Saifullah
-
హిజ్బుల్ చీఫ్ సైఫుల్లా హతం
శ్రీనగర్: మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సైఫుల్లా మిర్ అలియాస్ డాక్టర్ సైఫుల్లా(31)భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. ఈ ఏడాది మేలో హిజ్బుల్ చీఫ్‌గా ఉన్న రియాజ్ నైకూ భద్రతా బలగాల చేతుల్లో మృతి చెందడంతో సైఫుల్లా ఆ బాధ్యతలు చేపట్టాడు. ‘సైఫుల్లా మృతి మామూలు ఘటన కాదు. పోలీసులకు, భద్రతా బలగాలకు దక్కిన భారీ విజయం’అని ఎన్కౌంటర్ ప్రాంతాన్ని పరిశీలించిన కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ అభివర్ణించారు. పుల్వామా జిల్లా మలంగ్‌పోరాకు చెందిన ఇతడు మెడికల్ ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసిన ఇతడిని డాక్టర్ అని పిలుస్తుంటారు. 2014 అక్టోబర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్‌లో చేరాడు. కశ్మీర్ లోయలో భద్రతాబలగాలపై జరిగిన పలు ఘటనలకు సూత్రధారిగా ఉన్న సైఫుల్లా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. సైఫుల్లా ఓ ఇంట్లో దాగున్నాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆదివారం ఉదయం శ్రీనగర్ శివారులోని రంగ్రేత్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ చేపట్టాయి. అదే సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు వారి పైకి కాల్పులకు దిగగా బలగాలు దీటుగా స్పందించాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది చనిపోగా, మరొకరు పోలీసులకు పట్టుబడ్డాడు. మృతుడిని సైఫుల్లాగా గుర్తించారు. అతని వద్ద ఆయుధాలు, మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. -
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల కోసం వేట
కశ్మీర్ : మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు, హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ రియాజ్ నైకూను మే 6న భారత బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. దీంతో హిజ్బుల్ కొత్త కమాండర్‌గా సైఫుల్లాను నియమించారు. దీని గురించి సమాచారం అందుకున్న భారత సైనికులు సైఫుల్లాతో పాటు కశ్మీర్లో కరడుగట్టిన ఉగ్రవాదులుగా పేరొందిన 10 మందిని హతం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆపరేషన్ చేపట్టారు. కాగా అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌లో జమ్ము కశ్మీర్లో 28 ఉగ్రవాదులను సైన్యం మట్టికరిపించింది. అలాగే ఎల్వోసీ వద్ద ఇప్పటివరకు 64 మంది ముష్కరులను హతం చేసింది. 2018లో 215, 2019లో 152 మంది ఉగ్రవాదులను భారత సైనికులు చంపేశారు. ఇదిలా వుండగా తాజాగా కశ్మీర్ లోయలో టాప్ టెన్ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు అధికారులు సంసిద్ధమయ్యారు. (కశ్మీర్లో 64 మంది ఉగ్రవాదుల ఏరివేత) టాప్ టెన్ ఉగ్రవాదులు: వారు పని చేసే సంస్థలు ► సైఫుల్లా (కోడ్ నేమ్: ఘజీ హైదర్ లేదా డాక్టర్ సాహిబ్)- హిజ్బుల్ ముజాహిద్దీన్ ► మహ్మద్ అష్రఫ్ ఖాన్ (కోడ్ నేమ్: అష్రఫ్ మాల్వీ, మాన్సూర్ ఉల్ ఇస్లాం) - హిజ్బుల్ ముజాహిద్దీన్ ► జునైద్ సెహ్రి- హిజ్బుల్ ముజాహిద్దీన్ ► మహ్మద్ అబ్బాస్ షైఖ్ (కోడ్ నేమ్: తురబీ మాల్వీ) - హిజ్బుల్ ముజాహిద్దీన్ ► జాహిద్ జర్గార్ - జైషే మహమ్మద్ ► షాకుర్- లెట్ ► ఫైసల్ భాయ్ - జైషే మహమ్మద్, ఏ ప్లస్ ప్లస్ కేటగిరీలో ఉన్న కరుడుగట్టిన ఉగ్రవాది ► షేరజ్ ఎల్ లోన్ (కోడ్ నేమ్: మాల్వీ) ► సలీమ్ పరాయ్ - జైషే మహమ్మద్ ► ఓవైస్ ముల్లిక్ - లెట్ -
అనితను ఓడిస్తామని హెచ్చరిక..
-
సిట్టింగ్‌లకు వ్యతిరేకంగా.. అసంతృప్తుల పోరు..
సాక్షి, అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు టీడీపీ అధిష్టానానికి మింగుడు పడటం లేదు. ఓ వైపు డేటా చోరీ ఆరోపణలు.. మరోవైపు సొంత పార్టీలో విభేదాలు టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మెజారిటీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వద్దంటూ అసంతృప్త నేతలు ఆందోళనకు దిగుతుండటంతో.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. ఇందుకోసం అమరావతిలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయినా కూడా నేతలు తమ అసంతృప్తిని చంద్రబాబు వద్ద గట్టిగానే వినిపిస్తున్నట్టుగా సమాచారం. తాజాగా పాయకరావుపేట, అనంతపురంలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు తిరుగుబావుట ఎగరవేశారు. అనితను ఓడిస్తామని హెచ్చరిక.. పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు వ్యతిరేకంగా భారీ సంఖ్యలో అసమ్మతి నేతలు తమ గళాన్ని వినిపిస్తున్నారు. అనిత అవినీతిపై నియోజకవర్గం నేతలు రెండు పేజీల లేఖను సిద్ధం చేశారు. ఈ లేఖను వారు చంద్రబాబు నాయుడుకు అందజేయనున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అనిత పాదయాత్రను అడ్డుకున్న నేతలు.. ఆమెకు వ్యతిరేకంగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు. అనితకు ఎమ్మెల్యే సీటు ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. పాయకరావుపేట టీడీపీ సమీక్షా సమావేశంలో అనిత అవినీతిపై నిలదీయడానికి అసంతృప్త నేతలు సిద్దమవుతున్నారు. టీడీపీకి రాజీనామా యోచనలో మాజీ ఎంపీ.. సాక్షి, అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనంపురం ఎమ్మెల్యే టికెట్ తిరిగి ప్రభాకర్ చౌదరికి ఖరారు చేయడంతో స్థానిక టీడీపీ అసమ్మతి జ్వాలలు భగ్గుమన్నాయి. ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వడాన్ని మాజీ ఎంపీ సైఫుల్లా వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అమరావతి నుంచి అనంతపురం బయలుదేరిన సైఫుల్లా వర్గం నేతలు.. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. సైఫుల్లాతో పాటు, మాజీ మున్సిపల్ చైర్మన్ నూరమ్ మహ్మద్, పార్టీ సీనియర్ నాయకులు జయరాం నాయుడు, జకీవుల్లా, లక్ష్మీపతి, 15 మంది కార్పొరేటర్లు టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. -
ఇల్లు వదిలి వెళ్లిపోయి.. ఉగ్రవాదులయ్యారు!
మధ్యప్రదేశ్‌లో ఉజ్జయిని ప్యాసింజర్ రైల్లో పేలుడుతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. ఆ కేసుకు సంబంధించి సైఫుల్లా అనే వ్యక్తిని లక్నోలో పోలీసులు సుదీర్ఘ ఎన్కౌంటర్లో హతమార్చారు. అతడి బంధువులు, స్నేహితులలో ముగ్గురిని అరెస్టు చేశారు. వీళ్లందరికీ ఒకే రకమైన నేపథ్యం ఉంది. అందరూ తల్లిదండ్రుల మీద కోపంతో ఇళ్లు వదిలి వెళ్లిపోయినవాళ్లే. తాము పెద్ద ఉద్యోగాలు చేస్తున్నామని తమవాళ్లను మభ్యపెట్టినవాళ్లే. వీళ్లంతా కలిసి ఉగ్రవాదం బాట పట్టారు. ఉగ్రవాద సంస్థల పంచన చేరి.. దేశద్రోహానికి ఒడిగట్టారు. అందుకే ఎన్కౌంటర్లో మరణించిన సైఫుల్లా మృతదేహాన్ని తీసుకోడానికి అతడి తండ్రి సర్తాజ్ ఖాన్ నిరాకరించారు. దేశానికి వ్యతిరేకంగా ఉన్నవాడిని ఈ దేశపు మట్టిలో ఎలా కలుపుతానని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడి ముఖం చూడటం కూడా తనకు ఇష్టం లేదంటూ వెళ్లిపోయారు. బీకాం చదివిన సైఫుల్లా.. రెండున్నర నెలల క్రితం తండ్రి మీద కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎప్పుడూ వాట్సప్ చూసుకోవడం తప్ప ఏమీ చేయడం లేదని ఆయన తిట్టడమే అందుకు కారణం. దుబాయ్ వెళ్లి అక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకుంటానని, అందుకోసం వీసా సంపాదించేందుకు ఢిల్లీ వెళ్తున్నానని సైఫుల్లా చెప్పాడు. సరిగ్గా అదే సమయానికి అతడి స్నేహితుడు ఆతిఫ్ ముజఫర్ కూడా తాను ఢిల్లీ వెళ్లి ఏదైనా ఉద్యోగం చేసుకుంటానంటూ తన తల్లి మీద ఒత్తిడి తెస్తున్నాడు. అతడికి తండ్రి లేరు. అతడిని పంపడానికి తల్లికి ఇష్టం లేదు. అన్నతో కలిసి డెయిరీ వ్యాపారం చూసుకొమ్మని తాను చెప్పానని, కానీ అతడు తన మాట వినకపోగా, తనకు చెప్పకుండా వెళ్లిపోయాడని ఆమె వాపోయారు. నిజానికి వీళ్లిద్దరూ కలిసి వెళ్లింది ఢిల్లీ కాదు.. కాన్పూర్! అక్కడ ఉగ్రవాద సంస్థలతో వీరికి పరిచయం ఏర్పడింది. ఇంట్లో ఉన్నప్పుడు కూడా సైఫుల్లా తెల్లవారుజామునే ఇంట్లోంచి వెళ్లిపోయి అర్ధరాత్రి వచ్చేవాడని, ఇంట్లో ఉన్నా సెల్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ చూసుకుంటూ కూర్చునేవాడని సర్తాజ్ ఖాన్ చెప్పారు. అతడి గాడ్జెట్లను ఎవరైనా ముట్టుకున్నా విపరీతమైన కోపం వచ్చేదని.. పిల్లలను కూడా ముట్టుకోనిచ్చేవాడు కాడని అన్నారు. తనకు మంచి ఉద్యోగం దొరికిందని.. కుటుంబంలో ఎవరూ ఎప్పుడూ ఊహించలేనంత పెద్ద మొత్తం సంపాదిస్తానని ఆ తర్వాత తన అన్నతో సైఫుల్లా చెప్పాడు. సైఫుల్లాకు ఉన్న మరో స్నేహితుడు ఆతిఫ్, అతడి బంధువు డానిష్ తరచు గంగానది ఒడ్డున కలుస్తుండేవారు. వీళ్లందరికీ టీ అంటే ఇష్టం. అక్కడే కూర్చుని పలు కప్పులు తాగేవారు. కానీ టీ తాగేటప్పుడు కూడా ఫోన్లలో వీడియోలు చూస్తూనే ఉండేవారు తప్ప తనవైపు కూడా చూసేవారు కారని అక్కడి టీ దుకాణం యజమాని అన్నారు. వీళ్లలో ఆతిఫ్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో డిప్లొమా చదివేవాడు. 2013లో తండ్రి చనిపోవడంతో చదువు మానేశాడు. అతడిని ఎవరైనా ఏమైనా అడిగితే ఇట్టే కోపం వచ్చేసేదని అతడి సోదరుడు తెలిపారు. గత రెండు నెలల్లో ఆతిఫ్ తన తల్లికి ఫోన్ చేసినా, ఆమె మాట్లాడేవారు కారు. చిట్టచివరిసారిగా తన అక్కకు ఫోన్ చేసి, ముంబైలో ఉద్యోగం వచ్చిందని చెప్పాడని, ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేయలేదని అతడి తల్లి తెలిపారు. సుమారు పది నెలల క్రితం ఎవరికీ చెప్పకుండా ఆతిఫ్ సౌదీ అరేబియాలో హజ్ యాత్రకు వెళ్లాడని అంటున్నారు. అందుకోసం కుటుంబానికి చెందిన భూమిని 22 లక్షల రూపాయలకు అతడు అమ్మేశాడు. ఆతిఫ్, డానిష్లతో పాటు అలీగఢ్ యూనివర్సిటీకి చెందిన వాళ్ల స్నేహితుడు ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. -
ఉగ్రవాది సైఫుల్లా హతం
ఐసిస్‌లోని ఖురాసన్ మాడ్యుల్లో సైఫుల్లా క్రియాశీల వ్యక్తి: ఏటీఎస్ లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో శివారులోని ఓ ఇంట్లో దాక్కున్న అనుమానిత ఐసిస్ ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకునేందుకు 12 గంటలపాటు సాగిన ఆపరేషన్ ముగిసింది. ఎదురుకాల్పుల్లో అనుమానిత ఉగ్రవాది సైఫుల్లా మరణించి నట్లు పోలీసులు తెలిపారు. ‘తొలుత ఒకరి కంటే ఎక్కవ మంది ఉగ్రవాదులు ఇంట్లో నక్కినట్లు అనుమానించాం. ఇంట్లోకి ప్రవే శించిన బలగాలు.. అక్కడ ఆయుధాలతో పాటు పడిఉన్న ఉగ్రవాది మృతదేహాన్ని గుర్తించాయి. ప్రస్తుతానికి ఆపరేషన్ ముగిసినట్లే’ అని యూపీ అదనపు డీజీపీ దల్జీత్ చౌదరి బుధవారం తెలిపారు. యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ (ఏటీఎస్) ఐజీ అసీమ్ అరుణ్ మాట్లాడుతూ, ఈ ఉగ్రవాది ఐసిస్‌లోని ఖురాసన్ మాడ్యు ల్లో క్రియాశీల వ్యక్తి అని చెప్పారు. మంగళ వారం భోపాల్–ఉజ్జయిని ప్యాసింజర్ రైల్లో జరిగిన పేలుడుతో ఇతడికి సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దేశద్రోహి నా కొడుకు కాలేడు.. ‘ఓ దేశద్రోహి నా కొడుకు కాలేడు’ అని అనుమానిత ఉగ్రవాది సైఫుల్లా తండ్రి సర్తాజ్ అన్నారు. సైఫుల్లా మృతదేహాన్ని తీసుకునేందుకు నిరాకరించిన సర్తాజ్.. ‘ఓ దేశద్రోహితో నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని పేర్కొన్నారు.