Hizb-ul-Mujahideen
-
ఆ కారు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదిదే
పుల్వామా : జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో పేలుడు పదార్థాలతో ఉన్న సాంట్రో కారును గురువారం స్థానిక బలగాలు గుర్తించిన విషయం తెలిసిందే. గురువారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు తాజాగా సమాచారాన్ని అందించారు. సుమారు 20 కిలోల పేలుడు పదార్థాలు కలిగి ఉన్న సాంట్రో కారు ఓనర్‌ను గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. ఆ కారు హిదాయతుల్లా మాలిక్ అనే వ్యక్తిది అని తేల్చారు. కాగా సోఫియాన్ జిల్లాకు చెందిన హిదాయతుల్లా గత ఏడాది హిజ్బుల్ ముజాహిద్దీన్ టెర్రరిస్ట్ గ్రూఫ్‌లో చేరాడు. కాగా గురువారమే కారులో ఉన్న ఐఈడీని(ఎక్స్‌ప్లోజివ్ డివైజ్) బాంబ్ స్వ్వాడ్ టీమ్‌తో ఆపరేషన్ నిర్వహించి పేల్చివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు పేర్కొన్నారు. కాగా రెండు వారాల కింద పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు జమ్మూ కశ్మీర్ పోలీసులపై హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కాగా భద్రతా బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.కాగా, గత సంవత్సరం పుల్వామాలో జరిగిన ఐఈడీ వాహన దాడిలో 40 మంది భద్రతా సిబ్బంది మరణించిన సంగతి తెలిసిందే. (జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం) -
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల కోసం వేట
కశ్మీర్ : మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు, హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ రియాజ్ నైకూను మే 6న భారత బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. దీంతో హిజ్బుల్ కొత్త కమాండర్‌గా సైఫుల్లాను నియమించారు. దీని గురించి సమాచారం అందుకున్న భారత సైనికులు సైఫుల్లాతో పాటు కశ్మీర్లో కరడుగట్టిన ఉగ్రవాదులుగా పేరొందిన 10 మందిని హతం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆపరేషన్ చేపట్టారు. కాగా అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌లో జమ్ము కశ్మీర్లో 28 ఉగ్రవాదులను సైన్యం మట్టికరిపించింది. అలాగే ఎల్వోసీ వద్ద ఇప్పటివరకు 64 మంది ముష్కరులను హతం చేసింది. 2018లో 215, 2019లో 152 మంది ఉగ్రవాదులను భారత సైనికులు చంపేశారు. ఇదిలా వుండగా తాజాగా కశ్మీర్ లోయలో టాప్ టెన్ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు అధికారులు సంసిద్ధమయ్యారు. (కశ్మీర్లో 64 మంది ఉగ్రవాదుల ఏరివేత) టాప్ టెన్ ఉగ్రవాదులు: వారు పని చేసే సంస్థలు ► సైఫుల్లా (కోడ్ నేమ్: ఘజీ హైదర్ లేదా డాక్టర్ సాహిబ్)- హిజ్బుల్ ముజాహిద్దీన్ ► మహ్మద్ అష్రఫ్ ఖాన్ (కోడ్ నేమ్: అష్రఫ్ మాల్వీ, మాన్సూర్ ఉల్ ఇస్లాం) - హిజ్బుల్ ముజాహిద్దీన్ ► జునైద్ సెహ్రి- హిజ్బుల్ ముజాహిద్దీన్ ► మహ్మద్ అబ్బాస్ షైఖ్ (కోడ్ నేమ్: తురబీ మాల్వీ) - హిజ్బుల్ ముజాహిద్దీన్ ► జాహిద్ జర్గార్ - జైషే మహమ్మద్ ► షాకుర్- లెట్ ► ఫైసల్ భాయ్ - జైషే మహమ్మద్, ఏ ప్లస్ ప్లస్ కేటగిరీలో ఉన్న కరుడుగట్టిన ఉగ్రవాది ► షేరజ్ ఎల్ లోన్ (కోడ్ నేమ్: మాల్వీ) ► సలీమ్ పరాయ్ - జైషే మహమ్మద్ ► ఓవైస్ ముల్లిక్ - లెట్ -
హిజ్బుల్ ఉగ్రవాది అరెస్ట్
సాక్షి, శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు శుక్రవారం హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన్ కీలక ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నాయి. పుల్వామా జిల్లాలోని అడవుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో పోలీసులు భద్రతా బలగాలు శుక్రవారం ఉదయం నుంచి కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నాయి. ఈ కార్డన్ సెర్చ్‌లో భాగంగానే ఫస్తూరా అడవుల్లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇదే సమయంలో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన గుల్జార్ దార్ అనే ఉగ్రవాదిని.. అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల కోసం ఇంకా గాలింపు చర్యలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
భారత్‌లో ఉగ్రచర్యలకు భారీ విరాళాలు!
న్యూఢిల్లీ: భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చేందుకు పాకిస్థాన్‌కు చెందిన హిజ్బుల్ ముజాహిద్దీన్ (హెచ్ఎం) భారీ ఎత్తున విరాళాలు సేకరింస్తోంది. గత ఎనిమిదేళ్లలో పాక్‌లోని వివిధ వర్గాల నుంచి ఆ ఉగ్రవాద గ్రూపు రూన. 80 కోట్లకుపైగా వసూలు చేసిందని భారత దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు. 'భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించేందుకు హెచ్ఎం చురుగ్గా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు గత ఎనిమిదేళ్లలో ఆ సంస్థ రూ. 80 కోట్లు వసూలు చేసింది' అని వారు అంతర్జాతీయ సంస్థ అయినా పారిస్‌లోని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్‌కు నివేదించారు. 'భారత్‌కు ఈ నిధులు చేరగానే వీటిని వివిధ మార్గాల ద్వారా మళ్లించి క్రియాశీలంగా ఉన్న ఉగ్రవాదులు, మరణించిన హిబ్బుల్ ఉగ్రవాదుల కుటుంబసభ్యులకు అందజేస్తారు' అని టాస్క్‌ఫోర్స్ తన నివేదికలో పేర్కొంది. విదేశాల్లో కూడా నిధులు సేకరించి.. తమ ముసుగు సంస్థలకు ఆ సొమ్మును చేరవేస్తున్నారని వెల్లడించింది. పారిస్ దాడుల నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్ సభ్య దేశాలు ఉగ్రవాద గ్రూపులకు నిధులు ఎలా అందుతున్నాయి. వాటిని ఆపేది ఎలా అనే దానిపై చర్చించారు. ఈ నేపథ్యంలో పారిస్ తరహాలో గతంలో జరిగిన ముంబై దాడులను ప్రస్తావించిన భారత్.. పాక్‌లోని ఉగ్రవాద సంస్థలు యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న తీరును సభ్య దేశాల దృష్టికి తీసుకొచ్చింది. పాకిస్థాన్ తన భూభాగంలో ఉగ్రవాదుల యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతి ఇస్తున్నదని, తన గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కన్నుసన్నల్లోనే ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు జరుగుతున్నాయని భారత్ ఎన్నోసార్లు అంతర్జాతీయ వేదికలపై స్పష్టం చేసింది. 2011 సెప్టెంబర్ 7న ఢిల్లీ హైకోర్టు వద్ద హిబ్బుల్ జరిపిన పేలుళ్లలో 17 మంది మరణించగా, 76 మంది గాయపడ్డారు.