20 శాతం సబ్సిడీతో పెంపకం దారులకు రుణాలు | Loans To Farmers With Subsidy Of 20 Percent | Sakshi
Sakshi News home page

20 శాతం సబ్సిడీతో పెంపకం దారులకు రుణాలు

Published Mon, Jun 11 2018 8:55 AM | Last Updated on Mon, Jun 11 2018 8:55 AM

Loans To Farmers With Subsidy Of 20 Percent - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్‌  నాగేశ్వరరావు 

సాక్షి, పెదవాల్తేరు (విశాఖతూర్పు) : రాష్ట్రంలోని గొర్రెలు, మేకల పెంపకం దార్లకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) ద్వారా రూ.275కోట్ల మేర రుణాలు విడుదల చేసిందని గొర్రెలు–మేకల అభివృద్ధి సమాఖ్య రాష్ట్ర చైర్మన్‌ వై.నాగేశ్వరరావు వెల్లడించారు. నగరంలోని  సమాఖ్య కార్యాలయంలో ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ  20 శాతం సబ్సిడీతో రుణాలు  జిల్లా యూనియన్ల ద్వారా అందిస్తున్నట్టు చెప్పారు. లబ్ధిదారులు రుణాలపై పావలా వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. 20 గొర్రెలు, పొట్టేలుకు రూ.లక్ష , 50 గొర్రెలు, రెండు పొట్టేళ్లకు రూ.5లక్షలు, వంద గొర్రెలు, 25 పొట్టేళ్లకు రూ.50లక్షలు వంతున బ్యాంకులతో సంబంధం లేకుండా జిల్లా యూనియన్ల ద్వారా రుణాలు అందజేస్తున్నామన్నారు. టీడీపీ లీగల్‌ సెల్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ నర్రా వెంకటరమణమాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చిన తరువాత గొర్రెలు, మేకల పెంపకం దారుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సంఘం చైర్మన్‌ గంటా శ్రీరామ్, తూర్పుగోదావరి జిల్లా చైర్మన్‌ ఆర్‌.సత్తిబాబు, డాక్టర్‌ నీలం శారద, బమ్మిడి అప్పలనాయుడు, జి.నరసింహమూర్తి  పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement