకరించాడు. భత్కల్ ఇండియన్ ముజాహిదీన్‌లో సెకండ్ కమాండ్ ఇన్చార్జి హోదాలో ఉండటంతో నిధులపై అజమాయిషీ ఇతనిదే. దీంతో జమాఖర్చులు అడిగే సాహసం మాడ్యుల్లోని ఎవరూ చేయలేకపోయారు. ‘ఐఎం’ గుట్టు బయటపడింది ఇతని వల్లే... ఐఎంలో కీలక వ్యక్తిగా ఉన్న రియాజ్ భత్కల్ అనేక పేలుళ్ల సందర్భంలో కొన్ని ఈ–మెయిల్స్ రూపొందించి మీడియా సంస్థలకు పంపాడు. ఇలా చేయడాన్ని మరో ఉగ్రవాదైన సాదిక్ షేక్ పూర్తిగా వ్యతిరేకించాడు. దీని వల్ల తమ ఉనికి బయటపడుతుందని, దర్యాప్తు సంస్థలకు పట్టుబడే అవకాశం ఉందని వాదిస్తూ వచ్చాడు. తమ లక్ష్యం నెరవేరాలంటే సాధ్యమైనంత ఎక్కువ కాలం తెరవెనుకే ఉండటం మంచిదని రియాజ్‌తో చెప్పాడు. అయితే ఈ మాటలను రియాజ్ పెడచెవిన పెట్టాడు. ప్రతి విధ్వంసానికీ అత్యంత పకడ్బందీగా వ్యూహరచన చేసి కథనడిపేది తామైతే... చివరకు పేరు మాత్రం సీమాంతర ఉగ్రవాద సంస్థలకు రావడం రియాజ్‌కు రుచించలేదు. తమ సంస్థ పేరు బయటకు వచ్చి ప్రచారం జరిగితే నిధులు సైతం భారీగా వస్తాయంటూ సాదిక్‌తో వాదనకు దిగాడు. చివరకు తన పంతం నెగ్గించుకుని ప్రతి విధ్వంసానికీ ముందు ఈ–మెయిల్ పంపడం ప్రారంభించాడు. ఈ మెయిల్స్ వచ్చిన ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తు చేసిన అధికారులు ఐఎంకు సంబంధించిన కొన్ని వివరాలు సేకరించారు. అలా ప్రారంభమైన దర్యాప్తుతోనే 2008లో ఐఎం గుట్టురట్టయింది. దీంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన రియాజ్... ప్రస్తుతం పాకిస్థాన్‌లోని కరాచీ సమీపంలో ఉన్న డిఫెన్స్ ఏరియాలో తలదాచుకుంటున్నాడు. ముష్కరులను వెంటనే ఉరితీయాలి అమాయకులను పొట్టన పెట్టుకున్న ముష్కరులను వెంటనే ఉరితీయాలి. కాలయాపన చేయకుండా శిక్ష అమలు చేస్తేనే అమరుల ఆత్మ శాంతిస్తుంది. ఆనాటి ఘటనలో గాయపడిన క్షతగాత్రులను ప్రభుత్వం ఆదుకోవాలి. – పి.రామకృష్ణ, : పేలుళ్లలో గాయపడ్డ బాధితుడు పేలుళ్లలో గాయపడ్డ బాధితుడు శిక్షిస్తేనే చట్టాలపై నమ్మకం కలుగుతుంది...చట్టాలపై ప్రజల్లో నమ్మకం కలగాలంటే తీవ్రవాదులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలి. వారు శిక్ష నుంచి బయటపడకుండా చూస్తేనే ప్రజలు హర్షిస్తారు. బాంబు పేలుడు ఘటన జరిగిన ప్రదేశానికి ఎప్పుడు వెళ్లినా ఒళ్లు జలదరిస్తుంది. – సుధాకర్‌రెడ్డి : ప్రత్యక్ష సాక్షి, దిల్సుఖ్నగర్ -
పాకిస్ధాన్ నుంచి ఈమెయిల్స్ ద్వారా యాసిన్‌కు సూచనలు
-
ఉగ్రవాది యాసిన్ భత్కల్ అరెస్ట్
-
మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది యాసిన్ భత్కల్ అరెస్ట్
ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది యాసిన్ భత్కల్(30) ఎట్టకేలకు పట్టుబడ్డాడు. నేపాల్ సరిహద్దులో అతన్ని అరెస్ట్ చేసినట్ట్టు సమాచారం. ఢిల్లీ, కర్ణాటక పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో అతడు పట్టుబడ్డాడు. అతడిని ఎక్కడికి తరలించాలనే దానిపై ఇంటెలిజెన్స్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు నిర్ణయం తీసుకోనున్నాయి. మనదేశంలో జరిగిన పలు బాంబు పేలుళ్లలో భత్కల్ ప్రధాన నిందితుడు.మన రాష్ట్రంలో హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంటపేలుళ్లలో భత్కల్ కీలక సూత్రధారి. గోకుల్ ఛాట్, లుంబినీపార్క్ బాంబు పేలుళ్ల వెనుక కూడా ఇతడి హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. భత్కల్ తలపై ప్రభుత్వం పది లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది. 2010లో పుణెలో జర్మన్ బేకరీ, బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో భత్కల్ ప్రధాన నిందితుడు. కర్ణాటక చెందిన యాసిన్ భత్కల్ తన సోదరుడు రియాజ్, అబ్దుల్ సుబాన్ ఖురేషీతో కలిసి 2008లో ఇండియన్ ముజాహిద్దీన్ స్థాపించాడు. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే ఇ తోయిబా అండదండలతో పనిచేస్తున్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) భావిస్తోంది.