పాయ్ వ్యాఖ్యలు బాధాకరం
Published Thu, Jun 8 2017 1:34 PM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM
బెంగళూరు : ఐటీ పరిశ్రమ ప్రముఖుడు మోహన్ దాస్ చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగుల అసోసియేషన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఐటీలో ఉద్యోగ సంఘాలు ఏర్పాటు చేస్తున్న వారు, భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారివెంట ఉన్న వారెవ్వరికీ ఉద్యోగాలు రాబోవని మోహన్ దాస్ పాయ్ వ్యాఖ్యానించడం చాలా బాధకరమని పేర్కొంటున్నాయి. ఈ కామెంట్లు ఉద్యోగుల రాజ్యాంగ హక్కులకు బహిరంగ ముప్పుగా ఉన్నాయని ఆల్ ఇండియా ఐటీ ఉద్యోగుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ముఖ్విముద్దీన్ అన్నారు. ఐటీ కంపెనీలు అక్రమంగా చేపడుతున్న ఉద్యోగాల కోతపై తాము అంతర్జాతీయ కార్మిక సంస్ధ వద్దకు వెళ్తామని చెప్పారు. ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ కంపెనీకి మాజీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్, హెచ్ఆర్ గా నిర్వర్తించిన పాయ్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని బెంగళూరు ఐటీ ఉద్యోగుల ఫోరమ్ రాజేష్ నటరాజన్ మండిపడ్డారు.
ఐటీ పరిశ్రమలో ఉద్యోగ సంఘాలు ఏర్పాటుచేయాలనుకునేవారు, కొండంత ఉన్నదాన్ని గోరంత చేసి భయాందోళనలు సృష్టిస్తున్నారని, వారికెవరూ సపోర్టు చేయొద్దని, వారితో వెళ్లేవారికి ఉద్యోగాలు రావని మోహన్ దాస్ పాయ్ హెచ్చరించారు. ఇటీవల ఐటీ కంపెనీల్లో చోటు చేసుకున్న భారీ ఉద్యోగాల కోతతో, ఉద్యోగులు యూనియన్లను ఏర్పాటుచేసేందుకు సన్నద్దమవుతున్నారు. యూనియన్లు ఏర్పాటుచేసిన తమ సమస్యలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. కంపెనీలు తమ రెవెన్యూలను కాపాడుకోవడానికి తమపై వేటు వేస్తున్నట్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
Advertisement
Advertisement