హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం అనేది సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక. వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య ఇద్దరు వ్యక్తులు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించే అద్భుత ఘట్టం. అయితే రానురానూ ఈ వేడుకలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కన్యాదానం, అప్పగింతలు, ముహూర్తాలూ ఇలాంటివేం పట్టించుకోకుండా తమకు నచ్చినట్లు కానిచ్చేస్తున్నారు. తాజాగా పెళ్లిలో వధూవరుల్దిరూ కలిసి అగ్ని హోత్రం చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీనిని వీడియోను బిర్లా ప్రెసిషన్ టెక్నాలజీస్ ఛైర్మన్, ఎండీ వేదాంత్ బిర్లా తన ట్విట్టర్‌లో షేర్ చేశారు.
సప్తపదిలో భాగంగా వధూవరులిద్దరూ పవిత్రమైన అగ్ని చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు చేయడం హిందూ వివాహాలలో ఒక ముఖ్యమైన లక్షణం. కానీ బిర్లా పోస్టు చేసిన వీడియోలో మాత్రం ఈ వేడుకలో వధూవరులు నృత్యం చేస్తుంటే అతిథులు వారిని ఉత్సాహపరుస్తున్నారు. అయితే దీనిని బిర్లా వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. ‘ఇది పెళ్లి లేదా మన సాంప్రదాయ విలువలను వదిలేయడమా.. ఈ ప్రపంచంలో మీరు గొప్పవారిగా భావిస్తే అది మీ సంస్కృతి, విలువల వల్లనే అని మర్చిపోవద్దు’ అని కామెంట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే లక్షలమంది వీక్షించగా వేలల్లో కామెంట్ చేస్తున్నారు. ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. దీనిపై అనేక మంది తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. వీరిలో ఎక్కువగా పెళ్లిలో అలా డ్యాన్స్ చేయడం అసహ్యకరంగా ఉందని, విలువలను అగౌరపరిచే విధంగా ఉందని కామెంట్ చేస్తున్నారు.
‘ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు కేవలం ఫోటోగ్రఫీ కోసం కోసమే అన్న విధంగా మారిపోయాయి. ఈ ఫోటోలు, వీడియోలను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో షేరేచేందుకు వారి ఆరాటమంతా.. విలువలకు, సంప్రదాయాలకు ఏమాత్రం గౌరవం లేకుండా పోయింది. పెళ్లిలో ఇలా కూడా చేస్తారా. ఇది మన సంస్కృతి కాదు’ అని హితవు పలుకున్నారు. అయితే అనేకమంది విమర్శిస్తుంటే ఓ వర్గం వారు మాత్రం సానూకూలంగా స్పందిస్తున్నారు. వధూవరూలు నృత్యం చేయడంతో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. వేడుక ఎలా చేసుకోవాలనేది వాళ్ల ఇష్టం. ఈ వీడియో చూడమని ఎవరిని మనం ఇంకా 18వ శతాబ్దంలోనే ఉంటున్నాం.. అని అంటున్నారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment