డ్యాన్సింగ్ వీడియోలు సోషల్ మీడియాలో పాపులర్ కావడం అనేది కొత్త విషయమేమీ కాదు. అయితే అమ్మాయిల బృందం చేసిన ఈ డ్యాన్స్ వీడియో వారం రోజుల వ్యవధిలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 1.1 మిలియన్ వ్యూలను సొంతం చేసుకుంది. ‘అసలు కంటే కాపీ ముద్దు’ అనే సామెత లేదుగానీ ఈ వీడియో క్లిప్ చూస్తే అలాగే అనిపిస్తుంది.
‘షాదీ మే జరూరు ఆనా’ అనే హిందీ సినిమాలోని ‘పల్లో లట్కే’ సాంగ్‌కు ఈ యువబృందం వేసిన స్టెప్పులు ‘అహా’ అనిపించాయి. ‘ఏబీసీడీ డ్యాన్స్ ఫ్యాక్టరీ’ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘అప్పుడెప్పుడో పెళ్లిసంబరాల్లో డ్యాన్స్ చేసేదాన్ని. ఈ వీడియో చూస్తుంటే...నా మొఖాల నొప్పులను పక్కనపెట్టి డ్యాన్స్ చేయాలని ఉంది’ అని కామెంట్ పెట్టింది 69 సంవత్సరాల రాధాబాయి. వీడియో తెగ వైరల్ అయిందని చెప్పడానికి ఇంతకు మించిన కామెంట్ అక్కర్లేదేమో!
పల్లో లట్కే
Published Sun, Apr 23 2023 6:22 AM | Last Updated on Sun, Apr 23 2023 6:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment