Big Bazar
-
ఫ్యూచర్ రిటైల్‌కు బిడ్స్ దాఖలు గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న ఫ్యూచర్ రిటైల్ పట్ల ఆసక్తి కలిగిన సంస్థలు బిడ్లు దాఖలు చేసేందుకు మరో రెండు వారాల గడువు లభించింది. వాస్తవానికి ఈ గడువు అక్టోబర్ 20నే ముగిసిపోవాలి. భారీ రుణ భారంతో ఉన్న ఫ్యూచర్ రిటైల్ బిడ్ల దాఖలు గడువును నవంబర్ 3 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటన వెలువడింది. ఈ నెల 20 నాటికి బిడ్లు దాఖలు చేసిన సంస్థలు, సవరించిన బిడ్‌ను కూడా తిరిగి సమర్పించొచ్చని తెలియజేసింది. కనీసం రూ.100 కోట్ల నెట్‌వర్త్ కలిగి ఉండాలని, నిర్వహణ ఆస్తులు లేదా పెట్టుబడులు పెట్టేందుకు రూ.250 కోట్లు ఉండాలన్న షరతులను రిజల్యూషన్ ప్రొఫెషనల్ విధించారు. ఫ్యూచర్ రిటైల్‌కు సంబంధించి సెప్టెంబర్ 2 నాటికి రూ.21,433 కోట్ల బకాయిల మేరకు క్లెయిమ్‌లు దాఖలు కావడం గమనార్హం. చదవండి: షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే! -
బిగ్ బజార్ బంపర్ ఆఫర్: రూ. 1500 షాపింగ్ చేస్తే రూ. 1000 క్యాష్ బ్యాక్
ఈ కరోనా మహమ్మారి కాలంలో ఆదాయం లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఫ్యూచర్ గ్రూపునకు చెందిన రిటైల్ చైన్ బిగ్ బజార్ గుడ్ న్యూస్ తెలిపింది. తన వినియోగదారుల కోసం బిగ్ బజార్ 2021 మే 22 నుంచి మే 31 వరకు 'బిలీవ్ ఇట్ ఆర్ నాట్' ఆఫర్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్ కింద రూ.1500ల షాపింగ్ చేసిన వారికి రూ.1000 వరకు క్యాష్ బ్యాక్ అందించనున్నట్లు పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అనేక రాష్ట్రాలు పాక్షిక లాక్డౌన్ / పూర్తి లాక్డౌన్ విధించినందున బిగ్ బజార్ వినియోగదారులు బిగ్ బజార్ ఆన్లైన్ యాప్‌లో లేదా బిగ్‌బజార్‌లోని స్టోర్ షాపులో షాపింగ్ చేయడం ద్వారా ఈ ఆఫర్‌ను పొందగలరు. బిగ్ బజార్ ఆన్లైన్ యాప్ ద్వారా కొనుగోలు చేసిన వాటిపై కూడా రూ.1000 క్యాష్‌బ్యాక్, బుక్ చేసిన 2 గంటలలో హోమ్ డెలివరీ చేయనున్నట్లు తెలిపింది. "ఇంటి నుంచి షాపింగ్ చేయవచ్చు లేదా కరోనా మార్గదర్శకాల ప్రకారం వారు తమ సమీప దుకాణాన్ని సందర్శించవచ్చు" అని ఫ్యూచర్ గ్రూప్ గ్రూప్ సీఎమ్ఓ, డిజిటల్, మార్కెటింగ్, ఈ-కామర్స్ పవన్ సర్దా అన్నారు. దేశవ్యాప్తంగా 150కి పైగా నగరాల్లో స్టోర్స్ కలిగి ఉన్న బిగ్ బజార్ ఫ్యూచర్ గ్రూప్ చెందింది. ఇంటరాక్టివ్ డిజిటల్ స్క్రీన్లు, సిట్-డౌన్ చెక్ అవుట్స్, స్మార్ట్ కస్టమర్ సర్వీస్ వంటి ఆవిష్కరణలతో ఉన్నతమైన షాపింగ్ అనుభవాలను బిగ్ బజార్ అందిస్తుంది. చదవండి: ప్రతి నెల పది వేల పెన్షన్ పొందాలంటే.. -
బిగ్ బజార్లో గాయకుడి చేతివాటం
కర్ణాటక, యశవంతపుర : తన మధురమైన స్వరంతో ప్రేక్షకులను రంజింపచేసిన పాపులర్ గాయకుడు తులసి ప్రసాద్ బిగ్ బజార్లో చోరీ చేస్తూ పట్టుపడినట్లు ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. మంగళవారం నగరంలోని బిగ్‌బజార్ వెళ్లిన తులసి ప్రసాద్ వస్తువులను జర్కిన్‌లో ఉంచుకొని తనిఖీ సిబ్బందికి పట్టుబడ్డాడు. పెద్ద సంఖ్యలో అభిమానులున్న మీరు ఇలా వ్యవహరించడం సబబు కాదని సిబ్బంది చెప్పి పంపించారు. -
బిగ్బజార్లలో మ్యాగీపై నిషేధం
-
బిగ్బజార్లలో మ్యాగీపై నిషేధం
మ్యాగీ నూడుల్స్ అమ్మకాలను ఢిల్లీ ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వ దుకాణాలన్నింటి నుంచి తక్షణం మ్యాగీని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం తెలిపింది. దాంతో బిగ్ బజార్ కూడా తమ మాల్స్ అన్నింటి నుంచి మ్యాగీని ఉపసంహరించాలని నిర్ణయించుకుంది. అంటే ఇక బిగ్ బజార్లలో మ్యాగీ ప్యాకెట్లు దొరకవు మాట. సీసంతో పాటు మోనోసోడియం గ్లూటామేట్ మోతాదును మించి అధిక పరిమాణంలో ఉండటంతో దీన్ని నిషేధించారు. మొత్తం 13 శాంపిళ్లను పరీక్షించగా.. వాటిలో 10 శాంపిళ్లలో అనుమతించిన దానికంటే అత్యధిక మోతాదులో సీసం, ఎంఎస్‌జీ ఉన్నట్లు తేలింది. కేంద్రీయ భండార్ సహా ఢిల్లీ ప్రభుత్వ దుకాణాలు అన్నింటిలోనూ మ్యాగీ అమ్మకాలను నిషేధించారు. మ్యాగీ నూడుల్స్‌ను మిస్‌బ్రాండింగ్ చేసింనదుకు జరిమానా వేస్తామని, అలాగే అరక్షిత ఉత్పత్తులను అమ్ముతున్నందుకు నెస్లెపై కేసు పెడతామని ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 10 రాష్ట్రాలు మ్యాగీ నూడుల్స్‌పై నిషేధం విధించడమో.. లేదా శాంపిళ్లను పరీక్షలకు పంపడమో చేశాయి. ఇప్పటివరకు పరీక్షించిన శాంపిళ్లలో 80 శాతం వరకు మనుషులు ఉపయోగించడానికి ప్రమాదకరం అని తేలడంతో మార్కెట్ నుంచి తక్షణం మ్యాగీ ప్యాకెట్లను ఉపసంహరించాలని ఆదేశించినట్లు ఢిల్లీ ఆరోగ్యమంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు. -
అమీర్ పేట బిగ్ బజార్ లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలో రద్దీ ప్రాంతమైన అమీర్ పేట బిగ్ బజార్ లో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్తానికంగా తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా దట్టమైన పొగతో మంటలు ఎగిసిపడుతుండటంతో సహాయ చర్యలకు అంతరాయం కలుగుతోంది. ఈ సంఘటనతో బిగ్ జజార్ సిబ్బంది, జనం ఒక్కసారిగా పరుగులు తీశారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ స్తంభించింది. -
'బిగ్‌బజార్'ను సీజ్చేసిన జీహెచ్ఎంసీ అధికారులు
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని కాచిగూడ ప్రాంతంతో ఉన్న బిగ్‌బజార్ షాపింగ్ మాల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు శనివారం సీజ్ చేశారు. కొంతకాలంగా షాపింగ్ మాల్ యాజమాన్యం ఆస్తి పన్నును చెల్లించకపోవడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ అండ్ స్పెషల్ ఆఫీసర్ ఈ ఆదేశాలు జారీచేశారు. -
బిగ్‌బజార్ సంపూర్ణ మహిళ ముగింపు ఉత్సవం