
వీధుల్లో స్టెప్పులు వేసిన హీరోయిన్!
వీధుల్లో తీర్మార్ మ్యూజిక్ వస్తుంటే ఎవరికైనా కాలు కదుపాలనిపిస్తుంది. అదే లైవ్ సంగీతంతో వీధులు ఊగిపోతుంటే డ్యాన్స్ చేయాలని ఎవరికి అనిపించదు. అందుకే బాలీవుడ్ బబ్లీ బ్యూటీ అనుష్క శర్మ వీధుల్లో ఇలా స్టెప్పులు వేసింది. ఓ కూల్ డ్యాన్సర్ తో కలిసి అదరగొట్టే డ్యాన్సులు చేసింది.
2008లో షారుఖ్ ఖాన్‌తో జతకట్టి ‘రబ్ నే బనాదీ జోడీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మరోసారి కింగ్‌ఖాన్‌తో కలిసి నటిస్తోంది. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ద రింగ్’ సినిమా షూటింగ్‌లో భాగంగా షారుఖ్, అనుష్క ప్రస్తుతం యూరప్‌లో ఉన్నారు. షూటింగ్‌లో ఎంత బిజీగా ఉన్నా కాస్త తీరిక దొరికితే హ్యాపీగా గడపడం అనుష్క స్టైల్. అందుకే పోర్చుగల్‌లోని లిస్బెన్ వీధుల్లో లైవ్ మ్యూజిక్ వేడుకలో ఇలా చిందులు వేసింది. ఓ కూల్ డ్యాన్సర్‌తో కలిసి ఉత్సాహం ఉరకలేసేలా నర్తించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఆమె డ్యాన్స్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.