
సాక్షి, హైదరాబాద్: సింగరేణి ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ మరో మూడు రోజులు కొనసాగనుంది. ఎన్నికల వాయిదా కోరుతూ రాష్ట్ర ఇంధన శాఖ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను సోమవారం విచారించిన తెలంగాణ హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ 21వ తేదీకి వాయిదా వేసింది.
సింగరేణిలో నాలుగేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతుంటాయి. ఈసారి ఎన్నికలు ఇప్పటికే ఆలస్యంగా కాగా.. డిసెంబర్ 27వ తేదీ నిర్వహించడానికి సిద్ధమయ్యారు . ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలై.. ఎన్నికల నిర్వహణ కసరత్తులు జరుగుతున్నాయి.
అయితే.. రాష్టంలో నూతన ప్రభుత్వం అధికారం చేపట్టడం తో పాటు వివిధ విభాగాల సమీక్ష, స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ వెంటనే పార్లమెంట్ ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నందున వాయిదా వేయాలని ఇంధన, వనరుల శాఖ కోరింది. మార్చిలో నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆ శాఖ కార్యదర్శి పేరిట పిటిషన్ దాఖలైంది. అదే సమయంలో వాయిదా యత్నాలను పసిగట్టి ముందే కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన ఏఐటీయూసీ సంఘం. దీంతో ఇంధన, వనరుల శాఖ కార్యదర్శి పిటిషన్ పై స్టే ఇవ్వకుండా విచారణ చేపట్టింది హైకోర్టు.
Comments
Please login to add a commentAdd a comment