
న్యూఢిల్లీ: సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వేలంలో ప్రధాని మోదీకి చెందిన వస్తువులు భారీ ధర పలుకుతున్నాయి. వీటిలో వెండి కలశం, మోదీ ఉన్న ఓ ఫొటో స్టాండ్‌లు సోమవారం జరిగిన వేలంలో ఒక్కొక్కటీ కోటి రూపాయలు పలికాయి. అందులో కలశం ప్రారంభ ధర రూ. 18 వేలు కాగా వేలంలో ఏకంగా రూ. కోటీ మూడు వందలకు అమ్ముడైంది. ఫొటో స్టాండ్ ధర రూ. 500 కాగా, రూ. కోటి వంద రూపాయలకు అమ్ముడైంది. దూడకు పాలు ఇస్తున్న గోమాత స్వరూపం ప్రారంభ ధర రూ. 1,500 కాగా వేలంలో రూ. 51 లక్షలకు అమ్ముడైంది.
Comments
Please login to add a commentAdd a comment