Tollywood Lyricist Anantha Sriram Lands In Controversy - Sakshi
Sakshi News home page

Anantha Sriram : చిక్కుల్లో అనంత శ్రీరామ్‌.. అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు

Published Sat, Jan 21 2023 4:14 PM | Last Updated on Sat, Jan 21 2023 4:38 PM

Tollywood Lyricist Anantha Sriram Lands In Controversy - Sakshi

సినీ రచయిత అనంత శ్రీరామ్‌ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవలె పాలకొల్లులో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ “భట్రాజు పొగడ్తలు” అనే పదాన్ని వాడాడు. దీంతో ఆయన వ్యాఖ్యలపై సదరు కులస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ పదం ఇప్పటికే నిషేదించగా భట్రాజులను కించపరిచే విధంగా అనంత శ్రీరామ్‌ వ్యాఖ్యలు చేశారంటూ ఆ కులస్తులు మండిపడుతున్నారు.

నిషేధిత పదాన్ని ఉపయోగించినందున అనంత శ్రీరామ్‌పై చర్యలు తీసుకోవాలంటూ అనంతపురం ఎస్పీకి భట్రాజు కులసంఘాలు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటికే అనంత శ్రీరామ్‌ సదరు వర్గానికి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తుంది. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement