కశ్మీర్ : మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు, హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ రియాజ్ నైకూను మే 6న భారత బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. దీంతో హిజ్బుల్ కొత్త కమాండర్‌గా సైఫుల్లాను నియమించారు. దీని గురించి సమాచారం అందుకున్న భారత సైనికులు సైఫుల్లాతో పాటు కశ్మీర్‌లో కరడుగట్టిన ఉగ్రవాదులుగా పేరొందిన 10 మందిని హతం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆపరేషన్ చేపట్టారు. కాగా అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌లో జమ్ము కశ్మీర్‌లో 28 ఉగ్రవాదులను సైన్యం మట్టికరిపించింది. అలాగే ఎల్‌వోసీ వద్ద ఇప్పటివరకు 64 మంది ముష్కరులను హతం చేసింది. 2018లో 215, 2019లో 152 మంది ఉగ్రవాదులను భారత సైనికులు చంపేశారు. ఇదిలా వుండగా తాజాగా కశ్మీర్ లోయలో టాప్ టెన్ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు అధికారులు సంసిద్ధమయ్యారు. (కశ్మీర్‌లో 64 మంది ఉగ్రవాదుల ఏరివేత)
టాప్ టెన్ ఉగ్రవాదులు: వారు పని చేసే సంస్థలు
► సైఫుల్లా (కోడ్ నేమ్: ఘజీ హైదర్ లేదా డాక్టర్ సాహిబ్)- హిజ్బుల్ ముజాహిద్దీన్
► మహ్మద్ అష్రఫ్ ఖాన్ (కోడ్ నేమ్: అష్రఫ్ మాల్వీ, మాన్సూర్ ఉల్ ఇస్లాం) - హిజ్బుల్ ముజాహిద్దీన్
► జునైద్ సెహ్రి- హిజ్బుల్ ముజాహిద్దీన్
► మహ్మద్ అబ్బాస్ షైఖ్ (కోడ్ నేమ్: తురబీ మాల్వీ) - హిజ్బుల్ ముజాహిద్దీన్
► జాహిద్ జర్గార్ - జైషే మహమ్మద్
► షాకుర్- లెట్
► ఫైసల్ భాయ్ - జైషే మహమ్మద్, ఏ ప్లస్ ప్లస్ కేటగిరీలో ఉన్న కరుడుగట్టిన ఉగ్రవాది
► షేరజ్ ఎల్ లోన్ (కోడ్ నేమ్: మాల్వీ)
► సలీమ్ పరాయ్ - జైషే మహమ్మద్
► ఓవైస్ ముల్లిక్ - లెట్
Comments
Please login to add a commentAdd a comment