న్యూఢిల్లీ: కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న ఫ్యూచర్ రిటైల్ పట్ల ఆసక్తి కలిగిన సంస్థలు బిడ్లు దాఖలు చేసేందుకు మరో రెండు వారాల గడువు లభించింది. వాస్తవానికి ఈ గడువు అక్టోబర్ 20నే ముగిసిపోవాలి. భారీ రుణ భారంతో ఉన్న ఫ్యూచర్ రిటైల్ బిడ్ల దాఖలు గడువును నవంబర్ 3 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటన వెలువడింది.
ఈ నెల 20 నాటికి బిడ్లు దాఖలు చేసిన సంస్థలు, సవరించిన బిడ్‌ను కూడా తిరిగి సమర్పించొచ్చని తెలియజేసింది. కనీసం రూ.100 కోట్ల నెట్‌వర్త్ కలిగి ఉండాలని, నిర్వహణ ఆస్తులు లేదా పెట్టుబడులు పెట్టేందుకు రూ.250 కోట్లు ఉండాలన్న షరతులను రిజల్యూషన్ ప్రొఫెషనల్ విధించారు. ఫ్యూచర్ రిటైల్‌కు సంబంధించి సెప్టెంబర్ 2 నాటికి రూ.21,433 కోట్ల బకాయిల మేరకు క్లెయిమ్‌లు దాఖలు కావడం గమనార్హం.
చదవండి: షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే!
Comments
Please login to add a commentAdd a comment