న్యూఢిల్లీ: ఎల్‌ఐసీ భారీ ఐపీవో విషయంలో న్యాయసేవలు అందించే సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. న్యాయ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించడం ఇది రెండో పర్యాయం కావడం గమనార్హం. తొలుత జూలై 15న రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ/ప్రతిపాదనలు) విడుదల చేసి ఆగస్ట్ 6వరకు గడువు ఇచి్చంది. తగినంత స్పందన రాకపోవడంతో పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) మరో విడత న్యాయ సేవల సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలకు ఆహా్వనం పలుకుతూ గురువారం ఆర్‌ఎఫ్‌పీని విడుదల చేసింది. మొదటి విడత తగినంత స్పందన రాలేదని స్పష్టం చేసింది. ఐపీవో, క్యాపిటల్ మార్కెట్ల చట్టాల విషయంలో తగినంత అనుభవం కలిగిన ప్రముఖ సంస్థల నుంచి ప్రతిపాదనలను ఆహా్వనించింది. ఎల్‌ఐసీ ఐపీవో కోసం గత వారమే 10 మంది మర్చంట్ బ్యాంకర్లను దీపమ్ ఎంపిక చేయడం గమనార్హం. దేశ చరిత్రలోనే అతిపెద్ద నిధుల సమీకరణగా ఎల్‌ఐసీ ఐపీవో రికార్డు సృష్టించనుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment