Russia Ukraine War Crisis: President Zelensky Old Dance Video With Stars Goes Viral - Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు: అప్పుడు లేడీ స్టార్స్‌తో.. ఇప్పుడు యుద్ధభూమిలో!

Feb 27 2022 3:15 PM | Updated on Feb 27 2022 5:50 PM

Russia Ukraine Crisis: Ukraine President Old Dance Video - Sakshi

నేడు క్లిష్ట సమయంలో దేశాన్ని ముందుండి నడిపించి అందరి హృదయాలను గెలుచుకున్నాడు..

Volodymyr Zelenskyy Dance Video: రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలన్స్కీ సైన్యానికి వెన్నుదండగా నిలవడమే కాక తాను సైతం సైనికుడిలా పోరాడుతున్నాడు. అంతేకాదు ఉక్రెయిన్‌ దళలు రష్యన్‌ బలగాలను ఎదుర్కొవడం కష్టమని తెలిసి కూడా ఆయన ఎంతో ధైర్యంగా ముందుండి సైన్యాన్ని నడపించటమే కాకా తమ దేశాన్ని కాపాడుకుంటాం అన్నారు.

ఒక పక్క ఉక్రెయిన్‌ సైనిక స్థావరాలను రష్యా దాడులతో మట్టుబెట్టి, యుద్ధ ట్యాంకులను స్వాధీనం చేసుకున్నప్పటికీ ఏ మాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా తనదైన యుద్ధ ‍వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. నిర్విరామ యుద్ధంతో అలిసిపోతున్నా మా భూమిని రక్షించుకుంటాం అని చెబుతూనే ఉన్నారు. 

ఈ ఉక్రెయిన్‌ ఉద్రిక్తల సమయంలో జెలెన్సీ హిరోల ప్రపంచ దృష్టిని ఆకర్షించడమే కాక అందరి ప్రశంసలను అందుకున్నారు. అయితే ఆయన 2006లో ఒక  డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొన్నప్పుడు కూడా అంతే పాపులర్‌ అయ్యాడు. డ్యాన్సింగ్ విత్ ది స్టార్స్ వేదికపై తన భాగస్వామి ఒలెనా షాప్టెంకోతో కలిసి మంచి ప్రదర్శన చేసి విజేతగా నిలిచాడు. ఈ ఉక్రెయిన్‌ ఉద్రిక్తల నడుమ జెలన్సీ అలనాటి నృత్య ప్రదర్శన వీడియో ప్రస్తుతం ట్విట్టర్‌లో వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు ఈ వ్యక్తి చేయలేనిదంటూ ఏమిలేదు అని జెలన్స్కీని ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు.​

(చదవండి: రష్యా మిలటరీ కాన్వాయ్‌కి అడ్డుగా నిలుచుని ఆపేందుకు యత్నం!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement