
స్లైసర్స్... మీకు మంచి హెల్పర్స్!
అతిథులు వచ్చారు. పెట్టడానికి ఫ్రూట్స్ తప్ప ఏమీ లేవు. వాటిని కడిగి, ముక్కలుగా కోసి పెట్టేసరికి లేటవుతుందేమోనని టెన్షన్ పడతాం. ఇంట్లో ఫంక్షన్ ఉంటుంది.
వాయనం: అతిథులు వచ్చారు. పెట్టడానికి ఫ్రూట్స్ తప్ప ఏమీ లేవు. వాటిని కడిగి, ముక్కలుగా కోసి పెట్టేసరికి లేటవుతుందేమోనని టెన్షన్ పడతాం. ఇంట్లో ఫంక్షన్ ఉంటుంది. ఏ ఫ్రూట్ సలాడో, ఫుడ్డింగో చేద్దామనుకుంటాం. కానీ అన్ని పండ్లు ఎలా కోయాలా అని ఫీలవుతాం. పెద్ద మొత్తంలోను, తక్కువ సమయంలోను కోయాల్సి వచ్చినప్పుడు పడే ఈ ఇబ్బందిని తీర్చడానికే రకరకాల స్లైసర్స్ వచ్చాయి. ఏ పండునైనా కోయడానికి స్లైసర్ ఉందిప్పుడు. కొన్ని తక్కువ ధరలోనే లభిస్తుంటే, కొన్నిటికి కాస్త ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అన్నీ ఒకసారి కొనలేకపోతే అప్పుడప్పుడూ ఒక్కోటి కొని పెట్టుకోండి. ఎందుకంటే ఇవి మీకెప్పటికీ ఉపయోగమే!
ఇలా చేయండి చాలు!
నెగైల్లా లాసన్... ప్రపంచ ప్రఖ్యాతి చెందిన చెఫ్. వంటలు అద్భుతంగా చేయడంలోనే కాదు, వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో నేర్పరి ఆమె. తనకు తెలిసిన కొన్ని చిట్కాలను అందరికీ చెబుతూ ఉంటుంది కూడా. అందులో ఇవి కొన్ని...
మూకుడు జిడ్డు వదలకుండా విసిగిస్తుంటే... దానిలో కాసిన్ని నీళ్లు, కొద్దిగా వాషింగ్ పౌడర్ వేసి ఐదు నిమిషాల పాటు స్టౌమీద మరిగించాలి. ఆ పైన మంచి నీటితో కడిగితే మూకుడు మెరుస్తుంది!
ఉల్లిపాయలు కోసేటప్పుడు ఓ కొవ్వొత్తిని వెలిగించి పక్కన పెట్టుకోండి. ఇక మీ కళ్లు మండవు!
వంటగదిలో ఎప్పుడూ కలబందను ఉంచుకోండి. ఎప్పుడైనా పొరపాటున చేయి కాలితే కాస్త కలబంద రసం వేయండి. మంట మాయమౌతుంది!
ైవైట్ వెనిగర్‌లో కాసింత బేకింగ్ సోడా వేసి, ఆ మిశ్రమంలో ముంచి తీసిన బట్టతో మైక్రో అవన్‌ని తుడవండి. కొత్తదానిలా మెరుస్తుంది!
చేతులకు నూనె, పిండి లాంటివి అంటుకుని వదలకపోతే ఉప్పుతో రుద్దుకోండి. ఒకవేళ వాసన వదలకపోతే కాసింత కరివేపాకును గానీ, కొత్తిమీరను కానీ తీసి రుద్దండి!